ఉత్తరాంధ్రలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ... ప్రభావం చూపిస్తున్న జనసేన...

AP Assembly Election 2019 : ఫలితాలు వచ్చేందుకు మరో మూడు వారాలు ఉండగా... ఇంతలో ఓ ఆసక్తికర సర్వే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: April 27, 2019, 6:35 AM IST
ఉత్తరాంధ్రలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ... ప్రభావం చూపిస్తున్న జనసేన...
జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అన్నది మే 23 వరకూ చర్చనీయాంశం. దీనిపై ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు, రాజకీయ వ్యూహకర్తలు, టీడీపీ, వైసీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు ఇలా ఎవరికి వారు రకరకాల అంచనాలు, సర్వేలతో తమ తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు. ఇక సోషల్ మీడియాలో రోజుకో రకం సర్వే చక్కర్లు కొడుతోంది. వీటికి తోడు ప్రధాన పార్టీలు సొంత సర్వేలు చేయించుకొని ఫలితాలపై తమదైన లెక్కలు వేసుకుంటున్నాయి. ఐతే... ఉత్తరాంధ్రకు సంబంధించి ఓ సర్వే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో చెప్పిన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రధానంగా ఆ సర్వే ప్రకారం ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో... వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీగా ఉందనీ, ఐతే... వైసీపీకే ఒకింత ఎక్కువ మెజార్టీ వస్తోందని తెలిసింది. ఈ రెండు పార్టీలతో పోటీ పడిన జనసేన కూడా ప్రభావం చూపే స్థాయిలో ఉందని చెప్పడం ఈ సర్వేపై ఆసక్తిని రేపుతోంది.

జిల్లాల వారీగా చూస్తే... విజయనగరం జిల్లాలోని మొత్తం 9 నియోజకవర్గాల్లో వైసీపీ దాదాపు నాలుగు స్థానాల్లో కచ్చితంగా గెలుస్తుందనీ మరో రెండు స్థానాల్లో టీడీపీ, జనసేనతో పోటీ పడుతున్నట్లు ఉందని తేలింది. అదే సమయంలో... టీడీపీ... మూడు స్థానాల్లో విజయం సాధించి... మరో స్థానంలో వైసీపీతో పోటీ పడుతోందని తెలిసింది. ఇక్కడ జనసేన ఒక స్థానం దక్కించుకునే అవకాశాలున్నాయని ఆ సర్వే చెబుతోంది.

శ్రీకాకుళం జిల్లాను పరిశీలిస్తే... అక్కడ మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా... వాటిలో వైసీపీ కచ్చితంగా ఐదు స్థానాలు గెలుస్తుందనీ, టీడీపీ నాలుగు స్థానాల్లో విజయం సాధిస్తుందనీ, జనసేన ఒక స్థానంలో గెలిచేలా ఉందని తెలిసింది.

విశాఖపట్నం జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉండగా... వైసీపీ కచ్చితంగా 4 స్థానాల్లో గెలుస్తుందనీ, మరో మూడుచోట్ల గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఇక టీడీపీ కచ్చితంగా ఐదు స్థానాల్లో గెలుస్తూ... మరో స్థానంలో గెలిచే అవకాశం ఉందని ఆ సర్వే చెబుతోంది. ఇక్కడ జనసేన రెండు స్థానాల్ని కైవసం చేసుకుంటుందనీ, మరో స్థానంలో గట్టి పోటీ ఇస్తోందని తెలిసింది. కాంగ్రెస్ కూడా ఓ స్థానం దక్కించుకుంటుందని చెబుతోంది.

ఓవరాల్‌గా చూస్తే... మూడు జిల్లాల్లోనూ వైసీపీకి కొద్దిగా ఆధిక్యం కనిపిస్తోందనీ, ఐతే... జనసేన, టీడీపీ కలిస్తే మాత్రం ఆ కూటమిది పై చేయి అవుతుందనీ... మొత్తంగా హోరాహోరీ కనిపిస్తున్నా... వైసీపీ పుంజుకోవడాన్ని బట్టీ... టీడీపీకి ఉత్తరాంధ్రలో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే అంటోంది ఆ సర్వే. ఐతే... దేని ఆధారంగా సర్వే చేసిందీ వివరాలు లేవు. ఏ అంచనాలతో సర్వే ఇచ్చారన్నది కూడా వెల్లడించలేదు. నెటిజన్లు మాత్రం ఆ సర్వేపై తమదైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు దానికి సపోర్ట్ చేస్తుంటే, కొందరు దాన్ని తిరస్కరిస్తున్నారు. ఫలితాలు వచ్చేందుకు ఇంకా 26 రోజులుంది. అప్పటివరకూ ఇలాంటి ఇంకా ఎన్ని సర్వేలు, రిపోర్టులూ తెరపైకి వస్తాయో చూద్దాం.

 

ఇవి కూడా చదవండి :ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో అలర్ట్... ఉగ్రవాద దాడులు జరిగే ప్రమాదం...

పవన్ కళ్యాణ్ బాటలో నాగబాబు... జబర్దస్త్ విషయంలో ఏమన్నారంటే...

మాకొద్దీ ఎన్నికల బెట్టింగ్ బాబోయ్... టెన్షన్ తట్టుకోలేకపోతున్న ప్రజలు...

టార్గెట్ టీడీపీ... ఏపీలో ఓన్లీ వైసీపీ... కేసీఆర్‌తో జగన్ ఏం చర్చించబోతున్నారు...
First published: April 27, 2019, 6:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading