తిరుమలలో పెళ్లి... ఇకపై ఆ సర్టిఫికెట్ ఉండాల్సిందే...

తిరుమలలో పెళ్లి చేసుకోవాలనుకునే వారు ఇకపై కొత్త నిబంధనను కచ్చితంగా పాటించాల్సిందే.

news18-telugu
Updated: November 21, 2019, 2:04 PM IST
తిరుమలలో పెళ్లి... ఇకపై ఆ సర్టిఫికెట్ ఉండాల్సిందే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తమ ఇష్టదైవమైన శ్రీవారు కొలువైన తిరుమలలో పెళ్లి చేసుకోవాలని పలువురు భక్తులు భావిస్తుంటారు. శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలనుకునేవారికి తిరుమలలోని కల్యాణవేదికలో టీటీడీనే ఉచితంగా వివాహాలు జరిపిస్తోంది. దీని కోసం వధువు, వరుడు పుట్టిన తేదీలు, విద్యార్హత పత్రాలు, తల్లిదండ్రుల ఆధారకార్డులు, శుభలేఖ, లగ్నపత్రికను సమర్పించాల్సి ఉంటుంది. వధువు, వరుడు తల్లిదండ్రులు తప్పనిసరిగా వివాహానికి హాజరు కావాలి. ఒకవేళ ఎవరైనా మరణించి ఉంటే వారి డెత్ సర్టిఫికేట్ జత చేస్తేనే ఆ దరఖాస్తును పరిశీలిస్తారు. అయితే తాజాగా దీనిపై టీటీడీ కొత్త నిబంధన తీసుకువచ్చింది.

తిరుమల కల్యాణవేదికలో టీటీడీ ద్వారా పెళ్లి చేసుకోవాలంటే ఇకపై తప్పనిసరిగా వివాహం కాలేదంటూ ధృవీకరణ (అన్ మ్యారీడ్) సర్టిఫికేట్ ఉండాల్సిందేనని టీటీడీ స్పష్టం చేసింది. ఈ మేరకు టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల క్రితమే దీనిపై నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇకపై దానిని కఠినంగా అమలు చేయాలని టీటీడీ భావిస్తోంది. టీటీడీ ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణం ఉంది. కొందరు మహిళలు, పురుషులు... గతంలో పెళ్లి చేసుకుని విడిపోయి... తిరుమలలో రెండో పెళ్లి చేసుకుంటున్నారు. ఇలా తిరుమలలో రెండో వివాహం చేసుకోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో ఇతర పత్రాలతోపాటు అన్ మ్యారీడ్ సర్టిఫికేట్ కూడా జత చేయాలని టీటీడీ అధికారులు నిబంధన విధించారు.
First published: November 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>