NEW RAIL CUM ROAD PACKAGE FROM VIZAG TO ARAKU STARTS DEC 11 SB
డిసెంబర్ 11 నుంచి... అరకు పర్యాటకులకు స్పెషల్ ట్రైన్
ప్రతీకాత్మక చిత్రం
విశాఖ-అరకు ప్రాంతాల మధ్య ఉన్న స్థానిక పర్యాటక ప్రాంతాలను పర్యాటకులు చూసే విధంగా రైల్ కమ్ రోడ్డు సర్వీసులతో ప్యాకేజీని ఏర్పాటు చేశామన్నారు. వీరికి టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్నం స్నాక్స్ టీ, కాఫీ కూడా అందిస్తామన్నారు.
విశాఖ నగరానికి వచ్చే పర్యాటకుల కోసం విశాఖ-అరకు మధ్య ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఐఆర్టీసీ జాయింట్ జనరల్ మేనేజర్ సంజీవయ్య తెలిపారు. విశాఖలోని హరిత భవన్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డిసెంబర్ 11 నుంచి ప్రత్యేక రాోజువారి ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. విశాఖ-అరకు ప్రాంతాల మధ్య ఉన్న స్థానిక పర్యాటక ప్రాంతాలను పర్యాటకులు చూసే విధంగా రైల్ కమ్ రోడ్డు సర్వీసులతో ప్యాకేజీని ఏర్పాటు చేశామన్నారు.
ఒకరోజు ప్యాకేజీ వివరాలు:
విశాఖ-అరకు ప్రాంతాల మధ్య పర్యాటక ప్రదేశాల్ని ఒక రోజులో చూసే విధంగా పర్యాటక శాక అధికారులు ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసకొచ్చారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ రైలును ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ ట్రైన్లో నాలుగు ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగీలు, స్లీపర్ కాస్లు 3, సెకండ్ స్లీపర్ క్లాస్ 10 బోగతలు అందుబాటులో ఉంటాయన్నారు. విశాఖ నుంచి ఉదయం బయల్దేరే ఈ రైలు ప్రయాణికులతో అరకు చేరుకొని అక్కడ్నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా గిరిజన మ్యూజియం, చాపరాయి జలపాతం, పద్మావతి గార్డెన్స్‌కు పర్యాటకుల్ని తీసుకెళ్తారు. అక్కడ మధ్యాహ్న భోజనం అనంతరం రోడ్డు మార్గం ద్వారా అనంతగిరి, కాఫీ ప్లాంటేషన్, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలు తిలకించిన తర్వాత తిరిగి విశాఖ రైల్వే స్టేషన్‌కు తీసుకొస్తామని అధికారులు తెలిపారు.
ప్యాకేజీ ధరల వివరాలు:
విశాఖ-అరకు రైల్ కమ్ రోడ్డు మార్గం ద్వారా త్వరలో అందుబాటులోకి రానున్న ప్యాకేీ ధరలు ఈ విధంగా ఎన్నాయి.విస్టాడోమ్ కోచ్‌లో పెద్దలకు రూ.2467, పిల్లలకు రూ.2215. అదే స్లీపర్ క్లాస్ అయతే పెద్దలకు రూ.1664, పిల్లలకు రూ. 1412గా ఉంది. సెకండ్ క్లాస్ స్లీపర్ క్లాస్‌లో పెద్దలకు రూ.1589, పిల్లలకు రూ.1337గా ధరల్ని నిర్ణయించారు. వీరికి రైల్ కమ్ రోడ్డు మార్గం ద్వారా టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్నం స్నాక్స్ టీ, కాఫీ కూడా అందిస్తామన్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.