ఏపీ రాజధాని అమరావతే... కొత్త ప్లాన్‌ రెడీ చేస్తున్న ప్రభుత్వం

Andhra Pradesh : ఏపీ రాజధాని అమరావతి కాదనీ... వైసీపీ ప్రభుత్వం మరో ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటిస్తుందనే వార్తలు ఇటీవల తెరపైకి వచ్చాయి. వాటన్నింటికీ చెక్ పెడుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

news18-telugu
Updated: October 13, 2019, 6:08 AM IST
ఏపీ రాజధాని అమరావతే... కొత్త ప్లాన్‌ రెడీ చేస్తున్న ప్రభుత్వం
ఏపీ రాజధాని అమరావతే... కొత్త ప్లాన్‌ రెడీ చేస్తున్న ప్రభుత్వం
  • Share this:
Andhra Pradesh : ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే... ఇక రాజధానిని మార్చేస్తారనే ప్రచారం బాగా జరిగింది. దానికి తగ్గట్టుగానే అమరావతిలో రియల్ ఎస్టేట్ పడిపోయింది. రాజధాని చుట్టుపక్కల భూములన్నీ టీడీపీ నేతలు కొనేశారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. అందువల్ల రాజధానిగా అమరావతి కాకుండా మరో ప్రాంతాన్ని ఎంపిక చేస్తారనే ప్రచారం సాగింది. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు కూడా అదే సంకేతాలు ఇచ్చాయి. ఐతే, దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగడం, ప్రభుత్వంపై విమర్శలు రావడంతో... సర్కార్ జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. రైతులు కూడా 33వేల ఎకరాల్ని వెనక్కి తీసుకునేందుకు సిద్ధంగా లేకపోవడంతో... అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిసైడ్ అయినట్లుగా తెలిసింది. అందుకు తగ్గట్టుగానే... ఇదివరకు టీడీపీ సర్కారుకు సింగపూర్ నిపుణులు ఇచ్చిన మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేసి, CRDA (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ)తో కొత్త ప్లాన్ రెడీ చేయాలని ప్రభుత్వం సూచించినట్లు తెలిసింది.

చీప్ అండ్ బెస్ట్ రాజధాని : ఇది వరకు టీడీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి ఐదారు లక్షల కోట్లు కావాలని చెప్పింది. వైసీపీ ప్రభుత్వం మాత్రం... అలాంటి భారీ అంచనాలేవీ వద్దనీ, ఆడంబరాలకు అవకాశం లేకుండా... సింపుల్‌గా తక్కువ ఖర్చుతో... ఉన్నంతలో ది బెస్ట్ రాజధానిని నిర్మించేలా ప్లాన్ ఉండాలని సూచించినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే... రాజధాని ప్రాంతంలో నిర్మించాలనుకున్న వెంకటేశ్వరస్వామి టెంపుల్ విషయంలో కూడా... ఇటీవల ప్రభుత్వం తక్కువ ఖర్చుతోనే నిర్మించేలా ప్లాన్ సిద్ధం చేసింది.

రైతులు వైసీపీ పక్షమే : టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు... కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు ఆ ప్రభుత్వానికే జై కొట్టారు. ఇప్పుడు మాత్రం ఆ జిల్లాల్లో రైతులు పూర్తిగా వైసీపీ పక్షాన ఉన్నట్లు తెలిసింది. ఎన్నికల్లో కూడా రైతులు వైసీపీకే ఓటు వేశారు. అందువల్ల... రాజధానిని తరలిస్తే, రైతుల మద్దతు కోల్పోతామని గ్రహించిన ప్రభుత్వం... రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిసైడైందని సమాచారం. అదీకాక... ఇప్పుడు మళ్లీ కొత్త రాజధాని అంటే... అదో పెద్ద తలనొప్పిగా మారి... ఈ ఐదేళ్లలో అది పూర్తవకపోతే... అప్పుడు టీడీపీ నుంచీ విమర్శలు తప్పవని ప్రభుత్వం భావించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతికే ఫిక్స్ అవ్వడంతో... వైసీపీ ప్రభుత్వం కూడా అదే రూట్‌లో వెళ్లేందుకు సిద్ధపడినట్లు తెలిసింది.

నెక్ట్స్ ఏంటి : రాజధాని అమరావతి ప్లాన్ మొత్తం మారిపోనుంది. కొత్త ప్లాన్ రానుంది. దీనికి సంబంధించి CRDA అధికారులు, సింగపూర్ ప్రతినిధులతో ఆల్రెడీ చర్చించారనీ, త్వరలో చీప్ అండ్ బెస్ట్ ప్లాన్ రానున్నట్లు తెలుస్తోంది. ఓ అంచనా ప్రకారం... కొత్త ప్లాన్‌లో నిర్మాణాలు 25 అంతస్థులకు బదులు 10 అంతస్థులే ఉంటాయి. ప్రభుత్వానికి వచ్చే నిధులెంత... వాటిలో రాజధానికి కేటాయింపులెంత... అన్న అంచనాల్ని బట్టీ రాజధాని ప్లాన్ ఉండనుంది. ఉదాహరణకు సెక్రటేరియట్ పాత ప్లాన్‌లో ఐదు టవర్లున్నాయి. కొత్త ప్లాన్‌లో రెండు టవర్లు మాత్రమే ఉండబోతున్నాయి. ఇలాంటి చాలా పొదుపు నిర్ణయాలు తీసుకొని రాజధానిని నిర్మించబోతున్నారని తెలిసింది.

 

Pics : క్యూట్ స్మైల్ బ్యూటీ కనిహ లేటెస్ట్ స్టిల్స్
ఇవి కూడా చదవండి :


Health : ఈజీగా బరువు తగ్గాలంటే ఎలా... ఇప్పుడు తెలిసిపోయింది... ఇలా చెయ్యండి


Health Tips : 3 వెజిటబుల్ సూప్ రెసిపీలు... ఇలా చేసుకోవచ్చు

Health Tips : బీపీ తగ్గాలా... ఈ జ్యూస్ ఓ గ్లాస్ తాగితే సరి...

Health Tips : బరువు తగ్గాలా... పార్స్‌లీ టీ తాగండి...

Health Tips : టైప్-2 డయాబెటిస్ తగ్గేందుకు ఈ ఆహారం తినండి...
Published by: Krishna Kumar N
First published: October 13, 2019, 6:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading