Home /News /andhra-pradesh /

NEW OTT ESTABLISHED ON NRI IT IS THE FIRST OTT WIHT NO SUBSRIPATION AND FRIENDLY FOR MOVIE PRODUCERS NGS

Free OTT: బంపర్ ఆఫర్.. సబ్‌స్క్రిప్షన్ లేకుండానే సినిమాలు.. తెలుగు ఎన్ఆర్ఐ సరికొత్త ఓటీటీ ప్లాట్‎ఫారమ్.. వివరాలు ఇవే

సరికొత్త ఓటీటీ

సరికొత్త ఓటీటీ

Free OTT: ప్రస్తుతం అంతా ఓటీటీ టైం నడుస్తోంది. ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ లకు మంచి డిమాండ్ ఉంటేంది. అయితే ఏది కావాలన్న కొత్త డబ్బులు చెల్లించి సబ్‌స్క్రిప్షన్ చేసుకుంటేనే వాటిని మనం ఆస్వాదించగలం.. అయితే ఇకపై అలాంటి అవసరం లేదంటున్నాడు ఓ ఎన్ఆర్ఐ.. సరికొత్త ఫ్లాట్ ఫారమ్ ను మనకు అందుబాటులోకి తెస్తున్నారు..

ఇంకా చదవండి ...
  Free OTT Hit Movies: సోషల్ మీడియా (Social Media) వాటకం పెరిగిపోవడం.. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ (Smart Phone) లు ఉండడంతో ఇప్పుడు ఓటీటీ (OTT)లకు క్రేజ్ పెరిగింది. అందరూ వాటిపైనే ఫోకస్ చేస్తున్నారు. ప్రజల్లో వాటికి ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ.. కొత్త కొత్త ఓటీటీలు పుట్టుకొస్తున్నాయి. అయితే అవన్నీ ఎంతకొంత మనీ పే చేసి సబ్‌స్క్రిప్షన్ చేస్తేనే వాటి సేవలు మనం పొందగలం అలాంటి వాటికి చెక్ పెడుతూ ఓ తెలుగు ఎన్‎ఆర్ఐ కొత్త ఓటీటీ ప్లాట్‎ఫారమ్ పరిచయం చేయనున్నారు. ఎన్‎ఆర్ఐ కొల్లు రంజిత్ ‎హైదరాబాద్‌(Hederabad) కు చెందిన తన చిన్ననాటి స్నేహితుడు వెంకట్ యేలేటితో కలిసి, ఈ కొత్త OTT ప్లాట్‌ఫారమ్ – Hit.movieని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఓటీటీని సబ్‌స్క్రయిబ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులు నచ్చిన సినిమాలను మౌస్ క్లిక్‌తో చూడొచ్చు. కానీ ఓ కండిషన్ ఉంది. ఇందులో సినిమా చూడాలంటే టికెట్ కొనుగోలు చేయాలి. మొబైల్, టాబ్లెట్, ల్యాప్‌టాప్, టెలివిజన్, హోమ్ థియేటర్‌లో నచ్చిన చలనచిత్రాన్ని చూడవచ్చు. ఇతర OTTల వలె నిర్మాతాలు తమ డిజిటల్ హక్కులను విక్రయించాల్సిన అవసరం లేదన్నారు. వారు తమ యాజమాన్య హక్కులను వదులుకోవాల్సిన అవసరం లేదని, మధ్యవర్తులు లేరని, ఇది తప్పనిసరిగా నిర్మాత- OTT స్నేహపూర్వక ప్లాట్‌ఫారమ్ అని పేర్కొన్నారు.

  అయితే నిర్మాతలు తమ సినిమాలను ఇందులో రిలీలజ్ చేయాలి అనుకుంటే.. సినిమా వివరాలు, లిస్టింగ్ ఫీజు చెల్లించి, అవసరమైన నో యువర్ కస్టమర్ (KYC) పత్రాలను జోడించిన తర్వాత, వారి చిత్రాల మాస్టర్ ఫైల్‌లను సైట్‌లో అప్‌లోడ్ చేస్తామని చెప్పారు. ” కంటెంట్‌ని ధృవీకరించిన తర్వాత అందులో అభ్యంతరకరమైన కంటెంట్ లేదా పోర్న్ లేవని నిర్ధారించిన తర్వాత సినిమా 72 గంటలు వీక్షకుల కోసం స్ట్రీమింగ్ ఉంటుందన్నారు. సైట్‌లో అప్‌లోడ్ చేసిన చిత్రాలకు డిజిటల్ మార్కెటింగ్, ప్రచారాన్ని హిట్.మూవీ స్వయంగా తీసుకుంటుందని పేర్కొన్న రంజిత్.. ఈ చిత్రాలను 150కి పైగా దేశాల్లో ప్రసారం చేయవచ్చని చెప్పారు.” చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయాలా, లేదా ఎంపిక చేసిన కొన్ని దేశాలు లేదా మాతృదేశంలో మాత్రమే ప్రసారం చేయాలా అనేది నిర్మాతలు నిర్ణయించుకోవాలి” అని రంజిత్ తెలిపారు.

  ఇదీ చదవండి : రామతీర్థం శంకుస్థాపనపై పొలిటికల్ ఫైట్.. టార్గెట్ అశోక్ గజపతి రాజేనా..?

  ఈ వేదికపై టిక్కెట్ ధరలను నిర్మాతలే నిర్ణయిస్తారని రంజిత్ తెలిపారు. “నిర్మాతలు OTT మధ్య ఆదాయం 70:30 ప్రాతిపదికన పంచుకుంటామన్నారు. మేము ప్రతి దేశంలోని టిక్కెట్ల విక్రయాలపై పన్ను చెల్లిస్తామన్నారు. నిర్మాతలు Hit.movie ప్లాట్‌ఫారమ్‌లో తమ సినిమాల ప్రీ-బుకింగ్ ఫీచర్‌ను కూడా ఎంచుకోవచ్చన్నారు.

  ఇదీ చదవండి : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జనవరి కోటా విడుదల.. వర్చువల్ సేవా దర్శన టికెట్లు ఇవే.. ఇలా బుక్ చేసుకోండి

  ప్లాట్‌ఫారమ్ కంటెంట్ భద్రతకు కూడా హామీ ఇస్తుందని, తద్వారా కాపీరైట్ సమస్యలు ఉండవని రంజిత్ చెప్పారు. తాము డొమైన్ ఆధారిత పరిమితులు, కంటెంట్ భద్రతా విధానాలు (CSP), సంతకం చేసిన URLలు, డిజిటల్ హక్కుల నిర్వహణ (DRM) విధానాలను అమలు చేస్తామన్నారు. అంతేకాదు “Hit.Movie అన్ని ప్రధాన బ్రౌజర్‌లలో పని చేస్తుందని హామీ ఇస్తున్నారు. Google TV (Android TV), Apple TV, Firestick కోసం యాప్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డైరెక్ట్ రిలీజ్‌కు థియేటర్లు దొరకని చిన్న బడ్జెట్ చిత్రాలకు తన ప్లాట్‌ఫారమ్ సరైన వేదిక అని రంజిత్ వివరించారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Aha OTT Platform, Andhra Pradesh, AP News, Hyderabd

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు