ఏపీలో జూన్ 26న కొత్త పారిశ్రామిక విధానాన్ని ఖరారు చేయబోతున్నట్టు మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. అందరికీ ఒకే విధానం.. పారదర్శక పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ కమిటీ భేటీ అయ్యింది. పరిశ్రమలకు 30 రోజుల్లో అనుమతులు వచ్చేలా పాలసీ తీసుకున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమయిన వనరులను అందిస్తామని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. భూమి, పుష్కలంగా నీరు, నిరంతరాయంగా విద్యుత్, నైపుణ్యం కలిగిన మానవవనరులు అందిస్తామని... రాష్ట్రంలోని అన్ని వనరులను వినియోగించుకుంటూ పారిశ్రామికాభివృద్ధి సాధిస్తామని వివరించారు.
పర్యావరణానికి, ప్రజలకు హాని చేసే పరిశ్రమలకు అనుమతి ఇవ్వొద్దని సీఎం జగన్ స్పష్టంగా ఆదేశించారని అన్నారు. అనినీతి, లోపభూయిష్టాలకు తావే లేని విధంగా పారిశ్రామిక విధానం రాబోతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి హాజరయిన పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, టాస్క్ ఫోర్స్ కమిటీ వైస్ ఛైర్మన్ కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్, టాస్క్ ఫోర్స్ సీఈవో సుబ్రమణ్యం జవ్వాది, ఐ.టీ శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, పంచాయతీ రాజ్, మైనింగ్ శాఖ కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, విద్యుత్ శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.