విజయవాడ దుర్గగుడిలో కొత్త రూల్... స్లీవ్ లెస్, జీన్స్ వేస్తే నో ఎంట్రీ

దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా ఓ డ్రెస్ కోడ్‌ను విధించారు. గుడికి

news18-telugu
Updated: December 9, 2018, 11:53 AM IST
విజయవాడ దుర్గగుడిలో కొత్త రూల్... స్లీవ్ లెస్, జీన్స్ వేస్తే నో ఎంట్రీ
శ్రీమహాలక్ష్మి అవతారంలో దుర్గమ్మ (ఫైల్ ఫోటో )
  • Share this:
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొత్త రూల్ తీసుకొచ్చారు. ఇక నుంచి ఎలా పడితే అలా.. వెస్ట్రన్ డ్రెస్సింగ్‌‌లో గుడికి వస్తే నో ఎంట్రీ అంటున్నారు అధికారులు. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా ఓ డ్రెస్ కోడ్‌ను విధించారు. గుడికి జీన్స్, స్లీవ్ లెస్ డ్రెస్సులు వేసుకొని వస్తే... అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.

పద్ధతిగా ఉండే దుస్తులు వేసుకొని వస్తేనే భక్తులకే అమ్మవారి దర్శన భాగ్యం కల్గనుంది. కొత్త రూల్స్ ప్రకారం లంగా జాకెట్, లంగావోని, పంజాబీ డ్రెస్, చూడీదార్ ధరించిన ఆడవారికే గుడిలోకి ప్రవేశం కల్పిస్తారు. అలాగే మగవాళ్లు కూడా చిరుగులు లేకుండా నిండుగా ప్యాంట్ వేసుకొని వస్తేనే ఆలయంలోకి అనుమతి కల్పిస్తారు. దుర్గగుడి ఆలయ ఈవో కోటేశ్వరమ్మ చేసిన ఈ కొత్త ప్రతిపాదనలకు ఇప్పటికే ఆలయ పాలకమండలి ఆమోదం తెలిపింది.

జీన్స్, షాట్స్, టీ షర్టులు, స్లీవ్‌లెస్‌ షర్టులు ధరించే మహిళలను ఆలయంలోకి అనుమతించబోమని వెల్లడించారు ఆలయ అధికారులు. షాట్స్, సగం ప్యాంట్‌లు ధరించి ఆలయానికి వచ్చే మగవారికి సైతం ఇదే నిబంధన వర్తిస్తుందన్నారు. 2019, జనవరి 1 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయన్నారు. డ్రెస్ కోడ్ పై భక్తులకు అవగాహన కల్పించేలా ఆలయ ప్రాంగణంలో ప్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు ఆలయ అధికారులు.

First published: December 9, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు