హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

IAS Transfers: ఏ జిల్లాకు ఏ అధికారి వెళ్లాలి.. సమయం దగ్గర పడ్డా రాని క్లారిటీ..

IAS Transfers: ఏ జిల్లాకు ఏ అధికారి వెళ్లాలి.. సమయం దగ్గర పడ్డా రాని క్లారిటీ..

IAS Transfers: కొత్త జిల్లాల ఏర్పాటుతో అధికారుల్లో కాస్త గందరగోళం నెలకొంది. సమయం దగ్గర పడుతున్నా.. ఇప్పటి వరకు అధికారుల బదిలీలపై క్లారిటీ లేదు. దీంతో ఎవరు ఏ జిల్లాలకు వెళ్లాలి..? విశాఖలో ఎవరు ఉండాలి అంటూ తర్జన భర్జన పడుతున్నారు.

IAS Transfers: కొత్త జిల్లాల ఏర్పాటుతో అధికారుల్లో కాస్త గందరగోళం నెలకొంది. సమయం దగ్గర పడుతున్నా.. ఇప్పటి వరకు అధికారుల బదిలీలపై క్లారిటీ లేదు. దీంతో ఎవరు ఏ జిల్లాలకు వెళ్లాలి..? విశాఖలో ఎవరు ఉండాలి అంటూ తర్జన భర్జన పడుతున్నారు.

IAS Transfers: కొత్త జిల్లాల ఏర్పాటుతో అధికారుల్లో కాస్త గందరగోళం నెలకొంది. సమయం దగ్గర పడుతున్నా.. ఇప్పటి వరకు అధికారుల బదిలీలపై క్లారిటీ లేదు. దీంతో ఎవరు ఏ జిల్లాలకు వెళ్లాలి..? విశాఖలో ఎవరు ఉండాలి అంటూ తర్జన భర్జన పడుతున్నారు.

  P Anand Mohan, Visakhapatnam, News18.                        IAS Transfers:  కొత్త జిల్లాల (New Districts) ఏర్పాటుకు సమయం దగ్గర పడుతోంది. సెలవులను తీసేస్తే ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. అయినా ఇప్పటి వరకు అధికారుల బదిలీలపై క్లారిటీ లేదు.  ఏ అధికారి ఏ జిల్లాలో పని చేయాలి అన్నదానిపై  ఆదేశాలు అందలేదు.  రేపు, మాపు అంటూ బదిలీల నిర్ణయాలు, నియామకాల నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తోంది ఏపీ ప్రభుత్వం (AP Government). దీంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోయినా కొందరు అధికారులు, ఉద్యోగులు బదిలీ ఖాయమనే భావనతో మానసికంగా సిద్ధమవుతున్నారు. కొందరు మాత్రం తమను విశాఖ (Visakha) లో  కొనసాగించాలని లేదా  అనకాపల్లి (Anakapalli) లో పోస్టింగ్‌ వేయించాలని లాబీయింగ్ చేస్తున్నారు. అందుకు రాజకీయ నాయకులని కూడా కలుస్తున్నారు.  కొందరు మాత్రమే  ఇతర జిల్లాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. అయితే  అధికారులంతా ఏప్రిల్‌ 2, 3 తేదీల్లో అందుబాటులో వుండాలని గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ (Sameer Sharma) ఆదేశాలిచ్చారు. కానీ ఇప్పుడు ఆ రెండు రోజులు సెలవులే కావడంతో ఏం చేయాలి అన్నదానిపై  క్లారిటీ రావడం లేదు.  

  కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో జిల్లాలో పనిచేసే పలువురు ఐఏఎస్‌ అధికారులకు స్థానచలనం కలగనున్నది. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జునను విశాఖ జిల్లా (Visakha District) కలెక్టర్‌గానే కొనసాగిస్తారని సమాచారం.  కొత్త జిల్లాలకు అవసరమైన ఏర్పాట్లు, వసతుల కల్పనకుగాను ఆయన్ను విశాఖలోనే వుంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో జీవీఎంసీ కమిషనర్‌గా పనిచేసి పరిశ్రమల డైరెక్టర్‌గా వెళ్లిన జి.సృజన  పేరును అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ పోస్టుకు పరిశీలిస్తున్నట్టు సమాచారం. జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి కూడా కలెక్టర్‌గా వెళ్లనున్నారని టాక్.  ఆయన్ను తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) కలెక్టర్‌గా నియమించనున్నట్టు తెలిసింది.

  ఇదీ చదవండి : టీడీపీ నాయకుల ఫోటోను డీపీ పెట్టుకోవడమే పాపం.. ఉద్యోగం పోయింది.. ఎక్కడో తెలుసా..?

  ఇక పాడేరు కలెక్టర్‌గా గతంలో అక్కడ సబ్‌ కలెక్టర్‌గా పనిచేసిన బాలాజీతో పాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. మరో జేసీ కల్పనాకుమారి జీవీఎంసీలో అడిషనల్‌ కమిషనర్‌ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. 2013 బ్యాచ్‌కు చెందిన జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీషాకు కలెక్టర్‌గా పోస్టింగ్‌ వస్తుంది అంటున్నారు.  బహుశా ఒకటి, రెండు రోజుల్లో ఆదేశాలు వస్తాయని అంచనావేస్తున్నారు.

  ఇదీ చదవండి : ఎల్జీ పాలిమర్స్ విషాధ ఘటనకు రెండేళ్లు.. ఇప్పటికీ అందని పూర్తి సాయం

  మరోవైపు జిల్లాల విభజనపై ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి వచ్చిన అభ్యంతరాలను తీసుకుని స్వయంగా రావాలని ప్రభుత్వం ఆదేశించింది.  ఇప్పటికే  జిల్లా అధికారులు  అమరావతిలో ఉన్నారు.  జిల్లాల విభజన ప్రక్రియ ఇంచుమించు పూర్తయినట్టు ప్రకటించిన తరువాత అభ్యంతరాలతో పనేమిటోనని కొందరు సందేహం వ్యక్తంచేస్తున్నారు.

  ఇదీ చదవండి : వచ్చే ఎన్నికల్లో పోటీపై జేడీ క్లారిటీ.. పార్టీ ఏది.. పోటీ ఎక్కడ నుంచి అంటే..?

  జిల్లాలో కీలకమైన కలెక్టరేట్‌లో ఉద్యోగుల విభజనపై సీసీఎల్‌ఏ నుంచి పిలుపు వచ్చిందని సమాచారం.  కలెక్టరేట్‌లో ఉద్యోగుల వివరాలను ఇప్పటికే సీసీఎల్‌ఎకు పంపినా..  కొత్త జిల్లాల్లో కలెక్టరేట్‌లకు కేటాయింపుపై నిర్ణయం తీసుకోలేదు. ఉద్యోగుల కేటాయింపుపై ఈ రోజు రాత్రి లేదా రేపు సీసీఎల్‌ఏ నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.

  ఇదీ చదవండి : భద్రాది రామయ్యకు గోటి తలంబ్రాలు రెడీ.. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా..?

  జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కొన్ని శాఖల్లో డిప్యూటేషన్లను ఆయా  విభాగాధిపతులు రద్దు చేశారు. తక్షణమే వెనక్కి రావాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో వీరిని కొత్త జిల్లాలకు పంపుతారనే వాదన వినిపిస్తోంది. కాగా విశాఖ నుంచి అనకాపల్లి, పాడేరు జిల్లాలకు ఆర్డర్‌ టు సర్వ్‌ ప్రకారం ఉద్యోగులు వెళ్లినా ప్రస్తుతానికి వారందరికీ విశాఖలోనే జీతాలు బట్వాడా చేస్తారు. కొత్త జిల్లాల్లో కొత్తగా పోస్టులు కేటాయించేంత వరకు వారంతా డిప్యూటేషన్‌పై వెళ్లినట్టుగానే పరిగణిస్తారు.

  ఇదీ చదవండి : వైసీపీ ప్రొడెక్షన్ సమర్పించు.. జనం చెవిలో పువ్వు.. వైరల్ అవుతున్న వీడియో

  ఉద్యోగుల కేటాయింపులో రివర్స్‌ సీనియారిటీ విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా కొన్ని శాఖలలో ఆప్షన్లు తీసుకుంటున్నారు. సీనియర్లను కోరుకున్న జిల్లాకు పంపేందుకు ఆప్షన్‌ విధానం అమలు చేస్తారని, అంతే తప్ప  జూనియర్లు మాత్రం రివర్స్‌ సీనియారిటీ ప్రకారం కొత్త జిల్లాలకు వెళ్లాల్సి వుంటుందని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఇదే సమయంలో  గురువారం రాత్రి కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున తన బంగ్లాలో జిల్లా అధికారులకు వీడ్కోలు విందు ఇచ్చారు.

  First published:

  ఉత్తమ కథలు