హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP New Districts: ఏపీలో మళ్లీ తెరపైకి కొత్త జిల్లాలు.. ప్రభుత్వ వ్యూహం ఇదేనా..?

AP New Districts: ఏపీలో మళ్లీ తెరపైకి కొత్త జిల్లాలు.. ప్రభుత్వ వ్యూహం ఇదేనా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త జిల్లాల ఏర్పాటు (AP New Districts Issue) అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) జిల్లాల పునర్విభజనపై దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ (YSRCP) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఇదే కొత్త జిల్లాలపై సీఎం కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త జిల్లాల ఏర్పాటు (AP New Districts Issue) అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) జిల్లాల పునర్విభజనపై దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ (YSRCP) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఇదే కొత్త జిల్లాలపై సీఎం కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాలు ఏర్పడితే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయన్న చర్చ జరిగినట్లు సమాచారం. దీంతో ఈ దిశగా ప్రయత్నాలు సాగించాలని కూడా అన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి గత ఏడాది కొత్త జిల్లాల ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎంఓ అధికారులు సమాచారమిచ్చింది. ఐతే ఆ తర్వాత ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాకపోవడంతో రెవెన్యూ శాఖ ఈ అంశంపై దృష్టిసారించలేదు.

  ఆ తర్వాత కరోనా సెకండ్ వేవ్ రావడం, జనగణన పూర్తయ్యేవరకు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ భౌగోళిక హద్దులను మార్చడానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. ఈ మేరకు భారత రిజిస్ట్రార్ కార్యాలయం ఆదేశాలు కూడా ఇచ్చింది. దీంతో జిల్లాల పునర్విభజనకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

  ఇది చదవండి: మూడు రాజధానులపై హైకోర్టు విచారణ ముగిస్తుందా..? రైతుల వ్యూహమేంటి..!


  రాష్ట్రంలోని ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా విభజించాలనేది ప్రభుత్వం ఆలోచన. ఇలా విభజిస్తే రాష్ట్రంలో 25 నుంచి 26 జిల్లాలు ఉంటాయని గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు కొత్త జిల్లాలపై స్టేట్ లెవల్ కమిటీ, సబ్ కమటీలు, డిస్ట్రిక్ట్ లెవల్ కమిటీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయా కమిటీలు కొత్త జిల్లాలపై సమావేశాలు కూడా నిర్వహించాయి.

  ఇది చదవండి: "జగన్ మామా మమ్మల్ని ఆదుకోండి.." ఈ చిన్నారులకు వచ్చిన కష్టమేంటో తెలుసా..?


  ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న జిల్లాల సంఖ్య, ఇతర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రాలకు ఉన్న దూరం, ఇతర కీలక అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్రంలో లోక్ సభ నియోజకవర్గాల ప్రాతిపదికన చూస్తే 25 జిల్లాలు కానుడగా.. అరకు పార్లమెట్ సెగ్మెంట్ విస్తీర్ణంలో పెద్దది కావడంతో దీనిని రెండు జిల్లాలుగా విభజించే అవకాశాలున్నాయి.

  ఇది చదవండి: నాలుగు జోన్లుగా ఆంధ్రప్రదేశ్..? సీఎం జగన్ మాటల్లో అర్ధం ఇదేనా..?  ఇక జిల్లాల విభజన ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు ప్రతిపాదిత జిల్లాల్లోని కాలేజీలు, రోడ్లు, ప్రధాన భవనాలు, ఇతర వివరాలను ప్రభుత్వం సేకరించింది. అలాగే లోక్ సభ నియోజకవర్గాల పరిధి, విస్తీర్ణం, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల వారీగా వివరాలను కూడా సేకరించారు. అంతేకాదు పోలీస్ శాఖ కూడా కొత్తగా ఏర్పడే జిల్లాల పోలీస్ కార్యాలయాలు, భవనాలు, స్థలాలు, సిబ్బంది కేటాయింపు వంటి అంశాలపై కసరత్తు కూడా చేసింది. ఐతే కొంతకాలంగా కొత్త జిల్లాల అంశం మరుగున పడిపోంది. తాజాగా వైసీపీ ఎంపీలతో సీఎం కొత్త జిల్లాలపై వ్యాఖ్యలు చేశారన్న వార్తల నేపథ్యంలో మరోసారి ఈ అంశం చర్చనీయాంశమవుతోంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP new districts

  ఉత్తమ కథలు