NEW DISTRICT TENSION TWO MINSTERS IN PRAKASAM THEY THINK MEET CM JAGAN MOHAN REDDY NGS
AP New Districts: మంత్రులకు తలనొప్పిగా మారిన కొత్త జిల్లాల విభజన.. సీఎంకు చెప్పలేక సతమతం
ప్రతీకాత్మకచిత్రం
New Districts In AP: కొత్త జిల్లాల పునర్విభజన వైసీపీ నేతలకు.. మంత్రులకు కూడా తలనొప్పిగా మారింది. ముఖ్యంగా ఇద్దరి మంత్రులను ఈ అంశం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విపక్షాల విమర్శలు.. సొంత పార్టీ నేతల ఒత్తిళ్లతో ఏం చేయాలో అర్థం కావడం లేదు.. సీఎం ఎలా చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు.
New Districts In AP: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త జిల్లాల పునర్ విభజన కొందరు వైసీపీ నేతల (YCP Leaders) కు నిద్ర లేకుండా చేస్తోంది. సొంతపార్టీ నుంచే విమర్శలు వస్తుండడంతో ఏం చేయాలి అని తలలు పట్టుకుంటున్నారు. ఓ వైపు విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. మరోవైపు సొంత పార్టీ నేతల ఒత్తిళ్లు.. దీంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు.. ముఖ్యంగా ఇద్దరి మంత్రులకు పరిస్థితి ఇబ్బందిగా మారింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy)కి ఎలా చెప్పాలో తెలియక సతమతం అవుతున్నారని ప్రచారం ఉంది. ఇంతలా సతమతం అవుతున్నఆ ఇద్దరు మంత్రులు ఎవరంటే..? ప్రకాశం జిల్లా (Prakasam District)కు చెందిన మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి (Minster Balineni Srinivas Reddy), ఆదిమూలపు సురేష్ (Adimulapu Suresh). ఇద్దరిలో ఒకరు సీఎం జగన్‌కు దగ్గరి బందువు.. మరొకరు ఆయనకు ఆత్మీయంగా ఉండే సహచరుడు.
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలో ప్రకాశం జిల్లా మూడు ముక్కలైంది. దీనిపై జిల్లావాసుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను ఒంగోలు కేంద్రంగా ఉండే ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని ఆప్రాంత ప్రజలతోపాటు వైసీపీ నేతలు మంత్రి బాలినేనిపై ఒత్తిడి తెస్తున్నారు. మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా చేయాలని పశ్చిమ ప్రాంత అధికారపార్టీ నాయకులు మంత్రి ఆదిమూలపు సురేష్‌కు ఊపిరాడనీయటం లేదు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్‌ల డిమాండ్స్‌కు అనుగుణంగా జైకొట్టక తప్పని పరిస్థితి ఉందని వైసీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.
ఇప్పటికే కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు మహీధర్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, అన్నా రాంబాబుతోపాటు అద్దంకి ఇంచార్జి కృష్ణచైతన్య తమ ప్రాంత ప్రజాప్రతినిధులతో వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు. మిగతా ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్‌లు కూడా వాస్తవ పరిస్దితులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు మంత్రులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారనే ప్రచారం ఉంది. కందుకూరు డివిజన్ విషయంలో హామీ ఇవ్వగలను కానీ.. నియోజకవర్గాన్ని జిల్లాలోనే కొనసాగింపుపై ఏం చెప్పలేనని తనను కలిసిన వారికి మంత్రి బాలినేని వివరిస్తున్నట్టు తెలుస్తోంది. అద్దంకి, కందుకూరు నేతల ఒత్తిళ్లు బాలినేనికి తలనొప్పిగా మారాయట.
మంత్రి ఆదిమూలపు సురేష్ పరిస్థితి కూడా అంతే.. మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని కోరుతూ జేఏసీ నేతలు చేస్తున్న ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. మార్కాపురంలో మంత్రి సురేష్ ఇంటిని ఇప్పటికే ఆందోళనకారులు ముట్టడించారు. పర్యటనకు వచ్చిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కారును అడ్డుకుని తమ డిమాండ్లు వినిపించారు. మార్కాపురం ప్రత్యేక జిల్లా కోసం మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు నాగార్జున రెడ్డి, రాంబాబులు తప్పనిసరి పరిస్థితుల్లో ముందుకు వస్తుండగా కనిగిరి, దర్శి ఎమ్మెల్యేలు బుర్రా మధుసూధన్ యాదవ్, మద్దిశెట్టి వేణుగోపాల్‌లు సైలెంట్ అయ్యారు. ప్రత్యేక డిమాండ్ వినిపిస్తున్న మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నేతలను సముదాయించడం మంత్రి సవాల్ గా మారింది.
మరి ఇద్దరు మంత్రులు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.. సీఎం జగన్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకుని మార్పులు జరిగేలా చేస్తారో.. లేక అధిష్టానానికి ఎదురు చెప్పలేక స్థానిక నేతలను ఒప్పిస్తారా అన్నది చూడాలి.. ఏది ఏమైనా స్తానిక సెంటిమెంట్ మాత్రం మంత్రులను తీవ్ర ఆవేనదకు గురి చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.