Coronavirus: వెంకన్న సన్నిధికి నో ఎంట్రీ.. గరుత్మంతుడి సాక్షిగా ఆ పనిచేశారు..

తిరుమల వెంకటేశ్వరస్వామి సన్నిధిలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న ఓ కొత్తజంటకు వింత అనుభవం ఎదురయ్యింది. కరోనా వైరస్ కారణంగా తిరుమల కొండపైకి ప్రవేశం లేకపోవడంతో అలిపిరిలోని గరుడ విగ్రహం ఎదుటే వివాహం చేసుకున్నారు.

news18-telugu
Updated: March 22, 2020, 1:31 PM IST
Coronavirus: వెంకన్న సన్నిధికి నో ఎంట్రీ.. గరుత్మంతుడి సాక్షిగా ఆ పనిచేశారు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ ఓ కొత్తజంట పెద్ద చిక్కును తెచ్చిపెట్టింది. శ్రీవారి సాక్షిగా వివాహం చేసుకోవాలని వచ్చి అలిపిరిలోని గరుత్మంతుడి విగ్రహాం సాక్షిగా ఒక్కటయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన కొత్తజంట ఒకటి వెంకన్న సన్నిధిలో వివాహం చేసుకోవాలని భావించి తిరుపతికి వచ్చారు. అయితే తిరుమల వెంకన్న సన్నిధికి చేరుకునేందుకు వెళుతుండగా, అలిపిరి వద్ద పోలీసులు ఆపేశారు. వెంటనే పైకి వెళ్లి చేసుకుని వస్తామని పోలీసులను కోరారు. కానీ వారు కరోనా వైరస్ కారణంగా ఎవ్వరినీ అనుమతించడం లేదని ఖరాఖండీగా చెప్పారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అలిపిరిలోని గరుత్మంతుడి విగ్రహాం ఎదుట వివాహం చేసుకోవాలని భావించారు. విగ్రహం ఎదుటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మెడలో తాళి కట్టగా, తిరుపతి అర్బన్ పోలీసులే పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న డీఎస్పీలు మురళీకృష్ణ, నాగసుబ్బన్న, తదితర సిబ్బంది నూతన వధువరులను ఆశీర్వదించారు.
First published: March 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading