హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP New Districts Controversy: ఏపీలో జిల్లాల పేర్లపై వివాదం... తెరపైకి కొత్త పేర్లు.. డిమాండ్లు..

AP New Districts Controversy: ఏపీలో జిల్లాల పేర్లపై వివాదం... తెరపైకి కొత్త పేర్లు.. డిమాండ్లు..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త జిల్లాల (AP New Districts) పై అక్కడక్కడా వివాదాలు రేగుతున్నాయి. కొత్త జిల్లాల పేర్లు, పరిధులు, నియోజకవర్గాలు, ఇతర అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల నోటిఫికేషన్ పై అభ్యంతరాలకు ప్రభుత్వం నెలరోజులు గడువు ఇవ్వగా.. దాదాపు ఎన్నిచోట్ల కొత్త పేర్లు, డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త జిల్లాల (AP New Districts) పై అక్కడక్కడా వివాదాలు రేగుతున్నాయి. కొత్త జిల్లాల పేర్లు, పరిధులు, నియోజకవర్గాలు, ఇతర అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల నోటిఫికేషన్ పై అభ్యంతరాలకు ప్రభుత్వం నెలరోజులు గడువు ఇవ్వగా.. దాదాపు ఎన్నిచోట్ల కొత్త పేర్లు, డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు దాదాపు అన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల విషయంలో కొత్త డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలతో పాటు అధికార పక్షంలోనూ జిల్లాలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా జిల్లాల ఏర్పాటు నిర్ణయం తీసుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కడప జిల్లా విభజనపై ఇప్పటికే వివాదం రాజుకుంది. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాగా మారుస్తూ రాయచోటిని హెడ్ క్వార్టర్ గా ఎంపిక చేయడంపై స్థానిక వైసీపీ నేతలే మండిపడుతున్నారు. అంతేకాదు రాజీనామా చేస్తానంటూ రాజంపేట మున్సిపల్ వైస్ ఛైర్మన్ మర్రి రవి హెచ్చరించారు. ప్రభుత్వం ఇలాగే ముందుకెళ్తే రాజంపేటలో వైసీపీ ఓడిపోవడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇది చదవండి: ఏపీలో సరికొత్త ఆన్ లైన్ పోర్టల్.. ఒకేచోట 540 సేవలు.. లాంఛ్ చేసిన సీఎం జగన్..


ఇక గుంటూరు జిల్లా విభజనపైనా రచ్చ రేగుతోంది. పల్నాడు జిల్లాకు కన్నెగంటి హనుంతరావు పేరు పెట్టాలని మాజీ మంత్రి, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేయగా.. మాజీ సీఎం కిలారు రోశయ్య పేరు పెట్టాలని ఆర్యవైశ్య సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రకాశం జిల్లా విభజనలో సరైన పద్ధతి లేదని కొందరంటున్నారు. కందకూరును నెల్లూరులో కలపడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలుకు దగ్గరగా ఉన్న కందుకూరును నెల్లూరులో కలపడాన్ని తప్పుబడుతున్నారు. 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంగోలును కాదని.. 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరుకు ఎలా వెళ్తారని కందుకూరు వాసులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. అలా అయితేనే జిల్లా విభజన సరిగ్గా ఉంటుందన్న అభిప్రాయాలు వస్తున్నాయి. కర్నూలు జిల్లా నుంచి విడిపోయిన నంద్యాలకు శ్రీశైలం జిల్లా పేరు పెట్టాలన్న డిమాండ్లు వస్తున్నాయి.

ఇది చదవండి: ఏపీలోని ఆ జిల్లాపై మళ్లీ అభ్యంతరం.. వివాదానికి కారణం ఇదే..!


ఇదిలా ఉంటే కృష్ణాజిల్లా విభజన కూడా వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టడం కూడా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఎన్టీఆర్ పుట్టిన ప్రాంతానికి కాకుండా మరో ప్రాంతానికి ఆయన పేరు పెట్టడం సరికాదని కొందరు.. విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. అలాగే విజయవాడ నగరంలో కలిసిపోయి రూరల్ మండలంలో ఉన్న గ్రామాలు కృష్ణాజిల్లాకు వెళ్లడం కూడా చర్చనీయాంశమవుతోంది.

ఇది చదవండి: ఎన్టీఆర్ జిల్లాపై స్పందించని టీడీపీ.. కారణం ఇదేనా..?


ఇదిలా ఉంటే కోనసీమ జిల్లాకు బీఆర్ అంబేద్కర్ పేరు, గోదావరి జిల్లాల్లో ఒకదానికి శ్రీకృష్ణదేవరాయలు పేరు, దివంగత లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి పేరు పెట్టాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇప్పటికే సీఎం జగన్ కు లేఖ రాశారు. ఇక గిరిజన జిల్లాలపైనా కొత్త డిమాండ్లు వస్తున్నాయి. గిరిజన ప్రాంతాలను రంపచోడవరం, పాడేరు, పార్వతీపురం జిల్లాలుగా విభజించాలని.. వాటిలో ఒకదానికి గిరిజన నాయకుడి పేరు పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇది చదవండి: ఎన్టీఆర్ జిల్లాపై ఆసక్తికర చర్చ.. తెరపైకి వంగవీటి రంగా పేరు..


చిత్తూరు జిల్లా విభజన, పేరు విషయంలోనూ అభ్యంతరాలు వస్తున్నాయి. తిరుపతి జిల్లాకు శ్రీబాలాజీ జిల్లాగా నామకరణం చేయడాన్ని స్థానికులు తప్పుబడుతున్నారు. వెంటేశ్వరస్వామిని జిల్లా వాసులు శ్రీవారు లేదా వెంకన్న స్వామిగా పిలుస్తారని.. అలా కాకుండా ఉత్తరాదిలో మాదిరిగా శ్రీ బాలాజీ అని ఎలా పేరు పెడతారని ప్రశ్నిస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP new districts

ఉత్తమ కథలు