Home /News /andhra-pradesh /

NEW ALPAPEEDANAM IN BAY BENGAL RAINFALL PREDICTION FOR ANDHRA PRADESH AND TELANGANA AK

Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు కొత్త టెన్షన్

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Weather Report: రాగల 48 గంటలలో వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి 3 రోజులలో ఇది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణతో పాటు ఏపీలోనూ వర్షాలు పడొచ్చని తెలిపింది.

    ఇప్పటికే వర్షాలతో ఇబ్బందిపడుతున్న తెలుగు రాష్ట్రాలకు ఇది నిజంగా బ్యాడ్ న్యూసే. మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దాని ప్రభావం వలన ఈ ప్రాంతంలో నేడు అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. రాగల 48 గంటలలో వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి 3 రోజులలో ఇది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణతో పాటు ఏపీలోనూ వర్షాలు పడొచ్చని తెలిపింది. అక్కడక్కడ భారీ వర్షాలు, పలు చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది.

    ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం కురిసింది. గడిచిన కొద్ది గంటల్లో నగరంలో బహదూర్‌పురా, మెహిదీపట్నం, టోలిచౌకి, గచ్చిబౌలి, మదాపూర్‌, కొండాపూర్‌, హైటెక్‌సిటీ, జూబ్లీహిల్స్‌, ఆర్‌కే పురం, సైదాబాద్‌, దిల్‌సుఖ్ నగర్‌, చైతన్యపురి, సరూర్‌నగర్‌, కొత్తపేట, సంతోష్ నగర్‌, చార్మినార్‌, ఫలక్‌నూమా, జూపార్క్, అఫ్జల్‌గంజ్‌, ఉప్పల్‌, కుషాయిగూడ, నాగారం, దమ్మయిగూడ, చర్లపల్లి, నల్లకుంట, అంబర్‌పేట, ముషీరాబాద్‌, నారాయణగూడ, బంజారాహిల్స్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి, బాలానగర్‌, బోయిన్‌పల్లి, అల్వాల్‌, తార్నాక, హబ్సిగూడ, కోఠి, లక్డీకాపూల్‌తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

    మీర్‌పేట చెరువు కట్ట తెగిపోవడంతో దాని పరిసరాల్లోని పలు ప్రాంతాల్లోకి నీరు చేరుతోంది. మరోవైపు మరికొన్ని గంటల్లో హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ తెలిపారు. నగర ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. రోడ్లపై నీరు నిల్వకుండా డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశామని వెల్లడించింది. వర్షాభావ ప్రాంతాల్లో ప్రభుత్వం బోట్లను అందుబాటులో ఉంచుతున్నట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలతో పాటు శిథిలావస్థ భవనాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అత్యవసర సేవల కోసం 100కు డయల్ చేయాలని తెలిపారు.

    భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాల్లో రిజర్వాయర్ల వద్ద ఉన్న పర్యాటక శాఖ బోట్లను హైదరాబాద్‌కు ప్రభుత్వం తెప్పించింది. మొత్తం 53 బోట్లను హైదరాబాద్‌కు తెప్పించింది. వర్షాభావ ప్రాంతాల్లో బోట్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచనుంది. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు బోట్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. కాగా.. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు 5 బోట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Telangana, WEATHER

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు