#missionpaani | గుంటూరు జిల్లా పరిషత్ పాఠశాలలో జల సంరక్షణ ఉద్యమం

గుంటూరు జిల్లా నార్నెపాడులోని జిల్లా పరిషత్ పాఠశాలలోని ఉపాధ్యాయులు పాఠశాల ప్రాంగణంలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేశారు

news18-telugu
Updated: July 3, 2019, 3:24 PM IST
#missionpaani | గుంటూరు జిల్లా పరిషత్ పాఠశాలలో జల సంరక్షణ ఉద్యమం
నార్నెపాడు జిల్లా పరిషత్ పాఠశాల
  • Share this:
ఈ విశ్వంలో సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారం. నీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదం వెల్లివిరుస్తుంది. పల్లెకైనా, నగరానికైనా నీటి వనరులు ఎంతో అవసరం. అభివృద్ధి విస్తరణకు కూడా నీరే ప్రధానం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి అవసరం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా జనాభా అనూహ్యంగా అధికమవుతోంది. రానున్న కాలంలో నీటి డిమాండ్ భారీగా ఉండే సూచనలున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరో వైపు భూమిపై ఉన్న నీటి వనరుల్లో సుమారు 97 శాతం సముద్రాల్లోనే ఉంది. అంటే మనకు పనికొచ్చే నీరు కేవలం 3 శాతమే. ఈ నేపథ్యంలో జల వనరులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది.

అందుకే గుంటూరు జిల్లా నార్నెపాడులోని జిల్లా పరిషత్ పాఠశాలలో ని ఉపాధ్యాయులు విద్యార్థులకు రోజు జరిగే ప్రార్ధన సమయం లో నీటిని పొదుపు చేయటం ఎలా నీటిని ఎలా సద్వినియోగం చేసుకోలాలో తెలిసే లా నినాదాలు చేయిస్తున్నారు. గుంటూరు జిల్లా నార్నెపాడులోని జిల్లా పరిషత్ పాఠశాలలోని ఉపాధ్యాయులు పాఠశాల ప్రాంగణంలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేశారు. వర్షపునీటిని ఇంకుడుగుంతలలోకి మళ్లించి భూగర్భ జిల్లాలను ఎలా పెంచుకోవాలి అనే విషయం ఫై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ స్కూల్ ఆవరణలో మొక్కలు పెంచుతూ పర్యావరణానికి ఎలా మేలుచేయాలి అనే విషయం లో రోజు ఒక తరగతివారితో జల సంరక్షణపై అవగాహన కల్గిస్తున్నారు. విరామ సమయంలో విద్యార్థులతో మొక్కలకు నీటినిపోయిస్తూన్నారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పాఠశాలను పచ్చని నందనవనంలా మార్చారు.రాష్ట్రపతి అబ్దుల్ కలాం తో వరుసగా మూడు సంవత్సరాలు కేంద్రప్రభుత్వం నుండి పర్యావరణ మిత్ర అవార్డును నార్నెపాడు జిల్లా పరిషత్ పాఠశాల పొందింది. ఈ పాఠశాలను స్ఫూర్తి గా తీసుకొని ముప్పాళ్ల మండలంలోని పాఠశాలలు అన్ని తమ పాఠశాలలో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసి పిల్లలకు నీటి యొక్క ప్రాముఖ్యతను అవసరాలను తెలియచేస్తున్నారు.

First published: July 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>