హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nellore News: భార్యతో ఎఫైర్ పెట్టుకున్నాడని 15 కత్తిపోట్లు.. నడిరోడ్డుపై దారుణం...

Nellore News: భార్యతో ఎఫైర్ పెట్టుకున్నాడని 15 కత్తిపోట్లు.. నడిరోడ్డుపై దారుణం...

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Nellore: ఈ రోజుల్లో వివాహ బంధాలకంటే అక్రమంగా ఏర్పడిన బంధాలకే కొందరు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలా ఓ వ్యక్తితో భార్య ఎఫైర్ పెట్టుకోవడాన్ని భర్త జీర్ణించుకోలేకపోయాడు. తన భార్యను వదిలేయాలని అతడికి చెప్పాడు.

ఈ రోజుల్లో వివాహ బంధాలకంటే అక్రమంగా ఏర్పడిన బంధాలకే కొందరు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలా ఓ వ్యక్తితో భార్య ఎఫైర్ పెట్టుకోవడాన్ని భర్త జీర్ణించుకోలేకపోయాడు. తన భార్యను వదిలేయాలని అతడికి చెప్పాడు. అయినా వినిపించుకోకపోవడంతో కక్షగట్టి కసితీరా హత్య చేశాడు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నెల్లూరు (Nellore) బాలాజీ నగర్ ప్రాంతానికి చెందిన దాసి సునీల్ కు ఐదేళ్ల క్రితం ఓ మహిళతో పెళ్లైంది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. ఓ బైక్ షోరూమ్ లో పనిచేస్తున్న సునీల్ కు చింతారెడ్డి పాలెం సమీపంలోని మిట్టపాలెంకు చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఇద్దరి సంబంధం గురించి మహిళ భర్త అయిన రాజాకు తెలిసింది. దీంతో రాజా పలుసార్లు సునీల్ తో గొడవపడ్డాడు.

ఎంతచెప్పినా వినకపోవడంతో తన భార్యతో ఎఫైర్ పెట్టుకున్న సునీల్ ను ఎలాగైనా అంతమొందించాలని రాజా స్కెచ్ వేశాడు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి సునీల్ మిట్టపాలంలోనే మద్యం తాగుతూ కనిపించాడు. ఈ సీన్ రాజా కంటపడింది. అప్పటికే సునీల్ పై కక్షతో ఉన్న రాజా.. అతడి స్నేహితులను తీసుకొని అక్కడకి వచ్చాడు. సునీల్ పై దాడి చేసి కత్తులతో విచక్షణారహితంగా పొడిచేశారు. గొంతు, చాతీ, పొట్ట భాగంలో ఏకంగా 15సార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు.

ఇది చదవండి: కొడుకు మరణంతో కోడలిపై అనుమానం.. అత్తమామలు ఏం చేశారో చూడండి..!


స్థానికులిచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. హత్య కేసుపై విచారించగా మృతుడిపై గతంలో కొట్లాటలకు సంబంధించిన కేసులున్నాయని తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజాతో పాటు అతడి స్నేహితుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు ఈ హత్యకు వివాహేతర సంబంధమేనా లేక మరేదైనా కారణముందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది చదవండి: ఈమె పేరు మృదుల.. పేరులో ఉన్నంత సాఫ్ట్ కాదు..! ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా..


ఇదిలా ఉంటే ఇటీవల విశాఖపట్నంలో ఇలాంటి ఘోరమే జరిగింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మురళీ అనే వ్యక్తి ఈస్ట్ ఆఫ్రికాలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. భర్త ఆఫ్రికాలో ఉండటంతో భార్య మృదుల విశాఖలోని ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త సెలవుపై రావడంతో ప్రియుడుతో తన సుఖానికి అడ్డొస్తున్నాడని భావించింది. అతడితో కలిసి మర్టర్ స్కెచ్ వేసింది. అర్ధరాత్రి భర్తను కుక్కర్ మూతతో కొట్టి హత్య చేసింది. అనంతరం డెడ్ బాడీని ప్రియుడితో కలిసి మారికవలస వద్ద హైవే వంతెన కింద మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. ఐతే భార్య తెలివిగా మిస్సింగ్ కేసు నమోదు చేసి తప్పించకునే యత్నం చేసింది. ఐతే పోలీసులు కాల్ డేటా విశ్లేషించడంతో అసలు నిజం బయటపడింది.

First published:

Tags: Andhra Pradesh, Extramarital affairs, Nellore Dist

ఉత్తమ కథలు