హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Shocking: పెళ్లి చేయలేదంటూ పూజారి ఇంట్లో సూసైడ్.. నెల్లూరులో షాకింగ్ ఘటన.. వివరాలివే..!

Shocking: పెళ్లి చేయలేదంటూ పూజారి ఇంట్లో సూసైడ్.. నెల్లూరులో షాకింగ్ ఘటన.. వివరాలివే..!

రాయపాటి నాగరాజు (ఫైల్)

రాయపాటి నాగరాజు (ఫైల్)

Nellore: సమాజంలో రోజు రోజుకు జరుగుతున్న ఘటనలు విస్తుపోయేలా చేస్తున్నాయి. ఓ వైపు అత్యాచారాలు., మరో వైపు నిత్య పెళ్లికొడుకుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న మరో యువతితో వివాహానికి సిద్ధం అవుతున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Nellore, India

GT Hemanth Kumar, News18, Tirupati


సమాజంలో రోజు రోజుకు జరుగుతున్న ఘటనలు విస్తుపోయేలా చేస్తున్నాయి. ఓ వైపు అత్యాచారాలు., మరో వైపు నిత్య పెళ్లికొడుకుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న మరో యువతితో వివాహానికి సిద్ధం అవుతున్నారు. ఓ అమ్మాయిని తీసుకుని పెళ్లి చేయాలంటూ ఓ వ్యక్తి పుజారి దగ్గరకు వచ్చాడు.. కానీ దానికి పూజారి అంగీకరించలేదు. పెళ్లై ఇద్దరు పిల్లలున్న నీకు మరో మహిళతో వివాహం ఏంటని ప్రశ్నించాడు. దీంతో ఆ వ్యక్తి పెళ్లి రద్దు చేసుకున్నాడు. కట్‌ చేస్తే అదే వ్యక్తి పూజారి ఇంట్లో శవమైతేలాడు..? ఇంతకీ ఏం జరిగింది..? ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నెల్లూరు జిల్లా (Nellore District) ఉలవపాడు చెందిన రాయపాటి నాగరాజు ఫొటోస్టూడియోలో పనిచేస్తుంటాడు. అతనికి భార్య సూర్యభారతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. చినికి చినికి గాలివానలా మారడంతో భారతి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. గత మూడు నెలలుగా నాగరాజు ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో మరో యువతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. బిట్రగుంటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చకుడితో నాగరాజుకు పరిచయం ఉంది. దీంతో ఓ యువతిని తీసుకెళ్లి తనకు పెళ్లి చేయాలంటూ బిట్రగుంటలోని ఆ పూజారి ఇంటికి వెళ్లాడు. కానీ పెళ్లి చేసేందుకు ఆ పూజారి ఒప్పుకోలేదు. పెళ్లై పిల్లలుండి ఇంకో పెళ్లి చేసుకోవడం కరెక్ట్‌ కాదు అంటూ నాగరాజుకు నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. ఇలాంటి పనులు మానుకోని భార్యతో రాజీపడి సంతోషంగా ఉండాలంటూ నచ్చజెప్పాడు.


ఇది చదవండి: అన్నీ తానై ఉంటానన్నాడు.. ప్రమోషన్‌ రాగానే మాటమార్చాడు..! 


పండితుడి మాటలు విన్న నాగరాజు మళ్లీ ఆలోచనలో పడ్డాడు. వెంట తీసుకొచ్చిన అమ్మాయిని తీసుకొచ్చిన చోటే వదిలేసి వచ్చి..మళ్లీ పండితుని ఇంటి వద్దకే వచ్చాడు. నాగరాజు పూజారి ఇంటికి వచ్చే సరికి రాత్రి అయ్యింది. ఇంక అప్పటికే ఆలస్యం అయిందని… రాత్రికి అక్కడే పడుకొని రేపు ఉదయం ఉలవపాడు వెళ్తానన్నాడు నాగరాజు.సరేనని పూజారి, అతన్ని అక్కడే పడుకోమన్నాడు. ఉదయం లేచి చుసిన పూజారికి అక్కడి దృశ్యాలు చూసి గుండె గుభేళ్‌మంది. అతని ఇంటి ఆవరణలోనే నాగరాజు ఉరికి వేలాడుతూ కనిపించాడు. నాగరాజు ఆత్మహత్య చేసుకున్న దృశ్యాలు చూసి కంగారుపడి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి వచ్చి పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. పండితుని కుటుంబ సభ్యులను విచారించారు. దర్యాప్తును వేగవంతం చేశారు. నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మరేదైనా కారణముందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Nellore, Suicide

ఉత్తమ కథలు