హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Yogi Vemana: యోగి వేమ‌నకు గుడికట్టి పూజలు, ఉత్సవాలు చేస్తున్నారు..? ఎక్కడో తెలుసా..!

Yogi Vemana: యోగి వేమ‌నకు గుడికట్టి పూజలు, ఉత్సవాలు చేస్తున్నారు..? ఎక్కడో తెలుసా..!

X
నెల్లూరు

నెల్లూరు జిల్లాలో యోగి వేమన ఆలయం

Yogi Vemana: జీవన సత్యాలను పద్య రూపంలో లోకానికి అందించిన మ‌హ‌నీయుడు గురించి ఎంత చెప్పినా తక్కువే... ఎన్ని సార్లు పొడిగినా త‌న‌వితీర‌దు. అలాంటి యోగి వేమ‌న‌కి గుడికట్టి ఆరాధిస్తున్నారనే సంగతి మీకు తెలుసా..ఆ ఊరి గురించి ఎప్పుడైనా విన్నారా?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nellore, India

Polaa Sudha, News18, Nellore

అనగననగరాగ మతిశయించునుండు

తినగ తినగ వేము తియ్యనుండు

సాధనమున పనులు సమకూరు ధరలోన

విశ్వదాభిరామ వినుర వేమ..!

మానవత్వం గురించి వేమన రాసిన ఈ పద్యం తెలియని తెలుగువాడు ఉండడు. ముఖ్యంగా చిట్టచివరి లైన్‌ విశ్వదాభిరామ వినురవేమ..! అనే మాట వేమన శతకాల్లో కనిపించే వినిపించే పదాలు..! వేమ‌న శ‌త‌కాలు తెలియ‌ని తెలుగు వారుండ‌డు. ఆయ‌న ప‌ద్యాన్ని చ‌ద‌వ‌ని విద్యార్ధి ఉండ‌డు. చదువు ఒంటపట్టని వాళ్లు సైతం అలవోకగా నేర్చుకునేలా ఆయన పద్యాలు ఉంటాయి. తెలుగు సాహిత్య, ప‌ద్య వ‌నంలో విర‌బూసిన యోగి వేమన ఆయ‌న‌. వేదాంతాన్ని ప‌ద్యరూపంలో అన్వయించిన క‌వితామూర్తి అతను. జీవన సత్యాలను పద్య రూపంలో లోకానికి అందించిన మ‌హ‌నీయుడు గురించి ఎంత చెప్పినా తక్కువే... ఎన్ని సార్లు పొడిగినా త‌న‌వితీర‌దు. అలాంటి యోగి వేమ‌న‌కి గుడికట్టి ఆరాధిస్తున్నారనే సంగతి మీకు తెలుసా..ఆ ఊరి గురించి ఎప్పుడైనా విన్నారా?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నెల్లూరు జిల్లా (Nellore District) ఇందుకూరుపేట మండ‌లం ప‌ల్లిపాడు గ్రామంలోని బీఆర్ అంబేద్కర్ కాల‌నీలో యోగి వేమ‌న దేవాల‌యం ఉంది. ఈ గుడి ఎన్నేళ్ళ క్రితం నిర్మించారో తెలియ‌దు గానీ.. నిత్య పూజాది కైంక‌ర్యాల‌న్నీ ఈ ఆల‌యంలో జ‌రుగుతుంటాయి. ఈ ఆల‌యంలో కొలువైన వేమ‌న‌ను దైవాంశ సంభూతుడిగా ఆరాధిస్తారు. పూజ‌లు చేస్తారు. ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఇక ఈ దేవాల‌యంలో అర్చకులు కూడా హ‌రిజ‌నులే కావ‌డం విశేషం.

ఇది చదవండి: రుద్రాక్షలు అమ్మే షాపు.. కానీ, లోపలికెళ్లి చూస్తే ఫ్యూజులు ఔట్.. ఇంతకీ ఏమున్నాయంటే..!


అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం కటారుపల్లి వాసులు 1789లో ‘వేమన గుడి’ నిర్మించారు. ఆ ప్రాంతంలోనే ఆయన జీవ సమాధి అయ్యారన్నది అక్కడి వారి న‌మ్మకం. యోగి వేమ‌న ఆల‌యాలు చాలా అరుదుగా ఉన్నాయి. వాటిలో ఒక‌టి నెల్లూరు జిల్లాలోని ప‌ల్లిపాడు గ్రామంలో ఉంది. ఈ ఆల‌యాన్ని సంద‌ర్శించేందుకు సూదూర ప్రాంతాల నుంచి కూడా యాత్రికులు వ‌స్తుంటారు. స్థానికులు మాత్రం వేమ‌న‌ను దైవంగా కొలుస్తారు. ఇక్కడ చాలామంది త‌మ పిల్లల‌కు వేమ‌న పేరునే నామ‌క‌ర‌ణం చేస్తుండ‌డం మ‌రో ప్రత్యేకం.

ఇది చదవండి: పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి అనుకుంటున్నారా..? మీకో గుడ్ న్యూస్


నెల్లూరులోని వేమ‌న ఆల‌యం ఎంతో ప్రసిద్ది చెందిందే అయినా.. ఆద‌ర‌ణ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఈ ఆల‌యాన్ని అభివృద్ది చేయాల‌ని అర్చకులు, స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వం వేమన ఆల‌యంపై దృష్టి పెట్టి పున‌రుద్దరించాల‌ని, మెరుగైన వ‌స‌తులు క‌ల్పిస్తే బాగుంటుంద‌ని విజ్ఞప్తి చేస్తున్నారు. యోగి వేమ‌న జీవితం గురించి, ఆయ‌న ప‌ద్యాల గురించి, ఆలయ విశిష్టత గురించి భావిత‌రాల‌కు అందించిన‌ట్లు అవుతుంద‌ని చెబుతున్నారు.

అడ్రస్‌: పల్లిపాడు గ్రామం, ఇందుకూరు పేట మండలం, శ్రీ పొట్టి శ్రీ రాములునెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌- 524313.

Nellore Yogi Vemana Temple Map

ఎలా వెళ్లాలి?

నెల్లూరు పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలోనే ఈ వేమన ఆలయం ఉంటుంది. నెల్లూరు బస్టాండ్ నుంచి బస్సు లేదా ఆటోలు అందుబాటులో ఉన్నాయి.

First published:

Tags: Andhra Pradesh, Local News, Nellore