YCP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (Andhra Pradesh Politics) రసవత్తరంగా మారాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది. అందులో భాగంగా నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్ల పర్వం కొనసాగుతోంది. అయితే మొన్నటి వరకు అధికార వైసీపీ వర్సెస్ ప్రతిపక్షాలుగా ఈ ఫైట్ కనిపించేది. కానీ తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలఫలితాల తరువాత.. సొంత పార్టీ నేతల మధ్యే మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా (Nellore District) లో పరిస్థితి మరింత హీట్ పుట్టిస్తోంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వేశారు అనే కారణంగా బహిష్కరణకు గురైన ముగ్గురు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandra Sekhar Reddy), ఆనం రాంనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) లే లక్ష్యంగా వైసైపీ మంత్రులు, మాజీ మంత్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా జిల్లాకే చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. సస్పెండ్‌కు గురైన ముగ్గురు ఎమ్మెల్యేలకు ఛాలెంజ్ కూడా విసిరారు.. ఇంకతీ ఆ ఛాలెంజ్ ఏంటంటే..?
పార్టీకి నమ్మక ద్రోహం చేసినవారికి ఘోర భంగపాటు తప్పదు అన్నారు. ఏదైనా పార్టీ తరపున పోటీ చేసినా.. లేక ఇండిపెంటెంట్ గా పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమన్నారు. ఆ ముగ్గురు మళ్లీ ఎమ్మెల్యేలుగా నెగితే.. తాను శాశ్వతంగా రాజకీయలకు దూరం అవుతాను అంటూ ఓపెన్ చాలెంజ్ చేశారు. ఒకవేళ తాను ఎమ్మెల్యేగా గెలిస్తే.. ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు అలా చేయగలరా అని ఛాలెంజ్ చేశారు.
అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలకు అదే స్థాయిలో ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. మాజీ మంత్రి అనిల్ నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. అసలు ముందు తన నియోజకవర్గం గురించి అనిల్ ఆలోచించుకుంటే మంచిది అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి చూపిస్తానని, గెలవకపోతే రాజకీయాలు పూర్తిగా వదిలేస్తానని, నువ్వు గెలవకుంటే రాజకీయాల నుండి తప్పుకుంటావా? అంటూ అనిల్‌కు చంద్రశేఖర్‌రెడ్డి సవాల్ విసిరారు. సింగిల్ డిజిట్‌తో గెలిచిన అనిల్ ఎక్కడ.. 35వేల మెజార్టీతో గెలిచిన తానెక్కడ అంటూ మండిపడ్డారు.
ఇదీ చదవండి : పొత్తులపై చంద్రబాబు క్లారిటీ.. వచ్చే ఎన్నికల్లో 40 శాతం టికెట్లు యువతకే.. టీడీపీ కీలక నిర్ణయాలు ఇవే..
వచ్చే ఎన్నికల్లో తాను మాత్రమే కాదు. ఆనం, కోటంరెడ్డి కూడా గెలవడం ఖాయం అన్నారు. తాము ముగ్గురం నూటికి నూరుపాళ్లు ఎమ్మెల్యేలుగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం అనిల్ కుమార్ పార్టీ భ్రమలో మాట్లాడుతున్నాడని, కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతుందని, వైసీపీ ఓడిపోబోతుందని మేకపాటి జోస్యం చెప్పారు. అసలు అనిల్ కు ఈ సారి టికెట్ ఇస్తారా లేదా అంటూ అనుమానం వ్చక్తం చేశారు. ఎందుకంటే ఇప్పటికే పార్టీ టికెట్టు ఇవ్వరని ప్రచారం జరుగుతోంది. ముందు అనిల్ సీటు అనిల్ చూసుకుంటే మంచిది అన్నారు. అయితే పార్టీ టికెట్ అడిగితే తనను సస్పెండ్ చేయడం సీఎం జగన్‌కు న్యాయం కాదన్నారు. మతని సస్పెండ్‌చేసి తమపైనే అట్రాసిటీ కేసులు పెట్టించమని సజ్జల చెప్పటం చాలా గొప్పతనం అంటూ చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చాలామంది ఎమ్మెల్యేలు పార్టీపైన అసంతృప్తితో ఉన్నారని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, TDP