Kotamreddy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government)పై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (YCP rebel MLA Kotamreddy Sridhar Reddy) నిరసన తెలుపుతున్నారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో (AP Assebly Budget Session) నూ ప్రభుత్వంపై నిరసనగళం వినిపించారు. రెండో రోజు సభ ప్రారంభం కాగానే.. స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Tammineni Sitharam) ప్రశ్నోత్తరాలను చేపట్టారు. స్పీకర్ ప్రశ్నోత్తరాలను ప్రస్తావించిన వెంటనే నియోజక సమస్యలను ప్రస్తావిస్తూ కోటంరెడ్డి ప్లకార్డుతో సభలో నిరసనకు దిగారు. క్వశ్చన్ అవర్ మధ్యలో సభ్యులు మాట్లాడకూడదని స్పీకర్ కోరారు. ఒకవేళ శ్రీధర్ రెడ్డి మీరు తన నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకోవాలంటే తాను తెలియచేసుకునేందుకు అవకాశం ఇస్తాను అన్నారు. మీరు చేస్తున్న ప్రొటెస్ట్‌ను హౌస్, తాను కూడా గుర్తించామన్నారు. అలాగని ఇలా కంటిన్యూగా నిరసనకు దిగగం సరైంది కాదన్నారు.
కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తీరును తప్పు పట్టారు మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి.. సమస్యలు లేని సోసైటీ ఉండదని గుర్తు చేశారు. అయితే సమస్యలను ఏ వేదికలో తీర్చుకోవాలనేది చూడాలన్నారు. గవర్నర్ ప్రసంగం జరగాల్సిన సమయంలో వ్యక్తిగత అంశాలు అడగడం సమంజసం కాదని వివరించే ప్రయత్నం చేశారు. ఒకవేళ కోటంరెడ్డి తన ప్రజలకు ఉండే ఇబ్బందులను రిప్రజెంట్ చేస్తే కచ్చితంగా స్పందిస్తామన్నారు.
మంత్రి అంబటి రాంబాబు మట్లాడుతూ.. శ్రీధర్ రెడ్డి కావాలనే రగడ చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఆయన హౌస్‌ను ఇబ్బందిపెట్టి ప్రజల దృష్టిలో పడాలని చూస్తున్నారన్నారని.. టీడీపీ సభ్యులకు తెల్లారే సరికి శ్రీధర్ రెడ్డిపై ప్రేమ వచ్చేసిందే అంటూ ఎద్దేవా చేశారు. శ్రీధర్ రెడ్డి ఇక్కడకు వచ్చి తెలుగుదేశంతో చేతులు కలిపి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంటే ఆయన ఉద్దేశం ఏంటో అర్థమైందన్నారు. శ్రీధర్ రెడ్డి నమ్మక ద్రోహి అని... శ్రీధర్ రెడ్డిని క్షమించొద్ద అని సభను కోరుతున్నాను అన్నారు.
ఇదీ చదవండి : హత్య కేసులో వారి ప్రమేయం? కఠినంగా శిక్షించాల్సిందే.. సునీతా రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మరోవైపు అంతకుముందు.. సచివాలయం అగ్నిమాపక కేంద్రం దగ్గర కోటంరెడ్డి నిరసన తెలిపారు. తన నియోజకవర్గంలోని సమస్యల ప్ల కార్డులను ప్రదర్శిస్తూ అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన అంతరాత్మ ప్రభోదానుసారమే ఓటు వేస్తానని తెలిపారు. వైసీపీ ఇతర ఎమ్మెల్యేలు కూడా వారి వారి అంతరాత్మ ప్రభోదానుసారం ఓటు వేస్తారని భావిస్తున్నాను అన్నారు.
ఇదీ చదవండి : ఈ వింత ఆచారం గురించి తెలిస్తే నోరెళ్లబెడతారు.. ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
తన నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన పోరాటం నిరంతరాయంగా కొనసాగుతుంది అన్నారు. నిజంగా తమ సమస్యలను పరిస్కరిస్తే ముఖ్యమంత్రిని అభినందిస్తానన్నారు. 4 ఏళ్ళు సమస్యల పరిష్కారం కోసం తిరిగి తిరిగి విసిగిపోయే గళం వినిపిస్తున్నానన్నారు. మైకు ఇచ్చే వరకూ అసెంబ్లీలో మైక్ అడుగుతూనే ఉంటాను అన్నారు. మైక్ ఇవ్వకుంటే తన నిరసన ప్లకార్డుల రూపేణా నిలబడి ప్రదర్శిస్తూనే ఉంటానన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Assembly, AP News, Kotamreddy sridhar reddy