Anam Ramanarayana Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (Andhra Pradesh Politics) పూర్తిగా వేడెక్కాయి. నలుగురు ఎమ్మెల్యే బహిష్కరణ వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాతా తనపై వేటు వేయడంపై మాజీ మంత్రి.. రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి (Anama Ramanarayana Reddy) ఘాటుగా స్పందించారు. ఒకప్పుడు సాధారణ జర్నలిస్టు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) గురించి ఏటుజెట్ అంతా తనకు తెలుసు అన్నారు. అసలు ఆయన ఇప్పుడు అన్ని కోట్లకు ఎలా పడగలెత్తారని ప్రశ్నించారు. నిజంగా వారు ఆరోపిస్తున్నట్టు.. ఎమ్మెల్సీ ఓటింగ్‌లో సీక్రెట్ బ్యాలెట్ పెడితే.. ఎవరు ఎవరికి ఓటేశారో వైసీపీ నేతలకు ఎలా తెలుసంటూ ఆనం రాంనారాయణరెడ్డి ప్రశ్నించారు. అయితే 24 గంటలకు ముందు ఒక మాట.. తరువాత ఒక మాట ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. మొదట అసలు ఆనం ఓటును తాము పరిగణలోకి తీసుకోలేదన్నారు. తనను ఓటు వేయమని కూడా అడగలేదని.. అయితే తన ఆత్మ ప్రభోదానుసారం ఓటు వేస్తే.. ఇప్పుడు అసత్య ఆరోపణలు ఎలా చేస్తున్నారని నిలదీశారు.
తన నియోజకవర్గంలో ఇంచార్జీని పెట్టినరోజే.. తాను పార్టీకి దూరం అయ్యాను అన్నారు. ఇప్పుడు ఏ పార్టీకి ఓటు వేశాను అన్నది చెప్పాల్సిన అవసరం కూడా తనకు లేదన్నారు. తాను క్రాస్ ఓటింగ్ చేశాననేది కేవలం బురద జల్లే కార్యక్రమమే అన్నారు. ఆనం రాంనారాయణరెడ్డి ఓటుని పరిగణలోకి తీసుకోడంలేదని సజ్జల ముందురోజు అన్నారని.. కానీ మరుసటిరోజు తాను క్రాస్ ఓటింగ్ చేశానని సజ్జల చెప్పారు.. అసలు సీక్రెట్ బ్యాలెట్‌లో ఎవరికి ఓటేశానో మీకెలా తెలుసు? అంటూ ప్రశ్నించారు.
తన ఓటు నిజంగానే అధిష్టానం పరిగణలోకి తీసుకోకపోతే.. తాను ఎవరికి ఓటేస్తే మీకెందుకు అని ఫైర్ అయ్యారు. తన నియోజకవర్గంలో రాజ్యాంగేతర శక్తిని ఇంచార్జీగా నియమించడం బాధకరమైన విషయం అన్నారు. సజ్జల అవినీతిని ప్రశ్నిస్తే సీఎం జగన్ స్వయంగా ఫోన్ చేసి అలా మాట్లాడొద్దన్నారంటూ ఆనం పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో ఇంచార్జీని నియమించిన రోజే తాను ఆ పార్టీకి దూరంగా ఉన్నానన్నారు. సజ్జల విలేఖరి స్థాయి నుంచి కోట్లు సంపాదించే స్థాయికి ఎలా ఎదిగారో తనకు బాగా తెలుసు అన్నారు.
ఇదీ చదవండి : మొన్నటి వరకు గుండె జగన్ జగన్ అని కొట్టుకుంది? ఇప్పుడేమైంది? అసలు సమస్యయ ఏంటి?
మరోవైపు తాను పార్టీ మారుతున్నాను అనే ప్రచారం పైనా ఆనం క్లారిటీ ఇచ్చారు.. రాజకీయ నేతలు ఎవరైనా తమ భవిష్యత్తు కోసం ఏదో ఒక పార్టీలో ఉండడం అవసరమన్నారు. వైసీపీ బహిష్కరించినప్పుడు తన.. ప్రత్యమ్నాయాలు చూసుకోవాలి కదా అన్నారు. అయితే తనకు ఎప్పటి నుంచో అండగా ఉండి వస్తున్న.. కార్యకర్తల అభిప్రాయం తీసుకొని తరువాత అతి త్వరలోనే తన భవిష్యత్తుపై క్లారిటీ ఇస్తామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anam Ramanarayana Reddy, Andhra Pradesh, Ap cm jagan, AP Politics, Ycp