Home /News /andhra-pradesh /

NELLORE YCP POLITICAL CLASHES EX MINSTER ANIL KUMAR YADAV GAVE WARNING TO OWN PARTY LEADERS NGS

YCP Politics: మాజీ మంత్రిపై కుట్ర జరుగుతోందా? వాళ్ల చిట్టా అనిల్ బయటపెడతారా? ఎవరు వారు..?

మాజీ మంత్రి అనిల్ కుమార్ (ఫైల్)

మాజీ మంత్రి అనిల్ కుమార్ (ఫైల్)

YCP Politics: గత ఎన్నికల్లో జిల్లా మొత్తాన్ని వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అలాంటి చోట ఇప్పుడు సొంత పార్టీ కుమ్ములాటలు హాట్ టాపిక్ అయ్యాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టార్గెట్ గా కుట్రలు నడుస్తున్నాయా..? ఆయనే ఈ ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. అనుమానాలను పెంచేలా చేస్తోంది. అసలు నెల్లూరు వైసీపీలో ఏం జరుగుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nellore, India
    Nellore YCP Politics:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైసీపీ (YCP) వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు 175 గెలుపొందాలనే లక్ష్యంగా పెట్టుకుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) పదే పదే అదే మాట చెబుతున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తే.. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎక్కడైగా గ్రూపు తగదాలు ఉంటే.. వాటిని చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి నెల్లూరు జిల్లా (Nellore District) రాజకీయాలు రచ్చ రచ్చ అవుతుండడం.. పార్టీని కలవర పెడుతోంది. గతంలో దీనిపై పంచాయితీ జరిగినా మళ్లీ పరిస్థితి మొదటికే వచ్చింది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Ex Minster Anil Kumar Yadav) బహిరంగంగానే తన అసంతృప్తిని బయట పెట్టారు. తనపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల వెనుక సొంత పార్టీ నేతల హస్తం ఉందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనపై రాజకీయంగా కుట్రలు చేస్తున్న వారి చిట్టా.. వారి కాల్స్ ఆధారంగానే బయట పెడతానని సీరియస్ వార్నింగ్  ఇచ్చారు.

    తాజాగా అనిల్ కుమార్ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసినవి అనే చర్చ నెల్లూరు జిల్లాలో మొదలైంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి చూస్తే.. వైసీపీలో అనిల్ ఒంటరి అయినట్టే కనిపిస్తోంది. అనిల్ ను మంత్రి పదవి నుంచి తప్పించి.. కాకాని గోవర్దన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చినప్పుడు మొదలైన వర్గ పోరు ఇప్పుడు తారా స్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా వైసీపీ నేతలు.. కొందరు ఒక్కటై.. అనిల్ ను టార్గెట్ చేశారని.. ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు.


    తమ పార్టీకి చెందిన నేతలే కొందరు డబ్బులు ఇచ్చి మరీ టీడీపీ నేతలతో తిట్టిస్తున్నారని.. ప్రతిపక్ష పార్టీల వారితో ఎవరెవరు మాట్లాడుతున్నారో ఆ ఫోన్ కాల్స్ ద్వారా తెలుస్తాయని.. తనపై తప్పుడు కేసులు పెట్టేలా ప్రోత్సహిస్తున్నారి.. ఇదంతా సొంత పార్టీ వారే చేయిస్తున్నారన్న విషయం తనకు తెలుసని.. త్వరలో వారి చిట్టా బయటపెడతాను అన్నారు అనిల్ కుమార్.

    ఇదీ చదండి : జన్మాష్టమి రోజు కచ్చితంగా వెళ్లాల్సిన ప్రదేశం ఇదే.. శ్రీ రాధా పార్థసారథి విశిష్టత ఏంటంటే?

    మొదట కాకాని వర్సెస్ అనిల్ గా ఉన్న ఈ ఇంటి పోరు.. ఇప్పుడు అనిల్ కుమార్ వర్సెస్ ఇతర వైసీపీీ నేతలు అన్నట్టు పరిస్థితి మారి నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఇటీవల సీనియర్ నేత మాజీ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి.. మరో ఎమ్మెల్యే కోటం  రెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం అనిల్ ను ఉద్దేశించి పరోక్షంగా ఆరోపణలు చేసినట్టు సమాచారం. అయితే వచ్చే ఎన్నికల్లో అనిల్ ను వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయించడానికి అధిష్టానం సిద్ధమైందని.. కానీ అనిల్ కు మాత్రం ప్లేస్ మారడం ఇష్టం లేదని.. అందుకే ఈ విబేధాలు తెరపైకి వస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది..
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Anil kumar yadav, AP News, AP Politics, Ycp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు