హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: సీఎం జగన్ కు షాక్.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. నాలుగేళ్లలో ప్రజలకు ఏం చేశామని ఓట్లడుగుతాం

AP Politics: సీఎం జగన్ కు షాక్.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. నాలుగేళ్లలో ప్రజలకు ఏం చేశామని ఓట్లడుగుతాం

ప్రభుత్వంపై ఆనం సంచలన వ్యాఖ్యలు

ప్రభుత్వంపై ఆనం సంచలన వ్యాఖ్యలు

AP Politics: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికి సొంత పార్టీ నేతలే షాక్ ఇస్తున్నారు. ఓ వైపు సీఎం జగన్ మోహన్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్ల మనవే అని చెబుతూ ఉంటే.. ఆ పార్టీ ఎమ్మెల్యే వెర్షన్ మాత్రం షాకిచ్చేలా ఉంది. ఈ నాలుగేళ్లలో ఏం చేశామని.. ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు అడుగుతామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nellore, India

AP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అన్ని పార్టీలు గెలుపై ఫోకస్ చేస్తున్నాయి. మరోవైపు అన్ని పార్టీల్లోనూ వర్గ పోరు తీవ్రస్థాయికి చేరింది.. సొంత పార్టీ తీరుపైనే విమర్శలు చేసే నేతల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా అధికార వైసీపీ (YCP) ఈ సమస్య ఎక్కువగా ఉంది. సీఎం మాత్రం ఓ వైపు 175కి 175 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుంటే.. పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. ప్రభుత్వం ఈ నాలుగేళ్లల కాలంలో ఏం చేసిందో ప్రజలకు చెప్పాలని.. గడప గడపకు వెళ్లి.. ప్రజలను కలవాలని.. వాటి ఆధారంగానే వారికి సీట్లు కేటాయింపు ఉంటుందని అధినేత చెబుతున్నారు. కానీ కొందరు ఎమ్మెల్యేలు మాత్రం.. గడప గడపకు తిరగలేం అంటున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వంపై సొంత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramnarayana Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశామని ఓట్లు అడుగుతామని ప్రభుత్వ తీరు ఆయన మండిపడ్డారు.

నెల్లూరు జిల్లా రాపూరులో నూతనంగా నియమించిన సచివాలయ వైసీపీ కన్వీనర్లు, వాలంటీర్లతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్లు గుంతలు పూడ్చలేకపోతున్నామని.. కనీసం తాగడానికి నీళ్లు లేవని.. నాలుగేళ్లలో ఏం పని చేశామని ప్రజలను ఓట్లు అడుగుతామంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు..

ప్రాజెక్టులు కట్టామా? పనులు మొదలుపెట్టామా? పింఛన్లు ఇస్తే ఓట్లు వేస్తారా? అలా అయితే గత ప్రభుత్వమూ ఇచ్చిందన్నారు. ఇళ్లు కడతామని లేఅవుట్‌ వేసినా ఇప్పటికీ కట్టలేదని రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆనం తీవ్ర ఆరోపణలు చేశారు. ఎస్ఎస్‌ కెనాల్‌ కడతామని ఎన్నికల వేల హామీ ఇచ్చామన్నారు. మూడున్నరేళ్లయినా కనీసం కెనాల్‌ గురించి పట్టించుకోలేదు. ఎస్‌ఎస్‌ కెనాల్‌ గురించి సీఎం జగన్‌కు ఎన్నోసార్లు చెప్పాం. ఇదే విషయాన్ని అసెంబ్లీలోనూ ప్రస్తావించాం. ఎస్‌ఎస్‌ కెనాల్‌ గురించి చీఫ్‌ ఇంజినీర్ల భేటీలోనూ కోరాం. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉంది అన్నారు.

ఇదీ చదవండి : పెన్షన్లలో భారీ కోత.. లబ్ధిదారుల ఆవేదన.. ఎందుకు తొలగించారు అంటే..

కంటి ముందు నీళ్లున్నాయని సంతోషపడటమే తప్ప నీళ్లు తాగలేని పరిస్థితి. ఇక్కడి నీళ్లు తాగగలమనే ఆత్మవిశ్వాసం ప్రజలకు లేదు. కండలేరు దగ్గరే ఉన్నా రాపూరులో ఒక్క చెరువులో నీళ్లు నింపలేకపోయాం. కండలేరు అభివృద్ధి విషయంలో వైఎస్‌ఆర్‌ కలను నెరవేర్చలేకపోయామన్నారు. వైఎస్‌ఆర్‌ కలను నెరవేర్చలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామా అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ప్రస్తుతం తనను కూడా నమ్మే పరిస్థితిలో లేరు. అపనమ్మక వ్యవస్థలో పనిచేస్తున్నామన్నారు. గ్రామాల్లో ప్రజలకు బిందెడు నీళ్లు ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

First published:

Tags: Anam Ramanarayana Reddy, Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics

ఉత్తమ కథలు