హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nellore: యువతితో గ్రామ సచివాలయ ఉద్యోగి రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య.. వీడియో వైరల్

Nellore: యువతితో గ్రామ సచివాలయ ఉద్యోగి రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య.. వీడియో వైరల్

నెల్లూరులో భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య

నెల్లూరులో భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య

Nellore News: అతడికి పెళ్లైంది. మంచి ఉద్యోగం. అందమైన భార్య ఉంది. అత్తమామలు భారీగా కట్నమిచ్చారు. ఇటీవలే ఉద్యోగం కూడా పర్మినెంట్ అయింది. అనా మనోడికి పక్క చూపులు మానలేదు. సీక్రెట్ గా మరో యువతిని లైన్లో పెట్టాడు. చివరకు భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.

ఇంకా చదవండి ...

  అతడికి పెళ్లైంది. మంచి ఉద్యోగం. అందమైన భార్య ఉంది. అత్తమామలు భారీగా కట్నమిచ్చారు. ఇటీవలే ఉద్యోగం కూడా పర్మినెంట్ అయింది. అనా మనోడికి పక్క చూపులు మానలేదు. సీక్రెట్ గా మరో యువతిని లైన్లో పెట్టాడు. చివరకు భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నెల్లూరు జిల్లా (Nellore District)  ఇందుకూరుపెంటకు చెందిన చలం వెంకటేష్.. తోటపల్లి మండలం పోట్లపూడి సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. అతడికి కొంతకాలం క్రితం సుమచందు అనే మహిళతో పెళ్లైంది. పెళ్లి సమయంలో సుమ తల్లిదండ్రులు భారీగా బంగారం, నగదు కట్నంగా ఇచ్చారు. ఐతే కొన్నిరోజులుగా వెంకటేష్ ప్రవర్తనలో మార్పును గమనించిన భార్య.. అతడిపై నిఘా పెట్టింది. భర్త వెంకటేష్ మరో అమ్మాయితో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నట్లు తెలుసుకుంది.

  రెండు వారాల క్రితం నెల్లూరు వెళ్లిన భర్త.. ఓ హోటల్లో ప్రియురాలితో కలిసి ఉన్నాడని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి.. బంధువులను వెంటబెట్టుకొని వెళ్లింది. అక్కడే అతడ్ని రెడ్ ప్రియురాలితో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. పోలీసుల వెంకటేష్ ను తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి పద్ధతి మార్చుకోవాలని చెప్పి పంపేశారు. ఐతే పోలీసులు చెప్పినా, భార్య బుద్ధి చెప్పినా వెంకటేష్ లో మార్పు రాలేదు. ప్రియురాలిని తీసుకొని వెళ్లి తన అమ్మమ్మ ఊరైన కొడవలూరులో ఆమెను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.

  ఇది చదవండి: సాయి ప్రియాంక కేసులో మరో ట్విస్ట్.. కేసు నమోదుకు రంగం సిద్ధం..! కారణం ఇదే..!


  ఐతే భార్య సుమ.. కొడవలూరు వెళ్లి భర్తను నిలదీసేందుకు యత్నించగా.. అక్కడ వెంకటేషన్ అమ్మమ్మ బంధువులు ఆమెపై దాడి చేసి కొట్టారు. దీంతో ఆమె తనకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగింది. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి వెంకటేష్ ఇలా చేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సుమ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది.


  ఇది చదవండి: అమ్మాయి కోసం కొట్టుకున్న సీఐ, కానిస్టేబుల్.. ఉన్నతాధికారుల ఎంట్రీ.. చివరికి ఏం జరిగిందంటే..!


  ఇటీవల గుంటూరు జిల్లాలో ఇలాంటి చీటర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కర్నాటి సతీష్ అనే వ్యక్తి.. సెలవుపై ఇండియా వచ్చినప్పుడల్లా అమాయక యువతులను నమ్మించి పెళ్లి చేసుకుంటున్నాడు. తనకు విడాకులయ్యాయని చెప్పి నమ్మించి భారీగా కట్నకానులకు తీసుకుంటున్నాడు. రెండు నెలలు కాపురం చేసిన తర్వాత మళ్లీ వచ్చి తీసుకెళ్తానంటూ నమ్మించి ఉడాయిస్తున్నాడు. ఇలా దాదాపు ఐదుగుర్ని పెళ్లి చేసుకొని మోసం చేశాడు. అంతేకాదు భార్యతో ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి ప్రశ్నిస్తే న్యూడ్ వీడియోలు ఇంటర్నెట్లో పెడతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. మోసపోయిన మహిళల్లో ఇద్దరు దిశ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎన్నారై మోసగాడ్ని అదుపులోకి తీసుకున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Extramarital affairs, Nellore Dist

  ఉత్తమ కథలు