హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Super Food: పాయా దోశ ఎప్పుడైనా తిన్నారా? ఇక్కడ దొరికే దోశ ఒక్కసారి తిన్నారంటే ఆహా అనాల్సిందే..!

Super Food: పాయా దోశ ఎప్పుడైనా తిన్నారా? ఇక్కడ దొరికే దోశ ఒక్కసారి తిన్నారంటే ఆహా అనాల్సిందే..!

ఫుడ్

ఫుడ్ లవర్స్‌ని ఆకట్టుకుంటున్న నెల్లూరు పాయాదోశ

ఆహార రుచుల‌కు సింహ‌పురి పెట్టింది పేరు. భోజ‌నం గానీ, టిఫిన్ గానీ, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్స్ గానీ, చివ‌రికి స్ట్రీట్ ఫుడ్.. ఇలా ఏ రకమైనా ఆహారం గురించి చెప్పుకున్నా.. ఇక్కడ ఏం తిన్నా కొత్త రుచిని ఆస్వాదించినట్లే..! ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నెల్లూరు (Nellore) ప్రాముఖ్యత‌ను సంపాదించుకుంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nellore, India

  Polaa Sudha, News18, Nellore

  ఆహార రుచుల‌కు సింహ‌పురి పెట్టింది పేరు. భోజ‌నం గానీ, టిఫిన్ గానీ, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్స్ గానీ, చివ‌రికి స్ట్రీట్ ఫుడ్.. ఇలా ఏ రకమైనా ఆహారం గురించి చెప్పుకున్నా.. ఇక్కడ ఏం తిన్నా కొత్త రుచిని ఆస్వాదించినట్లే..! ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నెల్లూరు (Nellore) ప్రాముఖ్యత‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా ఎన్నో రకాల దోశలు ఇక్కడ చాలా ఫేమస్‌.. అందులో ఈ మధ్య పాయా దోశ బాగా పాపులారిటీ తెచ్చుకుంది. నెల్లూరు న‌గ‌రం మినీబైపాస్ రోడ్డులో వెళితే.. రోడ్డు ప‌క్కనే విఘ్నేశ్వర మొబైల్‌ ఫుడ్ సెంట‌ర్ క‌నిపిస్తుంది. చూసేందుకు స్ట్రీట్ ఫుడ్‌గా క‌నిపించినా.. ఇక్కడ చేసే వంట‌కాల్లో పాయా దోశ‌ మాత్రం అద్భుతం. ఒక్కసారి తింటే మ‌ళ్ళీ మ‌ళ్ళీ వ‌చ్చి ఆర‌గించాల‌నేంత టేస్టీగా ఉంటుంది.

  అందుకే న‌గ‌రం నుంచే ఇత‌ర ప్రాంతాల నుంచి నెల్లూరుకి వ‌చ్చిన చాలామంది ఆహార‌ప్రియులు, ఇక్కడికి వ‌చ్చి ఈ వంట‌కాలను ఆర‌గిస్తుంటారు. ఈ టిఫెన్‌ సెంటర్‌ ముఖ్యంగా దోశ‌ల త‌యారీకి ఫేమ‌స్. అందులో పాయ‌, చికెన్ సేరువా వేసుకుని లాగిస్తుంటే... ఆ టేస్ట్ మాట‌ల్లో చెప్పలేనిది. పిండిని పెనం మీద పోసి.. పెనంను గిరాగిరా తిప్పేసి రెండు నిమిషాల త‌ర్వాత పెనం నుంచి తీసేస్తారు. ఇక అందులో వేసే పాయా, చికెన్ సేరువా.. ఒక్కో ముక్క తింటుంటే నోట్లో అమృతం ఉన్నట్లే అనిపిస్తుంది. ఇవే కాదు.. బోన్ లెస్ హెడ్ క‌ర్రీ కూడా ఇక్కడ టేస్టీ వంట‌కాల్లో ఒక‌టి. విఘ్నేశ్వర మొబైల్‌ ఫుడ్ సెంటర్‌లో ఆహార‌ప్రియుల అభిరుచుల గురించి.. ఇక్కడి య‌జ‌మానులుసైతం ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

  ఇది చదవండి: విశాఖ బీచ్‌ రోడ్‌లో ఫేమస్‌ స్ట్రీట్‌ స్నాక్ ఏంటో తెలుసా..? ఎవ్వరికైనా నోరూరాల్సిందే..!

  చాలా చోట్ల ఇలాంటి దోశ‌లు చేసేవారు ఉన్నప్పటికీ... ఇక్కడ త‌యారుచేసేంత రుచి మ‌రెక్కడా దొర‌క‌ద‌ని టిఫిన్ ప్రియులు చెబుతుంటారు. అందుకే దూరం ఎక్కువైనా, ధర ఎక్కువైనా ఇక్కడ పాయా దోశలను తినేందుకు ఇష్టప‌డుతుంటారు. ఈ పాయా దోశ‌ల‌కు నెల్లూరులో వీరాభిమానులు ఉన్నారన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ పాయ దోశ త‌యారీ కోసం ఖ‌రీదైన, నాణ్యమైన ప‌దార్ధాల‌నే వాడుతుంటారు. ఆరోగ్యాన్ని పెంచే పోష‌క విలువ‌లుండే పాయాని పొద్దిన్నే టిఫెన్‌లో తినడం వల్ల రోజంతా శరీరానికి కావల్సిన పోషకాలన్ని అందేస్తాయని కొందరు ఫుడ్‌ లవర్స్‌ చెబుతున్నారు. ఈ టిఫెన్‌ సెంటర్‌ ముందు ఎప్పుడూ రద్దీగా ఉంటుందంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ దొరకే పాయా దోశ ఏ టేస్ట్‌లో ఉంటుందో..!

  అడ్రస్‌: మిని బైపాస్‌ రోడ్డు, గుడూరు బాస్కరరామిరెడ్డి లేఅవుట్‌, నెల్లూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ - 524003

  Nellore Paya Dosha Map

  ఎలా వెళ్లాలి?

  నెల్లూరు బస్టాండ్‌ నుంచి ఆటోలు, బస్సుటు అందుబాటులో ఉంటాయి. మిని బైపాస్‌ రోడ్డుకెళ్లి విఘ్నేశ్వర మొబైల్‌ ఫుడ్‌ సెంటర్ అని అడిగితే ఎవ్వరైనా చెబుతారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Food, Local News, Nellore

  ఉత్తమ కథలు