Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
YCP Rebels: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) పరిణామాలు ఊహించన విధంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత.. రాజకీయం మరింత వేడెక్కింది. ఇప్పుడు రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. వైసీపీ అధిష్టానం నలుగురు ఎమ్మెల్యేలపై వేటు (Rebel MLA s Suspended) వేసింది. దీంతో వారి భవిష్యత్తు ఏంటి.. ఇలాగానే పార్టీకి దూరంగా ఉంటూ రాజకీయ భవిష్యత్తును కొనసాగిస్తారా..? లేక ధైైర్యంగా పార్టీకి రాజీనామా చేస్తారా.. అలాగే చేస్తే మళ్లీ ఉప ఎన్నిక వస్తే పరిస్థితి ఏంటి..? అసలు రెబల్ ఎమ్మెల్యేల మనసులో ఏముంది.. ప్యూచర్ కు ముందే అంతా లైన్ క్లియర్ చేసుకున్నారా అన్నది ఆసక్తి పెంచుతోంది. అయితే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) , ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayna Reddy) లకు ముందు నుంచే టీడీపీ నుంచి సీటుపై హామీలు ఉన్నాయనే ప్రచారం ఉంది. సో నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు రెబల్ గా మారితే.. ఇద్దరు టీడీపీ లో చేరడంపై క్లారిటీ ఉంది. మరి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ ఫ్యూచర్ ఏంటి..?
నెల్లూరు జిల్లా రాజకీయాలలో మేకపాటి కుటుంబానిది ప్రత్యేకమైన స్థానం. మొదట కాంగ్రెస్ పార్టీ నుండి రాజకీయ ప్రవేశం చేసిన మేకపాటి రాజమోహన్ రెడ్డి.. తరువాత టీడీపీతో కలిసి ప్రయాణించారు. వై.ఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మళ్ళీ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఆయన వై.ఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తులలో ఒకరిగా మారారు. ఒకానొక దశలో నెల్లూరు రాజకీయాలను తన కనుసైగతో శాశించిన మేకపాటి కుటుంబం ఇప్పుడు రాజకీయంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటుందనే చెప్పాలి.
వైసీపీ పార్టీ ఆవిర్భావ సమయంలో మేకపాటి సోదరులు కాంగ్రెస్ పార్టీలో తమ పదవులను సైతం త్యాగం చేసి జగన్ వెంట నడిచారు. 2019లో అధికారంలోకి వచ్చాక మేకపాటి గౌతమ్ రెడ్డిని మంత్రిని చేసిన జగన్ ఆ కుటుంబానికి సముచిత గౌరవం దక్కేలా చేశారు. అయితే గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం తరువాత.. ఆయన మంత్రి పదవి తమ కుటుంబంలోనే ఎవరో ఒకరికి ఇవ్వమని అడిగినా జగన్ సుముఖత చూపలేదు అనేది మేకపాటి వర్గీయుల మాట.
ఇదీ చదవండి: సింహం ఒక్క అడుగు వెనక్కు వేస్తే ఓడినట్టా? దాన్ని కూడా చంద్రబాబు టచ్ చేయలేరన్న రోజా
అప్పటి నుండి మేకపాటి కుటుంబం కొంత ముభావంగానే ఉంటూ వస్తోంది. అడపా దడపా ఉదయగిరి శాసన సభ్యుడు మేకపాటి చంద్ర శేఖర రెడ్డి మాత్రం ప్రభుత్వం పై తన అసంతృప్తిని బాహాటం గానే వ్రెళ్ళగక్కుతున్నారు. సొంతపార్టీ నుంచి విమర్శలను సహించని జగన్.. చంద్రశేఖర రెడ్డికి చెక్ పెట్టే ప్రయత్నాలు ప్రారంభించారని నెల్లూరు జిల్లాలో జోరుగా చర్చ జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే జగన్ వచ్చే ఎన్నికలలో ఉదయగిరి సీటు వేరొకరికి ఇవ్వనున్నారని చంద్రశేఖరరెడ్డి బలంగా నమ్ముతున్నారు. అందుకే తన నియోజకవర్గంలో పరిశీలకుడి పేరుతో మరో పవర్ సెంటర్ ని ఏర్పాటు చేయడం పై ఆయన తన అసంతృప్తిని బాహాటంగానే బయటపెట్టారు.
అంతే కాక ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు జగన్ తో జరిగిన భేటీలో కూడా ఎమ్మెల్సీ సీటు ఇచ్చేది లేదని అధినేత ఆయనకే క్లియర్ గా చెప్పారని మేకపాటి చెబుతున్నారు.
ఇదీ చదవండి : ఆ రోజు జగన్ ఫోన్ చేశారు.. ఆనం సంచలన వ్యాఖ్యలు.. ఓటు ఎవరికి వేశారంటే..?
మరోవైపు వైసీపీ నుంచి మరో 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారనీ గుర్తు చేశారు. చేసిన కాంట్రాక్టర్లకి బిల్లులు కూడా ఇప్పించుకోలేని దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఉండడం దారుణమన్నారు. వైఎస్.ఎస్ రాజశేఖరరెడ్డి దగ్గర ఉన్న గౌరవ మర్యాదలు జగన్ దగ్గర లేవంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. తాజాగా మేకపాటి వ్యాఖ్యలు వింటే.. ఆయన ముందుగానే ఫ్యూచర్ పై ఫిక్స్ అయినట్టు సమాచారం. ఏది ఏమైనా వచ్చే ఎన్నికలలో జగన్ తనకు ఎలాగూ టికెట్ ఇవ్వడని ఓ నిర్ధారణకు వచ్చిన చంద్రశేఖర్ రెడ్డి కావాలనే జగన్ పై ఇలాంటి విమర్శలు చేస్తున్నారని వై.సి.పి వర్గాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సీఎం తీసుకున్న నిర్ణయం సంతోషాన్ని ఇస్తోంది అన్నారు. తన తలపై ఉన్న భారం పూర్తిగా దిగిపోయిందంటూ.. తన వ్యాఖ్యలను పార్టీ అధిష్టానానికి షాక్ ఇస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap mlc elections, AP News, AP Politics