హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nellore: A టు Z ఏదైనా.. అతి తక్కువ ధరకే.. ప్రత్యేకంగా నిలుస్తున్న సండే మార్కెట్

Nellore: A టు Z ఏదైనా.. అతి తక్కువ ధరకే.. ప్రత్యేకంగా నిలుస్తున్న సండే మార్కెట్

X
అతితక్కువ

అతితక్కువ ధరకే నెల్లూరు సండే మార్కెట్

షాపింగ్ అంటే ఇష్టప‌డ‌ని వారు ఎవ‌రుంటారు ? అయితే ఎక్కడ షాపింగ్ చేయాలి ? ఎక్కడ మ‌న్నిక‌గా వ‌స్తువులు దొరుకుతాయి ? ధ‌ర ఎక్కడ త‌క్కువ‌గా ఉంటుంది ? ఇలా ర‌క‌ర‌కాల ప్రశ్నలు మ‌దిలో మెదులుతుంటాయి. వీట‌న్నింటికీ ఒక్కటే స‌మాధానం. నెల్లూరులోని సండే మార్కెట్.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nellore, India

Polaa Sudha, News18, Nellore.

షాపింగ్ (Shoping) అంటే ఇష్టప‌డ‌ని వారు ఎవ‌రుంటారు..? అందులోనూ మహిళలకు మార్కెట్ చేయడమంటే చాలా ఇష్టం.. ఇక ఆదివారం అంటే..  మార్కెట్ కు వెళ్లి షాపింగ్ చేయడానికే ఎక్కువమంది ఇష్టపడతారు. కానీ ఉన్నది ఒక్కరోజే అయినప్పుడు.. ఎక్కడకు వెళ్లాలి..  ఎక్కడ మ‌న్నిక‌గా ఉన్న వ‌స్తువులు దొరుకుతాయి ? ధ‌ర ఎక్కడ త‌క్కువ‌గా ఉంటుంది ? ఇలా ర‌క‌ర‌కాల ప్రశ్నలతో మంచి ప్లేస్ కోసం వెతుకుంటారు. అలా వెతికేవారందరికి దొరికే సమాధానం ఒక్కటే.. అదే నెల్లూరు (Nellore) లోని సండే మార్కెట్ (Sunday Market). అక్కడ దొరకని వస్తువు అంటూ ఏదీ ఉండదు. ధ‌ర త‌క్కువ‌.. మ‌న్నిక ఎక్కువ‌.. నెల్లూరు సండే మార్కెట్లో షాపింగ్ చేసిన వారెవ‌రైనా ఠ‌క్కున చెప్పే మాట‌ ఇదే. ఎందుకంటే ఇక్కడికి పేద‌ల నుంచి ధ‌న‌వంతుల వ‌ర‌కు.. ప్రతిఒక్కరూ షాపింగ్ చేసేందుకు వస్తుంటారు. ఈ సండే మార్కెట్ బిజిబిజిగానే ఉంటుంది.

నెల్లూరు నుంచే కాకుండా చుట్టుప్రక్కల ప్రాంత‌ల నుంచి కూడా ఎంతోమంది జ‌నాలు, కొనుగోలు దారులు ఇక్కడి సండే మార్కెట్‌లో షాపింగ్ చేసేందుకు వ‌స్తుంటారు. ఇక పండ‌గ సీజ‌న్‌లో అయితే చెప్పన‌క్కర్లేదు. పండ‌గంతా ఇక్కడే ఉన్నట్లుగా క‌నిపిస్తుంది. ఇసుక వేస్తే రాల‌నంత జ‌నంతో సండే మార్కెట్ కిక్కిరిసిపోతుంది.

నెల్లూరులోని గాంధీబొమ్మ సెంట‌ర్ ద‌గ్గర‌లోనే ఈ సండే మార్కెట్ ఉంది. ఈ సండే మార్కెట్ ద‌గ్గర‌లోనే సాయిబాబా మందిరం కూడా ఉంది. ఇది నెల్లూరులో ఎంతో ప్రాముఖ్యత క‌లిగిన బాబా ఆల‌యం. ఇక సండే మార్కెట్ విష‌యానికి వ‌స్తే ఇక్కడ దాదాపు అన్నిర‌కాల షాపింగ్ వస్తువులు దొరుకుతాయి. పిల్లలు మొద‌లు పెద్దవారి వ‌ర‌కు అన్నిర‌కాల వ‌స్తువులు దొరికే ఏకైక షాపింగ్ సెంట‌ర్ కూడా ఇదే. క్లాత్స్, ప్లాస్టిక్, చెప్పల్స్, షూస్, బ్యాగ్స్, లేడీస్ క్లాత్ సెంట‌ర్స్, కిడ్స్ వేర్ షాప్స్, టాయ్స్ షాప్స్, బుక్ స్టాల్ .. ఇలా అన్ని ర‌కాల దుకాణాలు సండే మార్కెట్‌లో దొరుకుతాయి.

ఇదీ చదవండి : మేముసైతం అంటున్న కలెక్టర్ల సతీమణులు..! ఏం చేశారో చూస్తే షాక్ అవుతారు

సండే మార్కెట్ ఎప్పుడు ప్రారంభ‌మ‌యిందో తెలుసా ?

1984 సంవ‌త్సరంలో ఇక్కడ ఈ మార్కెట్ ప్రజ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. తొలుత కొన్ని దుకాణాల‌తో మొద‌లైన ఈ మార్కెట్.. ఇప్పుడు న‌గ‌రంలోనే ఫేమ‌స్ అయింది. అప్పట్లో రాత్రివేళ‌ల్లో క‌రెంట్ లేని స‌మ‌యాల్లో పెట్రో మాక్స్ లైట్ల మ‌ధ్య దుకాణాలు న‌డిపేవారు. ఎక్కువ‌గా త‌మిళియ‌న్లు ఇక్కడ దుకాణాలు నిర్వహించేవారు.

ఇదీ చదవండి: నగర వాసులను భయపెడుతున్న కొత్త గ్యాంగ్.. హైపర్‌ పేరుతో సెటిల్‌మెంట్‌లు, దందాలు..! ఏం జరుగుతోంది?

ఎక్కడికైనా షాపింగ్‌కు వెళ్తే మొదట బేరం ఆడనిదే అక్కడ వస్తువులను కొనరు కొందరు. అలా ఎక్కువ‌గా బేరాలు ఆడుతుండ‌డంతో..లాభం లేదనుకుని ఫిక్సడ్ రేట్లను నిర్ణయించి అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ సండే మార్కెట్‌కు ఓ క‌మిటీ కూడా ఉంది. వ్యాపారస్తులకు ఏవైనా స‌మ‌స్యలు ఉంటే ఈ క‌మిటీ ద్వారా ప‌రిష్కరించుకుంటారని మాజీ కార్యదర్శి శరవణన్‌ తెలిపారు. అంతేకాదు.. ప్రకృతి విప‌త్తులు వ‌చ్చిన‌ప్పుడు త‌మ‌వంతు సాయం కూడా ఇక్కడి మార్కెట్ వ్యాపారులు అందించ‌డం విశేషం.

google maps

అడ్రస్‌ : గాంధీబొమ్మ సెంటర్‌, నెల్లూరు, శ్రీ పొట్టిశ్రీరాములు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌- 524001.

ఎలా వెళ్లాలి?

నెల్లూరు బస్టాండ్‌ నుంచి వీఆర్‌సీ సెంటర్‌ ఏరియాకు ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఆ ప్రాంతంలోని గాంధీబొమ్మ సెంటర్‌లోనే ఈ సండే మార్కెట్‌ ఉంటుంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Local News, Nellore