హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nellore: 80కేజీల బంగారంతో వాసవీ కన్యకా పరమేశ్వరి అలంకారం..! పోటెత్తిన భక్తజనం..!

Nellore: 80కేజీల బంగారంతో వాసవీ కన్యకా పరమేశ్వరి అలంకారం..! పోటెత్తిన భక్తజనం..!

నెల్లూరులో

నెల్లూరులో ఘనంగా దసరా నవరాత్రి ఉత్సవాలు

దేవీ శరన్నవరాత్రి (Dusserha Serannavarathri Utsavalu-2022) శోభతో సింహ‌పురిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నెల్లూరు న‌గ‌రం (Nellore City) లోని ప్రముఖ ఆలయాల్లో అమ్మవారు ప్రతిరోజూ ఒక్కో అలంకరణలో దర్శనమిస్తున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Nellore, India

  Polaa Sudha, News18, Nellore

  దేవీ శరన్నవరాత్రి (Dusserha Serannavarathri Utsavalu-2022) శోభతో సింహ‌పురిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నెల్లూరు న‌గ‌రం (Nellore City) లోని ప్రముఖ ఆలయాల్లో అమ్మవారు ప్రతిరోజూ ఒక్కో అలంకరణలో దర్శనమిస్తున్నారు. స్టోన్‌ హౌస్‌పేటలోని వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు ధ‌న‌ల‌క్ష్మీ అలంకరణలో అభయమిచ్చారు. న‌వ‌రాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ధ‌న‌ల‌క్ష్మిగా కొలువుదీర్చారు. ముఖ్యంగా బంగారు ఆభరణాలతో అమ్మవారి ప్రతిమ ఆకారాన్ని చిత్రించారు. ఇందుకోసం బంగారు హారాలు, గొలుసులు, గాజులు, చెవి పోగుల‌ను ఉపయోగించారు. 80 కేజీల బంగారు ఆభ‌ర‌ణాల‌తో అమ్మవారి రూపాన్ని చిత్రించ‌డం విశేషం. తొలిసారిగా ధ‌న‌ల‌క్ష్మీ అలంకారంలో స్వర్ణ చిత్రాన్ని రూపొందించారు. బంగారు ఆభ‌ర‌ణాల‌తో స్వర్ణశోభితంగా అమ్మవారు మెరిసిపోయారు. అమ్మవారి అలంక‌ర‌ణ కోసం భ‌క్తులు స‌మ‌ర్పించిన బంగారు ఆభ‌ర‌ణాల‌తో దీన్ని రూపొందించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

  అమ్మవారి ముఖ‌చిత్రం, కిరీటం, హ‌స్తాలు, అమ్మవారి ఆయుధాలు, అభ‌య‌హ‌స్తం ఇలా అన్నీ బంగారు ఆభ‌ర‌ణాల‌తో అందంగా తీర్చిదిద్దారు. ధ‌గ‌ధ‌గా మెరిసిపోతున్న అమ్మవారి చిత్రం చూప‌రుల‌ను క‌ట్టి ప‌డేస్తోంది. క‌ళ్ళు తిప్పుకోనీయ‌లేనంగా ఈ సుంద‌ర దృశ్యం శ్రీ వాస‌వీ క‌న్యకా ప‌ర‌మేశ్వరీ దేవ‌స్థానంలో ఆవిష్కృత‌మైంది. గ‌తంలో ఎన్నడూ ఈ విధ‌మైన అలంకారాన్ని ఆల‌యంలో ప్రద‌ర్శించ‌లేదు. తొలిసారిగా ఇలా అమ్మవారి చిత్రాన్ని అలంక‌రించ‌డంతో విశేష ప్రాధాన్యత సంత‌రించుకుంది. అమ్మవారి దివ్య మంగ‌ళ స్వరూపాన్ని చూసేందుకు భ‌క్తులు విప‌రీతంగా పోటెత్తారు. ఉద‌యం నుంచే ఆల‌యానికి భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చారు. ధ‌న‌ల‌క్ష్మీగా అభ‌య‌ప్రదానం చేసిన అమ్మవారిని క‌న్నులారా వీక్షించారు భ‌క్తులు.

  ఇది చదవండి: చదివింది ఏడో తరగతే కానీ.. వుడ్‌పై అదిరిపోయే డిజైన్స్‌ చెక్కుతాడు..! అది నిమిషాల్లోనే..!

  అంత‌కుముందు అమ్మవారికి తొలుత అభిషేకాలు పూజ‌లు చేశారు. కుంకుమ అర్చన, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం జ‌రిపించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీవాస‌వీ క‌న్యకా ప‌ర‌మేశ్వరీ దేవ‌స్థానం ఆల‌య క‌మిటీ గౌర‌వాధ్య‌క్షులు ముక్కాల ద్వార‌కానాధ్ దంప‌తులు అమ్మవారిని ద‌ర్శించుకున్నారు. ఆల‌య క‌మిటీ చైర్మన్ సుంకు మ‌నోహ‌ర్, ఇత‌ర స‌భ్యులు శ‌ర‌న్నవ‌రాత్రి ఉత్సవాల‌ను ఎప్పటిక‌ప్పుడు ప‌ర్యవేక్షిస్తున్నారు. ఉత్సవాల నేపథ్యంలో భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యాలు క‌ల‌గ‌కుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

  ఇది చదవండి: ఇంద్రకీలాద్రికి వెళ్లే భక్తులకు అక్కడ మరో ముఖ్యమైన మునేశ్వరుడు ఉన్నాడని తెలుసా..!

  ఈ నవరాత్రుల్లో తొలి రోజుల్లో అమ్మవారిని వెండి ఆభరణాలతో, నోట్లతో అలంకరించారు. ఇలా ప్రతిరోజు ఒక్కో ప్రత్యేక అలంకరణతో అమ్మవారు భక్తులను దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలో ధనలక్ష్మీ అలంకారం రోజు నిండు బంగారంతో దగదగా మెరిసిపోతూ దర్శనమిచ్చారు. ధ‌న‌ల‌క్ష్మీ అలంకారం కావ‌డంతో ప్రత్యేక ఏర్పాట్లు, చ‌ర్యలు తీసుకున్నారు. మ‌రోవైపు పోలీసుల గ‌ట్టి బందోబ‌స్తు నిర్వహించారు. ఆల‌య ప‌రిస‌రాల‌న్నీ విద్యుద్దీపాలతో వెలుగులీనుతున్నాయి. అక్కడి ప్రాంత‌మంతా ఆధ్యాత్మిక శోభ‌తో అల‌రారుతోంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Dussehra 2022, Local News, Nellore

  ఉత్తమ కథలు