హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nellore: వాటిని కట్టింది ఎందుకు.. అక్కడ జరుగుతున్నదేంటీ..? అధికారులు నిద్రపోతున్నారా..?

Nellore: వాటిని కట్టింది ఎందుకు.. అక్కడ జరుగుతున్నదేంటీ..? అధికారులు నిద్రపోతున్నారా..?

నెల్లూరు

నెల్లూరు జిల్లాలో నిరుపయోగంగా మారిన తుఫాన్ షెల్టర్స్

Nellore: తుఫాను కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేస్తారు ? వాటి వ‌ల్ల ఉప‌యోగం ఏమిటి? ఎవ‌రి కోసం వాటిని నిర్మించారు? వీట‌న్నింటికీ స‌మాధానం అంద‌రికీ తెలిసే ఉంటుంది. విప‌త్తులు వ‌చ్చిన‌ప్పుడు, ప‌కృతి క‌న్నెర్ర చేసిన‌ప్పుడు.. తీర ప్రాంతాల వాసులు త‌ల‌దాచుకోవ‌డానికి ప్రభుత్వం ల‌క్షల రూపాయ‌లు వెచ్చించి వీటిని నిర్మించింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nellore, India

  Polaa Sudha, News18, Nellore

  తుఫాను కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేస్తారు ? వాటి వ‌ల్ల ఉప‌యోగం ఏమిటి? ఎవ‌రి కోసం వాటిని నిర్మించారు? వీట‌న్నింటికీ స‌మాధానం అంద‌రికీ తెలిసే ఉంటుంది. విప‌త్తులు వ‌చ్చిన‌ప్పుడు, ప‌కృతి క‌న్నెర్ర చేసిన‌ప్పుడు.. తీర ప్రాంతాల వాసులు త‌ల‌దాచుకోవ‌డానికి ప్రభుత్వం ల‌క్షల రూపాయ‌లు వెచ్చించి వీటిని నిర్మించింది. ఇవి ఆప‌త్కాలంలో ఉప‌యోగ‌ప‌డినా.. స‌రైన నిర్వహ‌ణ లేక‌పోవ‌డంతో శిధిలావ‌స్థకు చేరుకున్నాయి. కోస్తా తీర ప్రాంత‌మైన నెల్లూరు జిల్లా (Nellore District) లో తుఫాను కేంద్రాల దుస్థితి దారుణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని తొమ్మిది తీర జిల్లాల్లో నెల్లూరు జిల్లా ఒకటి. దక్షిణ తీరప్రాంతపు జిల్లాగా నెల్లూరు ఉంది. నెల్లూరు జిల్లా తీరం వెంట బకింగ్ హాం కాలువ ఉంది. తీర‌ప్రాంతం వెంట మండ‌లాలు, ప‌దుల సంఖ్యలో గ్రామాలు, వంద‌ల సంఖ్యలో కుటుంబాలు, వేల‌సంఖ్యలో ప్రజ‌లు నివసిస్తున్నారు. ఎక్కువ మంది పూరిళ్లు, గుడిసెలు, చిన్నపాటి ఇళ్ళలో నివసిస్తుంటారు.

  ప్రకృతి విప‌త్తులు సంభ‌వించిన‌ప్పుడు, భారీ వ‌ర్షాలు, తుఫాను వంటి ఉప‌ద్రవాలు వ‌చ్చిన‌ప్పుడు, తీర ప్రాంతవాసుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిపోవాల్సి ఉంటుంది. ఇందుకోసం తీర ప్రాంత ప్రజలకు రక్షణ కోసం ప్రభుత్వం తుఫాను షెల్టర్లను నిర్మించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని తీర ప్రాంత మండలాల్లోనూ ఇలా షెల్టర్లు నిర్మించారు. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలోనూ వీటిని ఏర్పాటు చేశారు. ఆప‌ద స‌మ‌యంలో, విప‌త్కర ప‌రిస్థితుల్లో బాధితులంతా తుఫాన్ షెల్టర్లలో త‌ల‌దాచుకుని ప్రాణాలు కాపాడుకున్నారు.

  ఇది చదవండి: ప్రభుత్వ ఉద్యోగమున్నా డోంట్ కేర్.. సొంత సెలూన్ ఉంటేనే పిల్లనిస్తారట..!

  తుఫాన్ షెల్టర్లన్నీ రెవెన్యూ, పంచాయతీరాజ్‌, ఇంజనీరింగ్‌ శాఖల ఆధ్వర్యంలో ఉన్నాయి. తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు అవి ఎలా ఉన్నాయని చూడటం తప్ప తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదు. తుఫాన్‌ల సమయంలో కురిసే వర్షాల ప్రభావంతో తీర‌ గ్రామాల ప్రజలకు ప్రతి ఏడాది ఇబ్బందులు ప‌డుతున్నారు. ఆ సమయంలో త‌ప్ప, మిగిలిన సమయాల్లో వీటి ఆల‌నాపాల‌నా గురించి పట్టించుకునే వారే లేకుండా పోయారు.

  ఇది చదవండి: ఆ కొండపైన రాయి కాదు కదా పూచికపుల్ల పట్టుకోవాలన్నా వణికిపోతారు..! కారణం ఇదే..!

  దీంతో తుఫాన్‌ షెల్టర్‌లు నిరుపయోగంగా ఉండి, అసాంఘిక కార్యక్రమాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. జిల్లాలోని తోటపల్లి గుడూరు మండలంలోని కోడూరు, ముత్యాలతోపు పాలెం, పట్టపు పాలెం, వెంకన్నపాళెం గ్రామాల్లో తుఫాను షెల్ట‌ర్ల దుస్థితి దారుణంగా ఉంది. వీటిని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో శిధిలావ‌స్థకు చేరాయి. తలుపులు, కిటికిలు ప‌గిలిపోయాయి. స్లాబ్ పెచ్చులు ఊడిపోయాయి. గచ్చు దెబ్బతినింది. ఇత‌ర‌త్రా స‌మ‌స్యలు కూడా చాలానే ఉన్నాయి. ఈ షెల్టర్లు ఏవీ సక్రమంగా లేకపోగా..నిరుప‌యోగంగా ప‌డి ఉన్నాయి.

  ఇది చదవండి: గోదావరి అందాలు చూసేందుకు ఇదే సరైన సమయం.. ఒక్కసారి వెళ్తే మైమరచిపోతారు..!

  వ‌ర్షాలు ప్రారంభ‌మైతే తీర‌ప్రాంత వాసుల‌కు మ‌ళ్ళీ క‌ష్టాలు త‌ప్పవు. అప్పటివ‌ర‌కు తుఫాను షెల్టర్ల గురించి ఆలోచించే తీరిక అధికారుల‌కూ లేదు. అయితే ఇవి నిరుప‌యోగంగా ఉండ‌డంతో, కొంత‌మంది పోకిరిరాయుళ్ళు వీటిని అడ్డాగా చేసుకుని అసాంఘిక కార్యక‌లాపాల‌కు పాల్పడుతున్నారు.

  మందుబాబులు తాగేసి ర‌చ్చ చేస్తున్నారు. పేకాట రాయుళ్లు య‌ధేశ్చగా పేకాట ఆడుతూ జ‌ల్సా చేస్తున్నారు. ల‌క్షలు ఖ‌ర్చు పెట్టి క‌ట్టించి తుఫాను షెల్టర్లను శుభ్రం చేసి.. ఉప‌యోగంలోకి తీసుకురావాల‌ని తీర‌ప్రాంత వాసులు కోరుతున్నారు. ఇక‌నైనా అధికార యంత్రాంగం తుఫాను షెల్టర్లపై దృష్టి సారించాల‌ని విజ్ఞప్తి చేస్తున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Nellore

  ఉత్తమ కథలు