హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Train Accident: ఏపీలో విషాదం.. రైలు ఢీకొని ముగ్గురు మృతి..!

Train Accident: ఏపీలో విషాదం.. రైలు ఢీకొని ముగ్గురు మృతి..!

ఏపీలో రైలు ప్రమాదం
(ప్రతీకాత్మక చిత్రం)

ఏపీలో రైలు ప్రమాదం (ప్రతీకాత్మక చిత్రం)

పట్టాలు దాటుతుండగా రైలు వచ్చి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఏపీలో విషాదం చోటు చేసుకుంది. రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందిన ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే... నెల్లూరులోని ఆత్మకూర్ బస్టాండ్ రైల్వే బ్రిడ్జిపై రైలు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. అయితే పట్టాలు దాటుతుండగా ఎదురుగా వస్తున్న రైలు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై వెంటనే

సమాచారం అందుకొన్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

అయితే ప్రమాదం ఎలా జరిగింది?. మృతులు ఎవరన్న దానిపై విచారణ చేస్తున్నారు. పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగిందా ? లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఎవరు అనే విషయాన్ని గుర్తించి వారి బంధువులకు సమాచారం ఇచ్చేందుకు రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈఘటనతో స్థానికంగా కలకలం చోటు చేసుకుంది.

First published:

Tags: Nellore Dist, Train accident

ఉత్తమ కథలు