MLA Missing: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నిన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు (MLA Quota MLC Elections Result) అధికార వైసీపీ (YCP)కి ఊహించని షాకే ఇచ్చాయి. ఎందుకంటే వాస్తవంగా చూస్తే టీడీపీ ఎమ్మెల్యేల బలం 19 మాత్రమే.. కానీ వైసీపీ వాస్తవ బలం చూసుకుంటే.. గత ఎన్నికల్లో ఆ పార్టీ నెగ్గినవి 151 సీట్లు.. దానికి తోడు జనసేన (Janasena) ఎమ్మెల్యే జగన్ కు జై కొట్టారు.. అలాగే టీడీపీ చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సైతం వైసీపీ వైపు మొగ్గు చూపారు. దీంతో అధికార పార్టీ బలం 156 పెరిగింది. ఆ పార్టీ వాస్తవ బలం చూసుకుంటే.. ఇద్దరు రెబల్ గా మారారు. నెల్లూరుకు చెందిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy), ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) వారిద్దరు కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఓటేస్తారు అనుకున్నా.. ఏడుగురు సభ్యులను గెలిపించుకునే బలం వైసీపీకి ఉంది.. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ నెగ్గాలి అంటే 22 మంది ఓటు వేయాల్సిన అసవరం ఉంది. ఆ లెక్కన చూసుకుంటే.. టీడీపీ కి 21, వైసీపీలో ఉన్న ఏడుగురుకి 22 చొప్పున ఓట్లు రావాలి.. కానీ అనూహ్యంగా వైసీపీ ఎమ్మెల్సీలు అందరికంటే అత్యధికంగా పంచమర్తి అనురాధ (Panchamarthi Anuradha) 23 ఓట్లు సాధించి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దీంతో ఆమెకు ఓటు వేసిన ఆ ఇద్దరు ఎవరు అన్నదానిపై చర్చ మొదలైంది.
అయితే వైసీపీ ఏర్పాటు చేసుకున్న కోడింగ్ ద్వారా టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యే ఎవరు అన్నది గుర్తించామని పార్టీ పెద్దలు చెప్పారు. వారి పేర్లు బహిరంగంగా చెప్పకపోయినా.. వైసీపీ వర్గాలు.. సోషల్ మీడియా ద్వారా వారు పేర్లు బయటకు వచ్చాయి. అయితే వారిద్దరూ ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు కూడా రాకపోవడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
అయితే తాను క్రాస్ ఓటింగ్ వేయలేదని.. దళిత ఎమ్మెల్యే కావడంతోనే తమపై నిందలు వేస్తున్నారని శ్రీదేవి వివరణ ఇచ్చినా.. ఆమె క్రాస్ ఓటు వేశారన్నది వైసీపీ వర్గాల అంచనా.. దానికి తోడు ఆమె ఇవాళ అసెంబ్లీ సమావేశాలు డుమ్మా కొట్టడంతో.. అనుమానాలు రెట్టింపు అయ్యాయి. మరో ఎమ్మెల్యే వ్యవహారం కూడా దుమారం రేపుతోంది.
ఇదీ చదవండి : ఏపీ అసెంబ్లీలో జీవో నెంబర్ 1 రచ్చ.. కొత్త రూల్ క్రాస్ చేసిన 10 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
ఉదయగిరి ఎం.ఎల్.ఏ. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కార్యాలయంలో వైసీపీ ఫ్లెక్సీలు కనిపించకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. ఆయన అనుచరులు కూడా అందుబాటులో లేరు. ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే ఆయన బెంగళూరు వెళ్ళి పోయారని టాక్. దీంతో ఆయన్ను సంప్రదించేందుకు కొందరు నేతలు, మీడియా ప్రతినిధుల ప్రయత్నించగా.. ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ లో ఉంది. ఇటీవల ఆయన స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. కొద్దిరోజుల క్రితం సీఎం జగన్ ను కలసినప్పుడు ఈసారి టిక్కెట్ ఇవ్వలేనని, ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ చెప్పడంతోనే ఆయన క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని చెబుతున్నారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయనపై నమ్మకంతోనే జగన్ ఈ మాట చెప్పారంటున్నారు. దీంతో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఓటింగ్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్న అనుమానాలు బలపడుతున్నాయి.
ఇవాళ శాసనసభలో కనిపించని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపైన చర్చ సాగుతోంది. క్రాస్ ఓటింగ్ వేసిన ఎమ్మెల్యేల గురించి లాబీల్లో తీవ్ర చర్చ సాగుతోంది. మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఇవాళ ఇప్పటి వరకు హాజరు కాని ఈ ఇద్దరు సభ్యులు ఎక్కడికెళ్ళారనేది వైసీపీ వర్గాలను కుదిపేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Assembly, Ap cm jagan, Ap mlc elections, AP News