Home /News /andhra-pradesh /

NELLORE THE 3 CRORES COST OF LIQUOR BOTTLES ARE DAMAGED BY THE POLICE ABH

NELLORE: రూ.3.14 కోట్ల విలువగల మద్యం బాటిళ్లు ధ్వంసం...

the liquor cost of 3 crore was smashed by police

the liquor cost of 3 crore was smashed by police

  NELLORE: రూ.3.14 కోట్ల విలువగల మద్యం బాటిళ్లు ధ్వంసం...రోజురోజుకీ మద్యం అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. ఆ అక్రమ రవాణా ను ఆపడానికి పోలీసులు సాయశక్తులా కష్టపడుతున్నారు. పోలీసులు గత మూడు సంవత్సరాలలో రూ.3.14 కోట్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం  చేసుకుని వందలాది మందిని కటకటాల వెనక్కి పంపారు. పోలీసుల వరుస దాడులతో మద్యం రవాణా తగ్గుముఖం పట్టింది. పోలీసుల వరుస దాడులతో మద్యం రవాణా చేయాలనుకున్న వాళ్లు కూడా భయపడి పరుగులు పెడుతున్నారు. ఈ మార్పు వైయస్సార్  ప్రభుత్వం వచ్చాకే మారిందని కూడా చెప్పవచ్చు. ఈ అక్రమాలను అరికట్టేందుకు వైయస్సార్ ప్రభుత్వం ఒక స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ను ఏర్పాటు చేసింది. పోలీసులు తమదైన రీతిలో అక్రమాలను అడ్డుకుంటున్నారు. పోలీసులు కాపుకాసి నిందితులను పట్టుకున్నారు.


  పోలీసులు పక్కా ప్రణాళికతో నే అక్రమాలను ఛేదిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన, మద్యం సేవించి బండి నడిపిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని తెలిపారు. పోలీసులు ఈ మూడేళ్ల లో కాలంలో జిల్లా వ్యాప్తంగా సెబ్, పోలీసులు 2,744 కేసులు నమోదు చేసి (ఎన్డీపీఎల్, డీపీఎల్‌) రూ 3,14,37,980 విలువ చేసే 74,547 మద్యం బాటిళ్ల (15,719 లీటర్ల)ను స్వాదీనం చేసుకున్నారు. ఈ అక్రమాలను ఎస్పీ సీహెచ్విజయారావు పర్యవేక్షణలో సెబ్జాయింట్డైరెక్టర్కె.శ్రీలక్ష్మి పూర్తిస్థాయిలో అక్రమ మద్యం కట్టడికి చర్యలు తీసుకున్నారు.
  పాత నేరస్తులను బైండోవర్‌ చేయడంతో పాటు పదేపదే నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్‌లు ప్రయోగిస్తున్నారు. వరుస దాడులు, సెబ్, పోలీసు అధికారుల చర్యలతో అక్రమార్కుల వెన్నులో వణుకు మొదలవడంతోపాటు అక్రమ రవాణా, అనధికార విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. పోలీసులు హయాంలో పట్టుబడ్డ మద్యాన్ని బహిరంగ ప్రదేశాల్లో ధ్వంసం చేస్తారు. ఎస్పీ సీహెచ్‌ విజయారావు పర్యవేక్షణలో సెబ్‌ అధికారులు మంగళవారం కొత్తూరు  కార్యాలయ ప్రాంగణంలో మద్యం బాటిళ్లను రోడ్డురోలర్లతో తొక్కించారు.  దీంతో దీంతో అక్కడున్న మద్యం అంతా నేలపాలు అయ్యింది. ఆ ప్రాంతమంతా మద్య ప్రవాహంతో నిండిపోయింది. ఈ విషయం తెలుసుకున్న మందుబాబులు, ప్రజలు అక్కడికి భారీ ఎత్తున తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో మద్యం అక్రమ రవాణా ను అంతం చేసే వరకు ఊరుకోం అన్న ఎస్పీ సీహెచ్‌ విజయారావు.
  Published by:Abhiram Rathod
  First published:

  Tags: AP Police, Liquor ban, Nellore Dist

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు