హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nellore: పొన్నగంటి ఆకు.. పోషకాల గని..! ఈ ఆకుతో చేసే వడలు తింటే ఎన్నో హెల్త్‌ బెనిఫిట్స్‌..!

Nellore: పొన్నగంటి ఆకు.. పోషకాల గని..! ఈ ఆకుతో చేసే వడలు తింటే ఎన్నో హెల్త్‌ బెనిఫిట్స్‌..!

నెల్లూరు

నెల్లూరు వాసులను ఫిదా చేస్తున్న పొన్నకంటి కూర వడల

పొన్నగంటి కూర, ఇది మంచి పోషక విలువలు గలిగిన ఆకుకూర. ఈ ఆకును పప్పులో వేయడం కన్నా.. వట్టిదే వేయించి తింటే ఇంకాస్త రుచిగా కూడా ఉంటుంది. అలాంటి ఈ ఆకుతో వ‌డ‌లు కూడా త‌యారు చేసుకోవ‌చ్చని మీకు తెలుసా..?

 • News18 Telugu
 • Last Updated :
 • Nellore, India

  Polaa Sudha, News18, Nellore

  పొన్నగంటి కూర, ఇది మంచి పోషక విలువలు గలిగిన ఆకుకూర. ఈ ఆకును పప్పులో వేయడం కన్నా.. వట్టిదే వేయించి తింటే ఇంకాస్త రుచిగా కూడా ఉంటుంది. అలాంటి ఈ ఆకుతో వ‌డ‌లు కూడా త‌యారు చేసుకోవ‌చ్చని మీకు తెలుసా..? ఆ వ‌డ‌లు ఎంతో టేస్టీగా ఉంటాయ‌ని తెలుసా? నెల్లూరు (Nellore) న‌గ‌రంలో పొన్నగంటి ఆకు వ‌డ‌లు ఎంతో ఫేమ‌స్. ఇక్కడ రుచి చూస్తే .. ఆహా ఏమి రుచి అన‌కుండా ఉండ‌లేరు. నెల్లూరు క‌న‌క‌మ‌హ‌ల్ సెంట‌రులో ఓ టిఫిన్ బండి ఎప్పుడూ కిట‌కిట‌లాడుతుంటుంది. ఎందుకంటారా ఇక్కడ పొన్నగంటి ఆకు వ‌డ‌లు చాలా ఫేమ‌స్. కేవ‌లం ఈ వ‌డ‌లు తినేందుకే ఇక్కడికి వ‌స్తుంటారు. న‌గ‌రంలోని వారే కాదు.. చుట్టుప‌క్కల ప్రాంతాల నుంచి నెల్లూరుకి ప‌ని మీద వచ్చే వాళ్ళు కూడా.. ఇక్కడి పొన్నగంటి ఆకు వ‌డ‌లను టేస్ట్ చేసి వెళుతుంటారు.

  న‌గ‌రానికి చెందిన రామ్మూర్తి, దేవ‌మ్మ గ‌త 30 ఏళ్ళుగా ఇక్కడ బండి మీద టిఫిన్ సెంట‌ర్ న‌డుపుతున్నారు. అయితే త‌మకు ప్రత్యేక గుర్తింపు ఉండాల‌నే కార‌ణంతో స్పెష‌ల్‌గా పొన్నగంటి ఆకువ‌డ‌ల త‌యారీ మొద‌లుపెట్టారు. ఈ వ‌డ‌ల రుచి అంద‌రికీ న‌చ్చడంతో .. ఎంతోమంది ఈ టిఫిన్ కోసం క్యూ క‌డుతున్నారు. ఈ వ‌డ‌లు తినేందుకు పెద్దపెద్ద కార్లలో వ‌స్తుంటార‌ని, పార్శిల్స్ తీసుకెళుతుంటార‌ని నిర్వాహకులు చెబుతున్నాడు.

  ఇది చదవండి: విశాఖలో రాజమండ్రివారి రోజ్ మిల్క్.. తాగితే అమృతమే..! అంత టేస్ట్ ఎలా వచ్చిందంటే..!

  ఈ వ‌డ‌ల త‌యారీ కోసం పొన్నగంటి ఆకు, పాల‌కూర, తోట‌కూర‌, క‌రివేపాకు, కొత్తిమీర‌, పొదీనా, ఆయిల్, శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, లవంగాలు, చెక్క, పసుపు, ఉప్పు వాడుతామ‌ని వివ‌రించాడు.

  ఇది చదవండి: దోశ ప్రియులకు అదిరిపోయే న్యూస్‌..! అక్కడ దొరికే వెరైటీ దోశలు చూస్తే మతిపోవాల్సిందే..!

  ఆరోగ్య ప్రయోజనాలెన్నో..!

  ఇక పొన్నగంటి ఆకులో ఎన్నో పోష‌క విలువ‌లు ఉన్నాయి. బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆకును తరచూ తింటే మంచిది. ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతుంది. ఈ ఆకు వ‌ల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఆకులో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ, ఆస్టియోపోరోసిస్ వంటి వాటిని దూరం చేయడానికీ ఉపయోగపడుతుంది. ఈ ఆకుల్లోని కొన్ని పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కారకాలతో కూడా పోరాడతాయి.

  ఇది చదవండి: అక్కడ పండే మొక్కజొన్న టేస్ట్ మరెక్కడా రాదు.. అంత ఫేమస్ ఎందుకంటే..!

  అందుకే పొన్నగంటి ఆకు వ‌డ‌ల‌ను నెల్లూరు వాసులు ఇష్టంగా తింటారు. సాయంత్రం వేళ‌.. వేడి వేడి ప‌కోడీ తింటే ఎలా ఉంటుంది? కారం కారంగా మిర‌ప‌కాయ బ‌జ్జీలు తింటే ఎలా ఉంటుంది? అని అనుకునే టిఫిన్ ప్రియులైతే.. వీటి కోసం ఎగ‌బ‌డుతుంటారు. ఈ సారి మీరు నెల్లూరు వెళ్లినప్పుడు ఈ పొన్నగంటి వడలను తినడం మాత్రం మర్చిపోకండి..!

  అడ్రస్‌: క‌న‌క‌మ‌హ‌ల్ సెంట‌ర్, నెల్లూరు , శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌- 524002

  ఫోన్‌ నెంబర్‌ : 9392794232

  Nellore Kanaka Mahal Centre Map

  ఎలా వెళ్లాలి: నెల్లూరు బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ నుంచి క‌న‌క‌మ‌హ‌ల్ సెంట‌ర్ వరకు ఆటోలు అందుబాటులో ఉంటాయి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Food, Local News, Nellore

  ఉత్తమ కథలు