హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nellore: నెల్లూరు జిల్లాలో కొత్త టూరిస్ట్‌ స్పాట్‌..! క్యూ కడుతున్న పర్యాటకులు..!

Nellore: నెల్లూరు జిల్లాలో కొత్త టూరిస్ట్‌ స్పాట్‌..! క్యూ కడుతున్న పర్యాటకులు..!

X
నెల్లూరు

నెల్లూరు టూరిస్ట్ స్పాట్‌గా పెన్నా బ్యారేజ్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నెల్లూరు జిల్లా (Nellore District) లో సరికొత్త టూరిస్ట్‌ ప్లేస్‌ ప్రజలను ఆకట్టుకుంటుంది. దాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఫ్యామిలీతో పాటు సాయంత్రం సమయాల్లోనూ, సెలవు రోజుల్లోనూ వచ్చి ఎంజాయ్‌ చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nellore, India

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నెల్లూరు జిల్లా (Nellore District) లో సరికొత్త టూరిస్ట్‌ ప్లేస్‌ ప్రజలను ఆకట్టుకుంటుంది. దాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఫ్యామిలీతో పాటు సాయంత్రం సమయాల్లోనూ, సెలవు రోజుల్లోనూ వచ్చి ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇంతకీ ఏమిటా టూరిస్ట్‌ ప్లేస్‌ అనుకుంటున్నారా? అదేనండి పెన్నా బ్యారేజీ..! పెన్నా బ్యారేజీ నిర్మాణం.. నెల్లూరు జిల్లాకు త‌ల‌మానికం. ఇటీవ‌లే ఈ బ్యారేజీని ముఖ్యమంత్రి జ‌గ‌న్ జాతికి అంకితం చేశారు. దీంతో ద‌శాబ్దాల సింహ‌పురి వాసుల స్వప్నం సాకార‌మైంది. నెల్లూరు బ్యారేజ్‌ కమ్‌ రోడ్‌ బ్రిడ్జి ప్రారంభం కావ‌డంతో జిల్లావాసులు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక పెన్నా బ్యారేజీ కమ్‌ రోడ్‌ బ్రిడ్జిని చూసేందుకు సంద‌ర్శకుల తాకిడి ఎక్కువైంది. నిత్యం ఎంతోమంది ప్రజ‌లు, సంద‌ర్శకులు ఇక్కడికి వ‌స్తున్నారు.

ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల‌తో పెన్నా బ్యారేజీకి వ‌ర‌ద ప్రవాహం ఎక్కువైంది. దీంతో కొన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో పెన్నానదిలోని నీరు ప‌ర‌వ‌ళ్ళు తొక్కుతూ కనువిందు చేస్తోంది. ఈ సుంద‌ర దృశ్యాల‌ను, పెన్నా బ్యారేజీని తిల‌కించేందుకు న‌గ‌రం నుంచే కాకుండా ఇత‌ర ప్రాంతాల నుంచి కూడా సందర్శకులు వ‌స్తుండ‌డం విశేషం. బ్యారేజీ నుంచి ప్రవ‌హిస్తోన్న నీటి ప‌ర‌వ‌ళ్ళను చూసి సంద‌ర్శకులు న‌య‌నానందం పొందుతున్నారు. గ‌తంలో చూడ‌ని పెన్నా అందాల‌ను ఇప్పుడు ఆస్వాదిస్తున్నారు సింహ‌పురి వాసులు.

ఇది చదవండి: ఏయూ పరిధిలోని 18 డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు బ్రేక్‌..! కారణం ఏంటంటే..?

అసలు ఈ బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు మొదలుపెట్టారు..?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా నెల్లూరు పెన్నా బ్యారేజ్‌, సంగం బ్యారేజ్ నిర్మాణాల‌కు 2008, ఏప్రిల్‌ 24న శ్రీకారం చుట్టి పనులు ప్రారంభించారు. ఆయ‌న హఠాన్మర‌ణంతో బ్యారేజీ పనులు నిలిచిపోయాయి. ఆ త‌ర్వాత జ‌రిగిన రాష్ట్ర విభ‌జ‌న‌, నాడు వ‌చ్చిన ప్రభుత్వాలు, పాల‌కులు వీటిపై దృష్టి పెట్టక‌పోవ‌డంతో న‌త్తన‌డ‌క‌న పనులు సాగాయి. 2019లో జ‌గ‌న్ సీఎం అయిన త‌ర్వాత బ్యారేజీ నిర్మాణ ప‌నుల్లో పురోగ‌తి వ‌చ్చింది. నాడు తండ్రి త‌ల‌పెట్టిన య‌జ్ఞాన్ని.. త‌న‌యుడు జ‌గ‌న్ పూర్తి చేసి 2022 సెప్టెంబ‌ర్ 6న‌ సింహ‌పురి వాసుల‌కు అందించారు.

ఇది చదవండి: ఈ చిన్నారి మల్టి టాలెంట్‌కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..! కాకినాడ నుంచి అంతర్జాతీయ స్థాయికి..!

బ్రిడ్జి నిర్మాణవివరాలు..!

పెన్నా బ్యారేజ్‌లో రెండు మీటర్ల మందంతో 57 పియర్లు ఏర్పాటుచేశారు. 57 పియర్ల మధ్య 10 మీటర్ల ఎత్తు, 3 మీటర్ల వెడల్పుతో 43 గేట్లు, కోతకు గురై వచ్చిన మట్టిని దిగువకు పంపడానికి పది మీటర్ల ఎత్తు, 4.3 మీటర్ల వెడల్పుతో 8 గేట్లు.. మొత్తం 51 గేట్లను ఏర్పాటుచేశారు. వరద వచ్చినప్పుడు దిగువకు విడుదల చేయడానికి, వరద తగ్గాక నీటిని నిల్వ చేయడం కోసం గేట్లను ఎత్తడానికి దించడానికి వీలుగా ఎలక్ట్రిక్‌ విధానంలో హాయిస్ట్‌ను ఏర్పాటుచేశారు.

ఇది చదవండి: అందమైన బుట్ట బొమ్మలు..! మనసును దోచే వయ్యారిబొమ్మలు..! కావాలంటే అక్కడికెళ్లాల్సిందే..!

బ్యారేజ్‌కు 22 మీటర్ల ఎత్తులో 1.2 మీటర్ల మందం, 7.5 మీటర్ల వెడల్పు రెండు వరుసల రోడ్‌ బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్యారేజ్‌లో 0.4 టీఎంసీలను నిల్వ చేయడానికి వీలుగా బ్యారేజ్‌కు కుడి, ఎడమ వైపున కరకట్టలను పటిష్ఠం చేశారు.

ఇది చదవండి: ఏపీలో మహీష్పతి సామ్రాజ్యం.. అప్పటి ఆలయం ఇంకా ఉంది.. మీరూ చూస్తారా..?

పెన్నా బ్యారేజ్ ద్వారా నెల్లూరు జిల్లా వాసుల తాగు నీటి స‌మ‌స్య ప‌రిష్కార‌మైంది. అంతేగాక సర్వేపల్లి, జాఫర్‌ సాహెబ్‌ కాలువల కింద నెల్లూరు, సర్వేపల్లి, కోవూరు, ముత్తుకూరు, తోట‌ప‌ల్లి గూడురు, వెంకటాచలం, ఇందుకూరుపేట మండ‌లాలు స‌హా 77 గ్రామాల్లో 99,525 ఎకరాల ఆయకట్టుకు సమృద్దిగా సాగునీరు స‌ర‌ఫ‌రా అవుతుంది. నెల్లూరుతో పాటు బ్యారేజ్‌ దిగువన ఉన్న గ్రామాలకు వ‌ర‌ద ముప్పు త‌ప్పుతుంది. మొత్తానికి ఎన్నేళ్ళగానో ఉన్న నెల్లూరు వాసుల క‌ల‌.. ఇన్నాళ్ళకు తీరింది. దీంతో ఆ మధురానుభూతిని పొందేందుకు ప్రత్యక్షంగా చూసేందుకు ఆ బ్యారేజీలకు క్యూ కడుతున్నారు. మీరు నెల్లూరులో ఉంటే ఓ సారి ఆ బ్రిడ్జిలు చూసేందుకు వెళ్లండి.. మీకు కాస్త సరదాగానూ, ప్రశాంతంగానూ ఉంటుంది.

అడ్రస్‌: రంగనాయకుల పేట, నెల్లూరు, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా, ఆంధ్రప్రదేశ్- 524137

Nellore Barrage Map

ఎలా వెళ్లాలి..?

నెల్లూరు నుంచి రంగనాయకుల పేటకు ఆర్టీసీ బస్సుల సౌకర్యం ఉంది.

First published:

Tags: Andhra Pradesh, Local News, Nellore

ఉత్తమ కథలు