Crime News: పోలీసులు సైతం ఆశ్చర్యపోయే ఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో చోటు చేసుకుంది. అసలు మానవ సంబంధాలు.. రక్త సంబంధాలు ఏమయ్యాయి అనే ప్రశ్న లేవనెత్తుతోంది. తల్లిదండ్రులు అంటే.. ఏ కొడుకు అయినా ప్రత్యక్ష దైవంగానే భావించాలి. జన్మనిచ్చి.. కష్టనష్టాలు ఓర్చి.. ఇంత పెద్దవాడ్ని చేసి.. ఒక జీవితం ఇచ్చినందుకు వారి రుణం ఎప్పటికీ తీర్చుకోనిదే.. కానీ అలాంటి కన్న కొడుకే.. తల్లి దండ్రుల హత్య(Parents Murder) కు సుపారీ ఇచ్చాడని తెలియడంతో అంతా షాక్ కు గురయ్యారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..? దొంగతనం కేసు (Theft Case) లో అరెస్ట్ అయిన.. ఇద్దరి దొంగలు కారణంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దొంగతనం కేసులో అరెస్టైన వారిని విచారిస్తే.. తల్లి దండ్రులను హతమార్చేందుకు వారి కుమారుడు కిరాయి ఇచ్చిన షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా (Nellore District) లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ దొంగతనం కేసు ఇంత ట్విస్ట్ ఇస్తుందని ఎవరూ ఊహించలేదు. ఆ దొంగలు పట్టుబడకపోయి ఉంటే.. కన్నకొడుకి రాక్షతత్వం ఎప్పటికీ బయటపడేది కాదేమో..
నెల్లూరు ఎస్పీ సీహెచ్ విజయారావు వెల్లడించిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెం పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడిన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. చోరీ జరిగిన ప్రదేశాల్లో లభ్యమైన ఆధారాల ఆధారంగా పాతనేరస్తులైన ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంకు చెందిన షేక్ గౌస్‌బాషా, బుచ్చిపట్టణం ఖాజానగర్‌కు చెందిన షేక్ షాహూల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తే.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి అన్నారు.
ఆ దొంగలు ఐదు చోరీలతో పాటు కావలి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కిరాయి హత్యకు రెక్కీ నిర్వహించినట్టు ఒప్పుకున్న్టటు తెలుస్తోంది. దీంతో నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి వారి నుంచి రూ 2.95 లక్షల రూపాయల విలువచేసే బంగారం, 30 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. కావలి పట్టణం తుఫాన్ నగర్‌కు చెందిన బాలకృష్ణయ్యకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఇద్దరు కుమారులకు ఆయన గతంలో సమానంగా ఆస్తి పంచాడు. కానీ తనకు సరిగా పంచలేదని లక్ష్మీనారాయణ తండ్రితో నిత్యం గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులను అడ్డుతొలగించుకుంటే వారి పేర ఉన్న ఆస్తి తనకు దక్కుతుందని లక్ష్మీనారాయణ భావించాడు. తన స్నేహితుడైన కావలికి చెందిన సుబ్బారావుకు విషయం తెలిపాడు. అతడి ద్వారా పాతనేరస్తుడు షేక్ షఫీ ఉల్లాను సంప్రదించాడు.
ఇదీ చదవండి : సండే సరదాగా చికెన్ తినాలి అనుకుంటున్నారా..? ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోండి..?
తండ్రిని హత్య చేస్తే 3 లక్షల రూపాయలు.. తల్లిదండ్రులిద్దరినీ చంపితే 5 లక్షల రూపాయలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో షఫీఉల్లా గతంలో జైల్లో ఉన్న సమయంలో పరిచయమైన గౌస్ బాషా, షేక్ షాహుల్‌తో కలిసి కిరాయి హత్యకు పథకం రచించారు. లక్ష్మీనారాయణ నిందితులకు అడ్వాన్స్ కింద 30 వేలు రూపాయల నగదు.. వారికి కత్తులను కూడా కొని ఇచ్చినట్టు విచారణలో తేలింది. చేసుకున్న ఒప్పందంలో భాగంగా.. నిందితులు మూడుసార్లు బాలకృష్ణయ్య ఇంటి దగ్గర రెక్కీ కూడా నిర్వహించినట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి : హిందూపురంలో టెన్షన్ టెన్షన్.. రేపు బంద్ కు పిలుపు.. ముందుగానే అఖిల పక్ష నేతల అరెస్టులు
అదును కోసం వేచి చూస్తున్నామని పోలీసుల విచారణలో వారు చెప్పారు. దీంతో తల్లిదండ్రులను హతమార్చాలి అనుకున్న కన్నకొడుకి రాక్షసత్వం వెలుగులోకి వచ్చింది. వారు ఇచ్చిన సమాచారంతో.. ఈ కేసుపైనా విచారణ చేస్తున్నారు. అయితే దొంగతనం చేస్తూ పట్టుబడడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Nellore