హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nellore: జ్ఞాపకాలను తరతరాలకు అందించే సజీవ సాక్ష్యం ఆ అక్షరాలు..! కాలాలు మారినా చెరగని చిహ్నం..!

Nellore: జ్ఞాపకాలను తరతరాలకు అందించే సజీవ సాక్ష్యం ఆ అక్షరాలు..! కాలాలు మారినా చెరగని చిహ్నం..!

నెల్లూరులో

నెల్లూరులో మూడు తరాలుగా శిలాఫలకాలు వేస్తున్న కుటుంబం

Nellore: శిలా ఫ‌ల‌కాలు.. ఒకతరం నుంచి మరో తరానికి అందించే సజీవ సాక్ష్యాలు. చరిత్రకు ఆలవాలం. సంస్కృతికి దర్పణం. కాలాలు మారినా, త‌రాలు మారినా.. శిలాఫ‌ల‌కంపై ముద్రించిన‌ అక్షరాలు మాత్రం గ‌తానికి చిహ్నంగానే నిలుస్తాయ‌న‌డంలో సందేహం లేదు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nellore, India

  Polaa Sudha, News18, Nellore

  శిలా ఫ‌ల‌కాలు.. ఒకతరం నుంచి మరో తరానికి అందించే సజీవ సాక్ష్యాలు. చరిత్రకు ఆలవాలం. సంస్కృతికి దర్పణం. కాలాలు మారినా, త‌రాలు మారినా.. శిలాఫ‌ల‌కంపై ముద్రించిన‌ అక్షరాలు మాత్రం గ‌తానికి చిహ్నంగానే నిలుస్తాయ‌న‌డంలో సందేహం లేదు. శిలాఫ‌ల‌కాల చ‌రిత్ర ఈనాటిది కాదు.. రాతియుగం నాడే మొద‌లైంది. ఆధునిక కాలంలోనూ కొన‌సాగుతోంది. శిలాఫ‌ల‌కాల త‌యారీనే వృత్తిగా ఎందుచుకుని ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయి. కొంద‌రు ఆ క‌ళ‌ను వ‌దిలేస్తే.. అతి కొద్దిమంది మాత్రం వంశ పారంప‌ర్యంగా కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు. అలాంటి వారిలో నెల్లూరు (Nellore) కి చెందిన వాసు స్టోన్ ఎంగ్రే వ‌ర్క్స్. మూడు త‌రాల నుంచి ఈ వృత్తిలోనే జీవిస్తున్నారు.

  శిల్పాల‌ను చెక్కే వారిని స్తప‌తి లేదా శిల్పి అంటారు. శిల్పి అంటే కేవ‌లం శిల్పాలు చెక్కే వారు మాత్రమే కాదు.. శిలాఫ‌ల‌కాల‌ను ముద్రించేవారు కూడా. శిల్పాన్ని చెక్కేందుకు ఎంత ప్రయాస ప‌డాల్సి వ‌స్తుందో... శిలా ఫ‌లకాన్ని అందంగా తీర్చి దిద్దడానికి కూడా అంతే క‌ష్టించాల్సి ఉంటుంది. శిల‌పై అక్షరాలను ముత్యాలుగా మ‌ల‌చ‌డం అంటే తేలికైన విష‌యం కాదు. దీక్షతో చేయాల్సి ఉంటుంది. అదే దీక్షతో నెల్లూరు న‌గ‌రంలోని వాసు స్టోన్ ఎంగ్రే వర్క్స్‌కి చెందిన శిల్పులు త‌యారు చేస్తున్నారు. వంశ పారంప‌ర్యంగా శిలా శాస‌న‌ములు, శిలాఫ‌ల‌కాల‌ను త‌యారు చేస్తున్నారు.

  ఇది చదవండి: పెద్దాపురంలో తయారయ్యే ఆ స్వీట్ ఒక్కసారి తిన్నారంటే.. ఆహా ఏమిరుచి అనాల్సిందే..!

  జిల్లాలో వంశ పారంప‌ర్యంగా శిలా శాస‌న‌ములు త‌యారు చేస్తోన్న ఏకైక సంస్థ కూడా ఇదే కావ‌డం విశేషం. తాత‌ల నాటి నుంచి వ‌స్తోన్న ఈ క‌ళ‌ను, సంప్రదాయాన్ని ఆ కుటుంబ వార‌సులు శ్రీనివాసులు, సురేంద్రబాబు నేటికీ కొన‌సాగిస్తున్నారు.

  ఇది చదవండి: బిర్యానీలో వేసే జాజికాయ పంటను ఎప్పుడైనా చూశారా..? మంచు ప్రాంతంలో పండేది మన కాకినాడలో ఎలా..?

  గ్రానైట్ స్టోన్స్, మార్బుల్ స్టోన్స్, పాలిష్ స్టోన్స్ పై అక్షరాలు ముద్రించి ఇత‌ర ప్రాంతాల‌కు చేర‌వేస్తుంటారు. జిల్లాలో 90 శాతం ప‌నులు వీరికే వ‌స్తుంటాయంటే.. వీరి నైపుణ్యం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఈ క‌ళ‌పై ఆస‌క్తి ఉన్న ఎంతోమంది వీరి వ‌ద్ద శిక్షణ పొందుతుంటారు. అలా కూడా ఉపాధి క‌ల్పిస్తున్నారు. కొంత‌మంది ప‌ని నేర్చుకుని ఉపాధి కోసం ఇత‌ర ప్రాంతాల‌కు వెళుతుంటారు.

  ఇది చదవండి: అక్కడికి ఒక్కసారి వెళ్తే మీ ఇల్లు నందన వనమే..! అందుకే మహిళలు క్యూ కడతారు..!

  ఒంగోలు, చీమ‌కుర్తి, క‌డ‌ప త‌దిత‌ర ప్రాంతాల నుంచి అవ‌స‌ర‌మైన రాళ్ళను నెల్లూరుకి తీసుకొస్తారు. ఆర్డర్ల మీద ఎవ‌రికి ఎలా కావాల్సి ఉంటే అలా శిల‌ఫ‌ల‌కాలు, శిలా శాస‌నాలు త‌యారు చేస్తుంటారు. ముఖ్యంగా దేవ‌స్థానాలు, శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్సవాలు, విగ్రహాలు, స్మార‌క స్థూపాలు, స‌మాధులు వ‌ద్ద శిల‌ఫ‌ల‌కాల ఆర్డర్లు వ‌స్తుంటాయ‌ని సురేంద్రబాబు తెలిపారు.

  ఇది చదవండి: ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ లో అదరగొడుతున్న స్వీపర్.. పిల్లలు మాట్లాడుతుంటే విని నేర్చుకుంది

  క‌ళ‌ను లాభాపేక్ష లేకుండా త‌మ వంతు సేవ‌లందిస్తున్నట్లు చెప్పారు. క‌ళ ప‌ట్ల ఆస‌క్తి ఉన్న వారికి వీటిలో మెళ‌కువ‌లు, నైపుణ్యాల‌ను నేర్పుతుంటామ‌ని వివ‌రించారు. నెల్లూరు ఆర్టీసీ స‌మీపంలోని టెక్కేమిట్ట ప్రాంతంలో వాసు స్టోన్ ఎంగ్రే వ‌ర్క్స్ పేరు తెలియ‌ని వారంటూ ఉండ‌రు. అంతగా ఫేమ‌స్ అయ్యారు ఇక్కడి శిల్పులు.

  ఫోన్‌ నెంబర్‌: +91 94911 28410, 98498 04638.

  ఎలా వెళ్లాలి: నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్‌కు దగ్గరలోనే ఈ షాపు ఉంటుంది. బస్టాండ్‌ నుంచి జీఎస్‌టీ రోడ్డులోని టక్కెమిట్ట ప్రాంతంలోనే ఈ స్టోన్‌వర్క్‌ షాపు ఉంటుంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Nellore

  ఉత్తమ కథలు