హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nellore: అంగన్ వాడీ కేంద్రాల్లో దొరకని పోష్టికాహారం..!అధికారుల సోదాల్లో వెలుగుచూసిన నిజాలు..!

Nellore: అంగన్ వాడీ కేంద్రాల్లో దొరకని పోష్టికాహారం..!అధికారుల సోదాల్లో వెలుగుచూసిన నిజాలు..!

నెల్లూరు జిల్లా అంగన్వాడీ కేంద్రాల్లో అధికారుల తనిఖీలు

నెల్లూరు జిల్లా అంగన్వాడీ కేంద్రాల్లో అధికారుల తనిఖీలు

పిల్లల‌కు, గ‌ర్భిణీల‌కు అందించాల్సిన పౌష్టికాహారాన్ని అంగన్‌వాడీ (Anganwadi Centers) నిర్వాహకులు బొక్కేస్తున్నారు. వారి ఆరోగ్య సంర‌క్షణ కోసం ప్రభుత్వం ఎంతో శ్రద్ద తీసుకుంటుంటే.. అంగ‌న్‌వాడీ కేంద్రాల్లో నిర్వాహ‌కులు మాత్రం స‌రిగ్గా అమ‌లు చేయ‌డం లేదు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nellore, India

  Polaa Sudha, News18, Nellore

  పిల్లల‌కు, గ‌ర్భిణీల‌కు అందించాల్సిన పౌష్టికాహారాన్ని అంగన్‌వాడీ (Anganwadi Centers) నిర్వాహకులు బొక్కేస్తున్నారు. వారి ఆరోగ్య సంర‌క్షణ కోసం ప్రభుత్వం ఎంతో శ్రద్ద తీసుకుంటుంటే.. అంగ‌న్‌వాడీ కేంద్రాల్లో నిర్వాహ‌కులు మాత్రం స‌రిగ్గా అమ‌లు చేయ‌డం లేదు. నాశిర‌కం భోజ‌నం పెడుతూ పోష్టికాహారానికి ఎస‌రు పెడుతున్నారు. తాజాగా విజిలెన్స్‌ ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నెల్లూరు జిల్లా (Nellore District) వ్యాప్తంగా త‌నిఖీలు చేయ‌డంతో చాలా చోట్ల ఈ దారుణాలే వెలుగుచూశాయి. నెల్లూరు జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో అంగ‌న్‌వాడీ కేంద్రాల‌పై విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు చేశారు. నెల్లూరు ప్రాంతీయ నిఘా అమలు అధికారి రాజేశ్వరరెడ్డి నేతృత్వంలో నాలుగు బృందాలుగా ఏర్పడి త‌నిఖీలు చేశారు. గుడ్లూరు మండలం పోట్లూరు, ఎస్టీ కాలనీ, చెమిడిదపాడు, టీపీ గూడూరు మండలం వెంకన్నపాలెం, పొదలకూరు మండలం మరుపూరు, మనుబోలు మండలం వీరంపల్లి, మర్రిపాడులోని ప్రధాన కేంద్రం, బీసీ కాలనీ తదితర ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో సోదాలు చేశారు.

  పోషకాహారంలో నాణ్యత, పరిణామాలు, మెనూ తనిఖీ చేశారు. మెనూలో ఉన్న ఆహార ప‌దార్ధాల‌ను ఇవ్వడం లేద‌ని దాడుల్లో తేలిసింది. మూడు కూర‌లు వ‌డ్డించాల‌ని మెనూలో ఉండ‌గా ఒక్క ప‌ప్పుచారు మాత్రం వ‌డ్డిస్తున్నారు. అది కూడా నీళ్ళతో ఉండ‌డం గ‌మ‌నార్హం. ముక్కిన బియ్యంతో వండుతుండ‌డం, అన్నంలో పురుగులు ఉండ‌డాన్ని అధికారులు గ‌మ‌నించారు.

  ఇది చదవండి: కాకినాడ కార్పోరేషన్‌లో కోట్ల రూపాయలు గోల్‌మాల్‌..! అంతా ఆయనే చేశాడా..? దోచాడా..?

  టీపీ గూడూరు మండలంలోని వెంకన్నపాలెంలో అంగ‌న్ వాడీ సిబ్బంది స‌క్రమంగా విధుల‌కు హాజ‌రు కావ‌డం లేద‌ని అధికారులు గుర్తించారు. మొత్తం ఆయాలే చూస్తున్నార‌ని తేలింది. కనీసం అటెండెన్స్‌ బుక్‌ కూడా మెయింటెన్‌ చేస్తున్నట్లు కనిపించలేదు. పిల్లల‌కు, గ‌ర్భిణీ స్త్రీల‌కు పౌష్టికాహారం స‌రిగా పెట్టడం లేద‌న్న విష‌యాన్ని అధికారుల దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు. వారి ఫిర్యాదులతో పాటు అంగ‌న్ వాడీ కేంద్రాల్లో లోపాలు, సిబ్బంది తీరుని నోట్ చేసుకున్నారు. పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళేందుకు నివేదిక రూపొందిస్తున్నారు.

  ఇది చదవండి: రాజరాజేశ్వరీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో అద్భుత ఘట్టం.. చూటడానికి రెండు కళ్లు చాలవు.!

  ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల ద్వారా సరఫరా చేసే పౌష్టికాహారం గర్భిణీ, బాలింతలకు ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులను సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయడమే దీని లక్ష్యం. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించేందుకు, ప్రభుత్వం నిత్యావసర సరుకులు ఇస్తోంది. మెనూను స‌క్రమంగా అమ‌లు చేసేలా చ‌ర్యలు తీసుకుంది. అయితే అంగ‌న్ వాడీ కేంద్రాల్లో సిబ్బంది మాత్రం ఇలాంటి క‌క్కుర్తి ప‌నుల‌కు అల‌వాటు ప‌డి.. ప్రభుత్వ ల‌క్ష్యాన్ని నీరు గారుస్తున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Anganwadi, Local News, Nellore

  ఉత్తమ కథలు