హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nellore: మహిళా కానిస్టేబుల్‌‌ తో ఎస్సై ప్రేమాయణం.. తాళికట్టి ఇంతపనిచేస్తాడనుకోలేదు..!

Nellore: మహిళా కానిస్టేబుల్‌‌ తో ఎస్సై ప్రేమాయణం.. తాళికట్టి ఇంతపనిచేస్తాడనుకోలేదు..!

ఫైల్ ఫోటో

ఫైల్ ఫోటో

Nellore: ప్రేమించానని వెంట పడ్డాడు… నువ్వు లేకుంటే బ్రతకడం కష్టమన్నాడు.. కులాలు వేరు అంటే ఒప్పిద్దాం అన్నాడు.. నమ్మించి పెళ్ళి చేసుకున్నాడు.. రెండు నెలలు గడవక ముందే మోజు తీరాక నరకం చూపించడం మొదలు పెట్టాడు.

 • News18 Telugu
 • Last Updated :
 • Nellore, India

  ప్రేమించానని వెంట పడ్డాడు… నువ్వు లేకుంటే బ్రతకడం కష్టమన్నాడు.. కులాలు వేరు అంటే ఒప్పిద్దాం అన్నాడు.. నమ్మించి పెళ్ళి చేసుకున్నాడు.. రెండు నెలలు గడవక ముందే మోజు తీరాక నరకం చూపించడం మొదలు పెట్టాడు. ఇలా మృగంలా ప్రవర్తించింది మరెవరో కాదు..ఓ పోలీసు ఉద్యోగి. నెల్లూరు (Nellore) లో చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు ఉద్యోగే దాష్టీకానికి పాల్పడ్డాడు. బాధ్యతగత ఎస్సై ఉద్యోగంలో ఉండి కూడా క్రిమినల్‌లా భార్యను చిత్రహింసలు పెట్టాడు. ఉన్నతాధికారులు సైతం మందిలించినా అతనిలో మార్పురాలేదు సరికదా.., ఇంకా అతనిలో రాక్షసత్వం పెరిగిపోయింది.

  వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా పొనకేపల్లికి చెందిన SK సుభానీ నెల్లూరులోని 3టౌన్ SI గా పనిచేస్తున్న సమయంలో అదే పోలీసు స్టేషన్ ‌లో కానిస్టేబుల్ ‌గా పనిచేస్తున్న నెల్లూరు జిల్లా బిట్రగుంటకి చెందిన లక్ష్మి ప్రసన్న అనే అమ్మాయిని ప్రేమించాడు. కులాలు వేరైనా పెద్దలను ఒప్పించి ఎస్‌కే సుభానీ, లక్ష్మీప్రసన్నకు 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి జరిగే వరకు జరిగిన కొన్ని రోజుల వరకు అంతా బాగానే సాగింది.

  ఇది చదవండి: జైలుకెళ్లినా బుద్ధిరాలేదు..! అక్కడ మరో ఇద్దరితో కలిశాడు..!

  పెళ్లయిన కొద్దిరోజులకే సుభానీలోని అసలు రూపం బయటపడింది. మృగంలా మారి తనను చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడని భార్య లక్ష్మీ ఆరోపించారు. మారతాడు అని ఎన్నోసార్లు సద్దుకుని పోయినా మార్పు రాలేదని.. ఇంతలో తాను గర్భం దాల్చినట్లు లక్ష్మీప్రసన్న తెలిపారు.

  ఇది చదవండి: కాకినాడలో జైభీమ్‌ సినిమా సీన్‌ రిపీట్‌..! పోలీసులే చేశారా..?

  కనీసం అప్పుడైనా భర్త ప్రవర్తనలో మార్పు వస్తుంది అనుకుంటే.. ఆ మనిషి కాస్తా మృగంలా మారిపోయాడు. గర్భం తొలగించాలని తనపై ఒత్తిడి చేశాడని.. వినక పోవడంతో కడుపులో బిడ్డను చంపాలని కడుపు మీద పిడి గుద్దులు గుద్దాడని లక్ష్మీ ప్రసన్న చెబుతున్నారు. ఇంకా చెప్పలేని నీచపు పనులు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు గోడకు తలను గుద్ది చంపాలని చూశాడని.. సృహతప్పి పడిపోవడంతో చనిపోయిందని తలుపులు మూసుకొని పారిపోయాడని బాధితురాలు వాపోయింది. తర్వాత కొద్దిసేపటికి తాను స్పృహలోకి వచ్చి డయల్‌ 100కి కాల్‌ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పింది. పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని లక్ష్మీని ఆస్పత్రికి తరలించారు.

  లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సై దారుణాలు వెలుగులోకి వచ్చాయి. దిశ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదుచేశారు. ఎస్సైపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 498A,313,342,307,304 DP ACT కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఎస్ఐ సుభాని పరారీలో ఉన్నాడని త్వరలోనే అతన్ని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Nellore

  ఉత్తమ కథలు