హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nellore: ఆస్పత్రి సూపర్‌వైజర్‌కే వైద్యం అందలేదు.. ఇంతకంటే దారణం ఏమైనా ఉంటుందా..? ప్రభుత్వాస్పత్రిలో ఘోరం..

Nellore: ఆస్పత్రి సూపర్‌వైజర్‌కే వైద్యం అందలేదు.. ఇంతకంటే దారణం ఏమైనా ఉంటుందా..? ప్రభుత్వాస్పత్రిలో ఘోరం..

నెల్లూరు

నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో విషాదం

Nellore: ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. కార్పొరేట్ తరహాలో వైద్యం అందిస్తున్నామని కూడా ప్రకటనలిస్తోంది. కానీ కొన్ని చోట్ల పరిస్థితి అందుకు భిన్నంగా మారింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Nellore, India

  Polaa Sudha, News18, Nellore

  ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం చెబుతోంది. కార్పొరేట్ తరహాలో వైద్యం అందిస్తున్నామని కూడా ప్రకటనలిస్తోంది. కానీ కొన్ని చోట్ల పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. నెల్లూరు (Nellore) స‌ర్వ‌జ‌న ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పోరేట్‌ స్థాయి సదుపాయాలు, స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్లు ఉన్న‌ప్ప‌టికీ, స‌కాలంలో వైద్య స‌హాయం అంద‌క రోగులు చ‌నిపోతున్నారు. వైద్యులు ఉన్నా, సిబ్బంది కొరతతో ప్రజలకు సరైన వైద్య సేవలు అందడంలేదనే ఆరోప‌ణ‌లు త‌ర‌చూ వ‌స్తున్నాయి. అయినా ఆస్ప‌త్రిలో తీరు మాత్రం మార‌డం లేదు. దీంతో మ‌రో ప్రాణం బ‌లైంది. నెల్లూరు జీజీహెచ్‌లో శానిట‌రీ సూప‌ర్ వైజ‌ర్ ల‌క్ష్మ‌మ్మ అనే మ‌హిళ ప‌నిచేస్తోంది. ఆమెకు గుండెనొప్పి రావ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే ఆ స‌మ‌యంలో వైద్యులు ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ఆమెకు వైద్య స‌హాయం అంద‌లేదు.

  దీంతో కొద్దిసేప‌టి త‌ర్వాత ఆమె క‌న్నుమూసింది. ల‌క్ష్మ‌మ్మ‌ మృతితో ఆమె బంధువులు ఆస్ప‌త్రి వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగారు. ఆస్ప‌త్రిలో డాక్ట‌ర్లు, సిబ్బంది ఉండ‌రా ? రోగుల‌ను ప‌ట్టించుకోరా ..? అంటూ నిల‌దీశారు. జీజీహెచ్ లోనే ప‌ని చేసే సిబ్బందికే స‌కాలంలో వైద్యం అందించ‌లేక పోతే, బ‌య‌టి ప్రాంతాల నుంచి వ‌చ్చే రోగుల‌కు ఏం సేవ‌లు అందిస్తార‌ని మండిప‌డ్డారు. అందుబాటులో ఉండ‌ని ఆస్ప‌త్రిలో డాక్ట‌ర్లు ఎందుకు..? ఇంత పెద్ద మెడిక‌ల్ కాలేజీ ఎందుకు..? అంటూ మండిప‌డ్డారు. ఆమె మృతికి ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తారంటూ ఆగ్ర‌హంతో ఊగిపోయారు. ఈ మేర‌కు మృతురాలి బంధువులు ఆస్ప‌త్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆస్ప‌త్రి వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

  ఇది చదవండి: విశాఖ బీచ్‌లో అద్భుతం.. పురాతన నిర్మాణం గుర్తింపు.. ఆ యుద్ధకాలం నాటిదేనా..?

  నెల్లూరు ప్ర‌భుత్వాసుప‌త్రిలో కార్పోరేట్ స్థాయిలో వ‌స‌తులు క‌ల్పిస్తున్నారు. కానీ సిబ్బంది కొర‌త తీవ్రంగా ఉంది. ఇటీవ‌లికాలంలో తాత్కాలిక ప‌ద్ద‌తిలో పోస్టుల భ‌ర్తీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చానా.. నోటిఫికేష‌న్ విడుద‌ల చేసినా.. భ‌ర్తీ కాలేదు. దీంతో సిబ్బంది కొర‌త ఏర్ప‌డింది. స‌కాలంలో డాక్ట‌ర్లు అందుబాటులో ఉండ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు తీవ్రంగా వ‌స్తున్నాయి.

  ఇది చదవండి: స్నేహమంటే ఇదేరా..! స్నేహితుడికి గుర్తుగా.. వీల్లేం చేశారో మీరే చూడండి..

  గ‌తంలో వైద్యుల‌పై చాలా ఫిర్యాదులు వ‌చ్చాయి. అయినా వారు త‌మ తీరు మార్చుకోవ‌డం లేదు. ఇక మౌలిక వ‌స‌తులు కూడా అర‌కొర‌గానే ఉన్నాయి. రోగుల‌కు, వారి కోసం అటెండ‌ర్ల‌కు స‌రైన సౌక‌ర్యాలు క‌ల్పించ‌లేక‌పోతున్నారు. ఆసుపత్రి థియేటర్లతో పాటు ఐసీయూ ఇతర విభాగాలలో ఏసీలు మరమ్మతులకు గురయ్యాయి. ఆసుపత్రిలో రేడియాలజిస్ట్‌ల కొరత కూడా తీవ్రంగా ఉంది.

  ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌లో అప‌రిశుభ్ర వాతావ‌ర‌ణం నెల‌కొంది. త‌ర‌చూ పాములు, జెర్రులు, ఎలుకలు తిరుగుతున్నాయి. అయినా ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. పేరుకు మాత్రం కార్పోరేట్ ఆస్ప‌త్రి త‌ర‌హాలో జీజీహెచ్‌ను తీర్చిదిద్దుతున్నామ‌ని, రూపురేఖ‌లు మార్చేస్తున్నామ‌ని చెబుతున్నారే త‌ప్ప‌, ఆచ‌ర‌ణ‌లో మాత్రం శూన్యం. త‌త్ఫ‌లితంగా అకార‌ణంగా రోగుల ప్రాణాలు గాలిలో క‌లిసిపోతున్నాయి. డాక్ట‌ర్లు లేక‌పోవ‌డం, స‌కాలంలో వైద్యం అందించ‌క‌పోవ‌డం వ‌ల్ల‌.. జీజీహెచ్ లో శానిట‌రీ విభాగంలో ప‌నిచేసే ల‌క్ష్మ‌య్య కన్నుమూయ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Nellore

  ఉత్తమ కథలు