హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఈ ధాన్యం పండించే రైతులకు డబ్బే డబ్బు..! ఇంతకీ ఆ ధాన్యం ఏంటంటే..!

ఈ ధాన్యం పండించే రైతులకు డబ్బే డబ్బు..! ఇంతకీ ఆ ధాన్యం ఏంటంటే..!

జీలకర్ర మసూరి బియ్యంతో డబ్బే డబ్బు

జీలకర్ర మసూరి బియ్యంతో డబ్బే డబ్బు

నెల్లూరు (Nellore) జిల్లా.. ధాన్యం పండిచాల‌టే రైతు (Farmer) ప‌డే క‌ష్టం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆ రైతన్నకు మంచిరోజులొచ్చాయి. జిలకర మసూర (Jeera Masori) ధాన్యం రేటు పెరిగింది. ఎప్పుడూ పుట్టి(919కేజీలు) రూ.15 వేల‌కు మించి పెర‌గ‌ని జిల‌క‌ర ధాన్యం.. ఇప్పుడు రూ.23 వేల‌కు పెరిగింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nellore, India

  Pola Sudha (News18, Nellore)

  నెల్లూరు (Nellore) జిల్లా.. ధాన్యం పండిచాల‌టే రైతు (Farmer) ప‌డే క‌ష్టం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆ రైతన్నకు మంచిరోజులొచ్చాయి. జిలకర మసూర (Jeera Masori) ధాన్యం రేటు పెరిగింది. ఎప్పుడూ పుట్టి(919కేజీలు) రూ.15 వేల‌కు మించి పెర‌గ‌ని జిల‌క‌ర ధాన్యం.. ఇప్పుడు రూ.23 వేల‌కు పెరిగింది.

  విత్తనాలు చ‌ల్లి నారు వేసి, వరికి ప‌ట్టిన పురుగుల‌కు మందు కొట్టి ఇలా దాద‌పుగా రూ.35 వేల నుంచి రూ.40 వేల ఒక ఎక‌రాకు రైతుకి ఖర్చు అవుతుంది. ఆ డ‌బ్బుల‌కు వ‌డ్డీలు క‌ట్టలేక రూ.10 వేల నుంచి రూ.15 వేలలోపు ధాన్యాన్ని దళారులకు విక్రయించే పరిస్థితి ఇప్పటి వరకూ ఉండేది. కానీ ఇప్పుడు జిల‌క‌ర ధాన్యాన్ని రూ.23వేల‌కు విక్రయించి లాభ‌ప‌డుతున్నారు. గ‌తంలో రైతుల‌కు మూడు సంవ‌త్సరాలుగా జిల‌క‌ర ధాన్యంకు రేటు రాక‌పోవ‌డంతో సాగు చాలా వ‌ర‌కు త‌గ్గింది. అనూహ్యంగా ఈ ఏడాది రూ.23 వేల‌కు పెర‌గ‌డంతో ఇకపై ఈ ధాన్యం సాగు కూడా పెరిగే అవ‌కాశం ఉంది.

  ఇదీ చదవండి: ప్రపంచంలో మరెక్కడా లేదు.. మన నెల్లూరులో మాత్రమే అది సాధ్యమైంది…! ఇంతకీ ఆ అద్భుతం ఏంటో తెలుసా..?


  లాభపడుతున్న వ్యాపారులు..!

  వ్యాపారులు జిల‌క‌ర మ‌సూర ధాన్యంతో భారీగా లాబ‌ప‌డుతున్నారు. త‌క్కువ ధ‌ర‌కు ధాన్యాన్ని కొనుగోలుచేసి గొదాముల్లో ఉంచి ఇప్పుడు ధ‌ర పెరిగిన‌ప్పుడు విక్రయించి ఆదాయాన్ని పెంచుకుంటున్నారు.

  కోతల సమయంలో వ్యాపారులు సిండికేట్‌గా మారి ధాన్యం కొనుగోలు ధరను తగ్గించేశారు. అటువైపు ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధర కూడా దక్కలేదు. కొనుగోలు కేంద్రాల్లో ఈ రకమైన ధాన్యాన్ని విక్రయించేందుకు అనుమతి లేదు. దీంతో అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన రైతన్నలు దళారులకే అమ్మడానికి సిద్ధమైయ్యారు. ఇదే అవకాశంగా తీసుకున్న దళారులు ధాన్యం రేటును తగ్గించి రూ.12వేలకు కొనుగోలు చేశారు.

  ధాన్యం నిల్వకు గోదాములు లేక..!

  రైతులు ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు గోదాములు అందుబాటులో లేవు. ప్రైవేటు గోదాములు కూడా త‌క్కువ‌గా ఉన్నాయి. ఉత్పత్తికి స‌రిప‌డ ప్రభుత్వ గోదాములు లేవు. స‌చివాల‌యం స్థాయిలో గోదాముల నిర్మణాల‌కు ప్రతిపాదనలు ఉన్నా… కార్యరూపం దాల్చలేదని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. భవిష్యత్తులో గోదాముల నిర్మాణాలు చేస్తే రైతుల‌కు కొంత వరకు ఉపశమనం కలిగే అవకాశం ఉంది. రైతుకు ధాన్యాన్ని నిల్వచేసే అవ‌కాశం ఉంటే వాళ్లు లాభ‌ప‌డ‌తారు.

  అన్నదాత‌ల‌కు ప్రభుత్వం గోదాములు అందుబాటులో ఉంచే ప్రయ‌త్నం చేయాల‌ని రైతన్నలు కోరుతున్నారు. ధాన్యం అమ్మకాలు విషయంలో ప్రభుత్వం ప్రత్యేక మార్కెట్‌ ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఈ జిలకర ధాన్యానికి మంచి ధర రావడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఈ పంట సాగుకు రైతన్నలు ఆసక్తి చూపుతున్నారు.

  First published:

  Tags: AP News, Farmer, Local News, Nellore

  ఉత్తమ కథలు