హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP POLITICS: మీ మీద నమ్మకం లేకే దూరంగా ఉన్నా..నమ్మక ద్రోహం కాదు తమ్ముడు అనీల్: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

AP POLITICS: మీ మీద నమ్మకం లేకే దూరంగా ఉన్నా..నమ్మక ద్రోహం కాదు తమ్ముడు అనీల్: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

(FILE PHOTOS)

(FILE PHOTOS)

AndhraPradesh: వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన విమర్శలకు మరోసారి కౌంటర్ ఇచ్చారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. తాను ఫోన్ వాయిస్ రికార్డ్ చేసి ట్యాపింగ్ చేశానని చెబుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రశ్నలు సంధించారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. మాజీ మంత్రికి ఏం కౌంటర్ ఇచ్చారో తెలుసా.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nellore, India

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ విమర్శలు ఇంకా అంతకంతకు పెరుగుతున్నాయి. అధికార పార్టీలో రాజుకున్న ఈ విమర్శల వేడి పరస్పర నిందలు, ఆరోపణలతో హీటెక్కిస్తున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన విమర్శలకు మరోసారి కౌంటర్ ఇచ్చారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. తాను ఫోన్ వాయిస్ రికార్డ్ చేసి ట్యాపింగ్ చేశానని చెబుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రశ్నలు సంధించారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి(Kotam reddy sridhar reddy).నిజంగా ప్రభుత్వం ట్యాపింగ్ (Tapping)చేయకపోతే కేంద్ర హోంశాఖకు ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ అయిందని ఎందుకు కంప్లైంట్ చేయడం లేదన్నారు. అంతే కాదు తాను జగన్‌కి నమ్మక ద్రోహం చేశానని ఎమ్మెల్యే అనీల్‌కుమార్‌ (Anil Kumar)చేసిన విమర్శలకు బదులిచ్చారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. తాను మోసం చేసే వాడ్నే అయితే ఎన్నికల వరకు ఉండి చివర్లో పార్టీ మారేవాడినని అన్నారు. ఎమ్మెల్యే అనీల్‌కుమార్‌యాదవ్ తనతో పాటు తన కుటుంబ సభ్యులను గురించి చులకనగా మాట్లాడటాన్ని తప్పుపట్టారు. తాను 30ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని..అనీల్‌కుమార్‌ యాదవ్ తొలిసారి ఓడిపోయినప్పుడు తాను, తన భార్య, పిల్లలు భోజనం కూడా చేయలేదని చెప్పుకొచ్చారు. పార్టీపై విమర్శలు చేయకుండా సైలెంట్‌గా తప్పుకుందామనుకున్న తనను వైసీపీ నేతల మాటలకే కౌంటర్ ఇవ్వాలని మీడియా ముందుకు వచ్చానంటూ చెప్పుకొచ్చారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.

Tirumala: ఫిబ్రవరి 5న తిరుమలలో జరిగే శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ప్రత్యేకత ఇదే

నమ్మక ద్రోహం కాదు నమ్మకం లేకే ..

వైసీపీ ప్రభుత్వం తనను అవమానించినందుకే..అనుమానించినందుకే పార్టీకి దూరం కావాలనుకున్నాను తప్ప వేరే కాదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తనపై వైసీపీ నేతలు, మంత్రులు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు నిజమని నిరూపించమని కోరారు. తన ఫోన్ ట్యాపింగ్ చేయడంపై ప్రభుత్వ పెద్దల హస్తముందన్న ఎమ్మెల్యే తన ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేంద్ర హోంశాఖకు లేఖ రాసి విచారణ జరిపించమని కోరితే నమ్మకం ఉంటుందన్నారు. విచారణలో తాను మోసం చేసినట్లుగా తేలితే చర్యలు తీసుకుంటే సరిపోతుందని సూచించారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.

అర్ధం పర్ధం లేని ఆరోపణలు వద్దు..

మరో 10నెలలకుపైగా అధికారంలో ఉండే ప్రభుత్వంపై విమర్శలు చేస్తే జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో తనకు తెలుసన్నారు. అలాగని ఇష్టం లేని చోట...తనకు అవమానం జరిగిన పార్టీలో ఉండటం ఇష్టం లేకే దూరంగా ఉంటున్నానని చెప్పారు. అయితే తాను మౌనంగా ఉందామనుకుంటే వైసీపీ నేతలు, మంత్రులు రీజనల్ కో ఆర్డినేటర్లు, సలహాదారులు ఆరోపణలు చేయడం వల్లే మరోసారి మీడియా ముందుకు రావాల్సి వచ్చిందన్నారు. మాజీ మంత్రి అనీల్‌ కూడా తాను పార్టీకి, జగన్‌కి నమ్మకద్రోహం చేశానని చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. ఆయన్ని ఓ సోదరుడిలా చూశాను తప్ప వేరేలా భావించలేదన్నారు. నిజంగా తాను నమ్మకద్రోహం చేస్తే దేవుడు తనను శిక్షించాలని రుద్రాక్ష పట్టుకొని కోరుతున్నానని చెప్పారు. ఒకవేళ తాను చేసిన విమర్శలు నిజమైతే దేవుడు తనవైపు ఉండాలని కోరుతున్నానని మీడియా సాక్షిగా మరోసారి ఫోన్ ట్యాపింగ్ విషయంలో వైసీపీ సర్కారుపై విమర్శలు చేశారు తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.

First published:

Tags: Andhra pradesh news, Kotamreddy sridhar reddy, Ycp

ఉత్తమ కథలు