హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఈ యుద్ధకళ నేర్చుకుంటే.. ఆత్మరక్షణతో పాటు ఆరోగ్యం..! మీరు ట్రై చేయండి..!

ఈ యుద్ధకళ నేర్చుకుంటే.. ఆత్మరక్షణతో పాటు ఆరోగ్యం..! మీరు ట్రై చేయండి..!

నెల్లూరులో

నెల్లూరులో కరాటే ట్రైనింగ్

Nellore: క‌రాటే..! ఒక ప్రాచీన యుద్ధక‌ళ‌.. ఇది ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందింది. ఎంత‌లా అంటే గ్రామ‌ స్థాయి వ‌ర‌కు చేరింది. ఆత్మర‌క్షణలో క‌రాటే ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది. అందుకే ప‌ట్టణాల్లోనే కాదు గ్రామాల్లోనూ క‌రాటే నేర్చుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nellore, India

  Polaa Sudha, News18, Nellore

  క‌రాటే..! (Karate) ఒక ప్రాచీన యుద్ధక‌ళ‌.. ఇది ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందింది. ఎంత‌లా అంటే గ్రామ‌ స్థాయి వ‌ర‌కు చేరింది. ఆత్మర‌క్షణలో క‌రాటే ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది. అందుకే ప‌ట్టణాల్లోనే కాదు గ్రామాల్లోనూ క‌రాటే నేర్చుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. నెల్లూరు జిల్లా (Nellore District) లోనూ ఎన్నో క‌రాటే అకాడ‌మీలు ఏర్పడ్డాయి. వీటి ద్వారా ప్రతి రోజు ఎంతో మంది శిక్షణ పొందుతున్నారు. క‌రాటే మాస్టర్ రెన్షీ అశోక్ తోట‌ప‌ల్లి గూడూరు మండ‌లం ఆములూరులో హ‌నుమాన్ మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్ క‌రాటే అకాడ‌మిని స్థాపించారు. కోడూరు బీచ్‌కి వెళ్ళే మెయిన్ రోడ్డులోనే ఆములూరు గ్రామం వ‌స్తుంది. గ్రామంలోని ఆములూర‌మ్మ ఆల‌యం స‌మీపంలోనే ఈ అకాడ‌మీని ఏర్పాటు చేశారు.

  ఇక్కడ బాల‌ బాలిక‌లు ఎంతోమంది క‌రాటేలో శిక్షణ తీసుకుంటున్నారు. ఆ గ్రామంలోని పిల్లలే కాకుండా చుట్టుప‌క్కల గ్రామాల నుంచి వ‌చ్చే పిల్లలు కూడా ఇక్కడ త‌ర్ఫీదు పొందుతున్నారు. క‌రాటే అనేది ముఖ్యంగా ఆత్మర‌క్షణ కోసం ఉప‌యోగించుకునేది. మాన‌సిక ఒత్తిడి దూరం చేయ‌డం, శారీర‌క ధృఢ‌త్వాన్ని పెంపొందించ‌డం, ఆత్మస్థైర్యాన్ని నింప‌డం.. క‌రాటేలో ఓ భాగం. నేటి స‌మాజంలో మ‌గ‌వారికే కాదు ఆడ‌వారికి కూడా క‌రాటే ఎంతో అవ‌స‌రం ఉంది.

  ఇది చదవండి: పొన్నగంటి ఆకు.. పోషకాల గని..! ఈ ఆకుతో చేసే వడలు తింటే ఎన్నో హెల్త్‌ బెనిఫిట్స్‌..!

  అందుకే గ్రామ‌ స్థాయిలోని ఆడ‌ పిల్లల కోసం క‌రాటే మాస్టర్ రెన్షీ అశోక్.., ఈ అకాడ‌మీని ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. అకాడ‌మీలో శిక్షణ పొందిన విద్యార్ధులు క‌రాటే టోర్నమెంట్స్, చాంపియ‌న్ షిప్ పోటీల్లో స‌త్తా చాటుతున్నార‌ని ఆయ‌న తెలిపారు. ఇది త‌మ‌కెంతో గ‌ర్వకార‌ణంగా ఉంద‌న్నారు. ఈ అకాడమీలో చేరాలంటే వేలకు వేలు చెల్లించక్కర్లేదు.. నెలకు అక్షరాలా రూ.500 చెల్లిస్తే చాలు..! ఆరేళ్లు దాటిన వాళ్లెవ్వరైనా ఈ అకాడెమీలో చేరి కరాటే నేర్చుకోవచ్చు.

  ఇది చదవండి: విశాఖలో రాజమండ్రివారి రోజ్ మిల్క్.. తాగితే అమృతమే..! అంత టేస్ట్ ఎలా వచ్చిందంటే..!

  కరాటే నేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కరాటే మాస్టర్‌ అశోక్‌ తెలిపారు. శరీరం ధృడంగా మారడమే కాకుండా..మానసిక ప్రశాంతత కలుగుతుందని, ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు. గుండె ఆరోగ్యంగా ఉంటుందని, శరీరంలోని ప్రతి భాగం కదులుతుందని దీనివల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుందని కూడా అశోక్‌ చెబుతున్నారు. ఆత్మరక్షణతోపాటు ఆరోగ్యం పొందొచ్చనేది నిపుణుల మాట.

  అడ్రస్‌: సౌత్‌ ఆమూలురు గ్రామం, ఆములురమ్మ ఆలయం దగ్గర, కోడూరు బీచ్‌ మెయిన్‌ రోడ్‌, తోటపల్లి, గూడురు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ - 524002. ఫోన్‌ నెంబర్‌: 9440139512

  Nellore Amuluru Karate Training

  ఎలా వెళ్లాలి: నెల్లూరు బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ నుంచి ఆటోలు అందుబాటులో ఉంటాయి. నెల్లూరు బస్టాండ్ నుంచి బస్సులు చాలానే ఉన్నాయి. కొత్త కోడూరు బస్సు, కోడూరు బీచ్ బస్సు, నెలిమిట్ట కండ్రిగ బస్సు, పాతపాలెం బస్సు, వెంకన్నపాలెం బస్సు, కొత్తపాలెం బస్సు, ఈ రూట్‌లో వెళ్లే ఆటోలెక్కిన బస్సులెక్కిన ఆములూరులో దిగుతారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Nellore

  ఉత్తమ కథలు