హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Twist In Marriage: గంటలో పెళ్లి.. ఇంతలో ఊహించని ఫోన్ కాల్.. దెబ్బకు సీన్ రివర్స్

Twist In Marriage: గంటలో పెళ్లి.. ఇంతలో ఊహించని ఫోన్ కాల్.. దెబ్బకు సీన్ రివర్స్

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Marriage Cheating: ప్రస్తుతం పెళ్లిళ్లకు సైతం ఎన్నో ఎన్నో వెబ్ సైట్స్ అందుబాటులో ఉన్నాయి. కొంత మేరకు సరైన వివరాలు పొందుపరిచినా.. అందులో 60 శాతం ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. కొందరు మాయగాళ్లలు యువతులను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడున్నారు.

ఇంకా చదవండి ...
  • Advertorial
  • Last Updated :
  • Nellore, India

GT Hemanth Kumar, News18, Tirupati

పెళ్లంటే నూరేళ్ళ పంట..! అందుకే పెద్దలు అటు ఏడు తరాలు., ఇటు ఏడు తరాలు చూసి.. వివాహం జరిపించాలని అంటుంటారు. అలాగే కాబోయే జంట అభిరుచులు ఒక్కటవాలని కోరుకుంటుంటారు. ఇలా అన్ని వ్యవహారాలు అలోచించిన తర్వాత పెళ్లికి ముందడుగేస్తుంటారు. అప్పట్లో పెళ్లిళ్ల పేరయ్యలుండేవారు. అన్ని విధాలా కుటుంబ సభ్యుల గురించి తెలుసుకొని వివరాలు చెప్పేవారు. కానీ ఇప్పుడు అంతా యాత్రికంగా మారింది. మనకు ఏది కావాలన్నా ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం ఆన్ లైన్ పేమెంట్ చేసి కొనేయడం జరుగుతోంది. ఆఖరికి పెళ్లిళ్లకు సైతం ఎన్నో ఎన్నో వెబ్ సైట్స్ అందుబాటులో ఉన్నాయి. కొంత మేరకు సరైన వివరాలు పొందుపరిచినా.. అందులో 60 శాతం ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. కొందరు మాయగాళ్లలు యువతులను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడున్నారు.

అలా ఆన్ లైన్లో అమ్మాయితో పెళ్లి కుదుర్చుకున్న ఓ యువకుడు.. తన గతాన్ని మాత్రం దాచిపెట్టాడు. ఐతే చివరి నిముషంలో వధువుకు ఫోన్ కాల్ రావడంతో పెళ్లి అర్ధాంతరంగా నిలిచిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని  నెల్లూరు జిల్లా (Nellore District) వేదాయపాలెంకు చెందిన సాయి సందీప్ (27) కు ఓ వివాహ వెబ్ సైట్ ద్వారా శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) పారాపురం గ్రామానికి చెందిన యువతి ప్రొఫైల్ ను చూసి మేసెజ్ చేయడం ప్రారంభించాడు. ఇలా ఆ యువతితో పరిచయం పెంచుకున్నాడు సాయి సందీప్. అలా వారి పరిచయం కాస్త.. ప్రేమగా మారింది. అంతేకాదు తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లారు.

ఇది చదవండి: వైజాగ్ బీచ్ లో షాకింగ్ సీన్.., నల్లగా మారిన ఇసుక.. కారణం ఇదేనా..?


బంధువుల అందరి సమక్షంలో వివాహ ముహూర్తం నిర్ణయించారు. శుభలేఖలు పంచి అందరిని ఆహ్వానించారు. గురువారం బత్తిలి రోడ్డులోని కల్యాణమండపం వద్ద బంధువుల హడావిడి. వధువు తరపు బంధువులు అన్ని ఏర్పాట్లు చేశారు. పెళ్లికొడుకు కూడా మండపానికి చేరుకున్నాడు. ఒకరిని యోగ క్షేమాలు మరొకరు తెలుసుకుంటు ఆనందంగా రిసెప్షన్ వేడుకలు సాగుతున్నాయి. మధ్యాహ్నం వివాహ విందుకి ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో ఒక్క ఫోన్ కాల్ పెళ్లి మండపంలో అలజడి సృష్టించింది. ఓ మహిళ వధువు తరపు వారికి ఫోన్ చేసి సాయిసందీప్ కు నెల్లూరు జిల్లాలో వేరే యువతితో సంబంధమున్నట్లు తెలిపింది. ఒక్కసారిగా షాక్ కు గురైన వధువు తరపున బంధువులు అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేసి అది నిజమేనని నిర్ధారించుకున్నారు.

ఇది చదవండి: ప్రియుడితో సహా ఇంటికొచ్చిన కోడలు.. తలనరికి పోలీసుల ముందుంచిన అత్త.. ఏపీలో షాకింగ్ సీన్..


విస్తుపోయే నిజాలు తెలియడంతో వధువు కుటుంబీకులు అతనిపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. అతనిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని కోరారు. ఇవాళ మా అమ్మాయితో జరగాల్సిన దేవుని దయతో ఆగిందని.. రేపు వేరొక యువతిని పెళ్లి చేసుకోకుండా ఇతనికి కఠినమైన శిక్ష వేయాలని పోలీసులను కోరారు. దీంతో గంటల్లో పీటలు ఎక్కాల్సిన పెళ్ల. అర్ధాంతరంగా ఆగిపోయింది.

First published:

Tags: Andhra Pradesh, Cheating, Nellore, Srikakulam

ఉత్తమ కథలు