హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

నిత్యపెళ్లికొడుకు .. నాలుగో పెళ్లికి ప్లాన్ .. అంతలోనే అదిరే ట్విస్ట్

నిత్యపెళ్లికొడుకు .. నాలుగో పెళ్లికి ప్లాన్ .. అంతలోనే అదిరే ట్విస్ట్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పెళ్లంటే నూరేళ్ళ పంట. పూర్వం పెళ్లి అంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసేవారు. ఆ ఫార్ములా బాగానే వర్కవుట్ అయ్యింది. అప్పటి పెళ్లిళ్లు కలకలం నిలిచాయి. ఇప్పటి పెళ్లిళ్ల తీరు మారిపోయింది. అంతా స్పీడ్. ఇన్‌స్టంట్ మ్యారేజ్‌లు ఎక్కువయ్యాయి. మ్యాట్రిమోనీ సైట్‌లో నచ్చిన వారిని ఎంచుకోవటం, పెళ్లి చేసుకోవటం, కొన్నాళ్లకే విడాకులు తీసుకోవటం.. చూస్తున్నాం. సరిగ్గా ఈ పాయింట్‌నే అడ్వాంటేజ్‌గా తీసుకున్న ఓ నిత్య పెళ్లికొడుకు కథ ఇది. (అన్నా రఘు, సీనియర్ కరెస్పాండెంట్, న్యూస్ 18 అమరావతి)

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఆమె నెల్లూరుకు చెందిన వైద్యురాలు. భర్త చనిపోయాడు. కుటుంబ సభ్యులు మరో పెళ్లి చేసుకోమన్నారు. వరుడి కోసం ఓ మ్యాట్రిమోనీ సైట్‌లో ప్రకటన ఇచ్చింది. దిల్‌సుఖ్‌నగర్‌కి చెందిన.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వంశీ కృష్ణ.. తన మూడో పెళ్లి కోసం అదే సైట్‌లో ప్రకటన ఇచ్చాడు. వైద్యురాలి ప్రొఫైల్ చూశాడు. పరిచయం చేసుకున్నాడు. కల్లబొల్లి మాటలటో మెస్మరైజ్ చేశాడు. నెల్లూరు వెళ్లి ఆమెను కలిశాడు. పెళ్లి చేసుకుందం అన్నడు. జనవరి 4న తన ఇంటికి రావాలని కోరాడు. ఇద్దరికీ ముందే వివాహాలు అయ్యాయి కాబట్టి హంగూ ఆర్భాటాలు లేకుండా పెళ్లి చేసుకుందాం అన్నాడు. ఆమె సరే అంది. పెళ్లైంది.

పెళ్లి తర్వాత కొన్ని రోజులు బాగానే సాగింది వ్యవహారం. ఇద్దరూ శారీరకంగా కూడా ఒకటయ్యారు. ఆ వైద్యురాలు ఓసారి నెల్లూరు వెళ్లి జనవరి 24న తిరిగి వంశీ ఇంటికి వచ్చింది అప్పటి నుంచీ అతను కనిపించకుండా తిరుగుతున్నాడు. ఫోన్ ఎత్తకుండా తప్పించుకుంటున్నాడు. అతనికి బుద్ధి చెప్పాలనుకున్న ఆమె.. పోలీసుల్ని కలుస్తానని చెప్పింది. అంతే.. ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. మరో డ్రామా ఆడి.. ఆమెను ఆ ఇంట్లోని ఓ గదిలో బంధించాడు.

అదే సమయంలో మరో పెళ్లికి సిద్ధమయ్యాడు మ్యాట్రిమోనీ సైట్‌లో మరో ప్రకటన ఇచ్చాడు. ఆ సమయంలో మ్యాట్రిమోనీ సంస్థకు డౌట్ వచ్చింది. వాళ్లు చొరవ చూపించి.. వైద్యురాలిని రహస్యంగా విడిపించారు. తర్వాత ఆమె బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం కంప్లైంట్ ఇచ్చింది. వంశీ మోసాల వెనక.. అతను కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందని బాధితురాలు తెలిపింది. కేసు రాసిన పోలీసులు.. దర్యాప్తు మొదలుపెట్టారు. త్వరలోనే నిత్యపెళ్లికొడుక్కి చెక్ పెడతామని అంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Nellore

ఉత్తమ కథలు