Mandous Cyclone: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మాండౌస్ తుఫాను బీభత్సం కొనసాగుతోంది. తుఫాను ప్రభావంతో రాయలసీమ (Rayalaseema), కోస్తాంధ్ర (Coastal Andhra ) లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అంతేకాదు పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ తుపాను ప్రభావంతో (Cyclone Effect).. శుక్రవారం రాత్రి నుంచి ప్రకాశం (Prakasham), నెల్లూరు (Nellore), తిరుపతి (Tirupati), చిత్తూరు (Chittoor), అన్నమయ్య (Annamayyya) జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రను సైతం వర్షాలు భయపెడుతున్నాయి. ఇవాళ సాయంత్రం.. రేపు కూడా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శుక్రవారం అర్థరాత్రి శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటిన తుఫాను భయపెడుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ ఇవాళ సాయంత్రం వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉంది. తీరంలో కొనసాగుతున్న అలజడితో మరో రెండురోజులు ఉత్తర తమిళనాడు, దక్షిణ ఏపీలోని పలు జిల్లాల్లో అతిభారీ నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి.
తుపాను తీరం దాటినప్పటికీ.. ఏపీ ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని.. రేపటి వరకు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ అధికారులు వెల్లడించారు. ఎందుకంటే ఇప్పటికే ఏపీని వర్షాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తుపాను కారణంగా నెల్లూరు జిల్లా నాయుడుపేట, గూడూరు, సూళ్లూరుపేటలో భారీ వర్షం కురుస్తుంది. ఈదురు గాలులతో పలు ప్రాంతాల్లో చెట్లు నేలమట్టమయ్యాయి.
MandousCyclone Effect || ఏపీని భయపెడుతున్న మాండౌస్ తుఫాను || పది మీటర్లు... https://t.co/TEh1pHCFWk via @YouTube #CycloneMandous #cyclonemondous #Cyclone #CycloneUpdates #CycloneToday #Cyclones #AndhraPradesh #andhranativesweet
— nagesh paina (@PainaNagesh) December 10, 2022
ఇటు తిరుమలలోనూ భారీ వర్షపడుతుంది. తిరుపతి జిల్లాలో వర్షాల కారణంగా సువర్ణముఖి నదికి వరదనీరు చేరుతుంది. ఏర్పేడు మండలం కొత్తవీరాపురం వద్ద కాజ్వేపై వరద నీరు ప్రవహిస్తుంది. ఏర్పడు–మోదుగులపాలెం రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీకాళహస్తి–పాపానాయుడుపేట-గుడిమల్లం రహదారిపై వరదనీరు ప్రవహిస్తుంది. తిరుపతి నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఘాట్ రోడ్డులో వాహనదారులను సిబ్బంది అప్రమత్తం చేశారు.
ఈ తుఫాను తమిళనాడుతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టిస్తోంది. ఈ తెల్లవారుజామ నుంచి సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. పెనుగాలుల ధాటికి తీరంలో మత్స్యకారుల బోట్లు ధ్వంసమయ్యాయి. ఇప్పటివరకు తుఫాన్ కారణంగా నలుగురు మృతి చెందారు. అటు చెన్నై సహా పది జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఇదీ చదవండి 20 ఏళ్ల తరువాత పవన్ ఇలా.. కారు టు కట్ డ్రాయర్ అంటూ ట్వీట్ల యుద్ధం
కుండపోత వానలకు పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురంతోపాటు పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. మరో 26 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైతో పాటు పలు జిల్లాల్లో పెనుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. చెన్నైతోపాటు 5 ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Cyclone alert, Heavy Rains, Nellore, Vizag