హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Shocking: పెరట్లో అన్ని రకాల మొక్కలు పెంచొచ్చు..! కానీ, ఇదేం పాడు బుద్ది..!

Shocking: పెరట్లో అన్ని రకాల మొక్కలు పెంచొచ్చు..! కానీ, ఇదేం పాడు బుద్ది..!

నెల్లూరులో

నెల్లూరులో ఇంట్లో గంజాయి పెంచుతున్న వ్యక్తి

Nellore: సాధారణంగా పెరట్లో ఏ పూలమొక్కలో.. కూరగాయల మొక్కలో పెంచుతుంటారు. మహా అయితే ఔషధ మొక్కలు.. వెరైటీ మొక్కలు పెంచుతారు. కానీ ఓ వ్యక్తి తన ఇంట్లో ఏకంగా గంజాయి మొక్కలను పెంచుతున్నాడు.

 • News18 Telugu
 • Last Updated :
 • Nellore, India

  Polaa Sudha, News18, Nellore

  సాధారణంగా పెరట్లో ఏ పూలమొక్కలో.. కూరగాయల మొక్కలో పెంచుతుంటారు. మహా అయితే ఔషధ మొక్కలు.. వెరైటీ మొక్కలు పెంచుతారు. కానీ ఓ వ్యక్తి తన ఇంట్లో ఏకంగా గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. నెల్లూరు (Nellore District) లో గంజాయి గుప్పుమంటోంది. గతంలో ఏజెన్సీ ప్రాంతాల్లోనే మాత్రమే కనిపించే గంజాయి తోటలు కనిపించేవి. కానీ ఇప్పుడు ప‌ట్టణాల్లోనూ గంజాయి సాగు చేస్తున్నారు. నెల్లూరు న‌గ‌రంలోనూ గంజాయి సాగు చేస్తోన్న ఘ‌ట‌న‌లు రోజురోజుకీ ఎక్కువైపోతున్నాయి. ఒక‌ర‌కంగా చెప్పాలంటే గంజాయి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఇందుకు నిద‌ర్శన‌మే ఈ ఘ‌ట‌న‌. నెల్లూరు వెంకటేశ్వరపురం జనార్దన్‌రెడ్డి కాలనీలో ఓ వ్యక్తి ఏకంగా ఇంటి పెరటిలోనే గంజాయి మొక్కలు పెంచుతున్న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. స్థానికంగా ఉండే రఫూఫ్‌ అనే వ్యక్తి తన ఇంటి పెరట్లో గంజాయి మొక్కలు పెంచుతున్నారు. ఈ విష‌యాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

  విషయం తెలుసుకున్న నెల్లూరు సెబ్-1 ఇన్‌స్పెక్టర్ కిశోష్ త‌న సిబ్బందితో రఫూఫ్‌ నివాసానికి చేరుకున్నారు. అతని నివాసాన్ని సోదా చేశారు. అనంత‌రం ఆ ఇంట్లోని పెర‌టి ఆవ‌ర‌ణ‌లో ఉన్న గంజాయి మొక్కల‌ను చూసి పోలీసులు ఖంగుతిన్నారు. గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు నిర్ధారించుకుని నిందితుడు ర‌ఫూఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

  ఇది చదవండి: ఏటీఎం చోరీ కేసులో నిందితులకు జైలు శిక్ష..! ఎన్ని సంవత్సరాలంటే..!

  ఆ పెరట్లోని గంజాయి మొక్కల శాంపిల్స్‌ను సెబ్ అధికారులు సేక‌రించారు. మిగిలింది మూట క‌ట్టి సీల్ చేశారు. ఈ దాడుల్లో సెబ్ ఏఈఎస్ కృష్ణారెడ్డి, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు. ఇటీవ‌ల కాలంలో నెల్లూరు జిల్లాలో గంజాయి సాగు అక్కడ‌క్కడా సాగుతోంది. స‌మాచారం అందుకుని ఎప్పటిక‌ప్పుడు సెబ్ అధికారులు దాడులు చేస్తూ, వాటిని ధ్వంసం చేస్తున్నారు.

  ఇది చదవండి: అమ్మాయి నుంచి వీడియో కాల్‌ వచ్చింది.. ఎవరా అని లిఫ్ట్‌ చేస్తే షాక్‌..!

  గంజాయి సాగు లేకుండా పోలీసులు త‌గిన చ‌ర్యలు తీసుకుంటున్నారు. అయినా కొన్నిప్రాంతాల్లో గుట్టుచ‌ప్పుడు కాకుండా దీన్ని సాగుచేస్తున్నారు. గంజాయి ఉత్పత్తిని సమూలంగా నిర్మూలించడానికి సమగ్ర ప్రణాళికను రూపొందించి అధికారులు ఆ దిశ‌గా చ‌ర్యలు తీసుకుంటున్నా... వారి క‌ళ్ళు గ‌ప్పి శివారు ప్రాంతాల్లో చాటుమాటున సాగు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఇంటి పెర‌టిలోనే గంజాయి సాగు చేయ‌డం న‌గ‌రంలో క‌ల‌క‌లం రేపింది. నిందితుడు ర‌ఫూఫ్‌ను విచార‌ణ చేస్తోన్న అధికారులు.. మ‌రింత స‌మాచారం రాబడుతున్నారు.

  ఇది చదవండి: సాఫ్ట్ వేర్ జాబ్.. మంచి జీతం.. కానీ యువకుడి సమస్య అదే.. అందరూ చూస్తుండగానే ఘోరం

  ఈ సంద‌ర్భంగా సెబ్ అధికారి మీడియాతో మాట్లాడుతూ సెబ్ జాయింట్ డైరెక్టర్ శ్రీల‌క్ష్మీ ఆదేశాల మేర‌కు నెల్లూరు జిల్లాలో గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపుతున్నామ‌ని చెప్పారు. గంజాయి మ‌త్తు నుండి బ‌య‌ట‌ప‌డేందుకు, దీని వ‌ల్ల క‌లిగే అన‌ర్ధాల‌ను తెలియ‌జేసేందుకు "న‌షా ముక్త భారత్ అభియాన్" కార్యక్రమం పేరిట అవ‌గాహ‌న కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

  తెలిసో తెలియ‌కో, డ‌బ్బు అత్యాశ వ‌ల్లనో కొంత‌మంది వీటిని సాగు చేస్తున్నార‌ని, ఈ కేసులో ప‌ట్టుబ‌డితే మూడేళ్ల నుంచి ప‌దేళ్ళ వ‌ర‌కు శిక్ష ప‌డే అవ‌కాశ‌ముంద‌న్నారు. ఎవ‌రైనా గంజాయి సాగు చేస్తున్నట్లు తెలిస్తే వెంట‌నే 14500 టోల్ ఫ్రీ నెంబ‌రుకు కాల్ చేయాల‌ని పోలీసులు సూచించారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ganja case, Local News, Nellore

  ఉత్తమ కథలు