హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nellore: నెల్లూరులో జర్నీ సీన్ రిపీట్..! రెండు బస్సులు ఢీ.. మధ్యలో లారీ..!

Nellore: నెల్లూరులో జర్నీ సీన్ రిపీట్..! రెండు బస్సులు ఢీ.. మధ్యలో లారీ..!

నెల్లూరు

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

జర్నీ సినిమా (Journey Movie) గుర్తుందా.. అందులో రెండు బస్సులు ఒకదానికొకటి ఎదురుగా వచ్చి ఢీ కొన్న సీన్‌ ఇప్పటికీ అందరికి కళ్లముందే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. సరిగ్గా అలాంటి యాక్సిడెంట్‌ నెల్లూరు జిల్లాలో జరిగింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Nellore, India

  Polaa Sudha, News18, Nelloreజర్నీ సినిమా (Journey Movie) గుర్తుందా.. అందులో రెండు బస్సులు ఒకదానికొకటి ఎదురుగా వచ్చి ఢీ కొన్న సీన్‌ ఇప్పటికీ అందరికి కళ్లముందే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. సరిగ్గా అలాంటి యాక్సిడెంట్‌ నెల్లూరు జిల్లాలో జరిగింది. కానీ అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నెల్లూరు (Nellore) జాతీయ ర‌హ‌దారిపై భారీ రోడ్డు ప్రమాదం (road accident) జ‌రిగింది. మెడిక‌వ‌ర్ ఆస్పత్రి వ‌ద్ద జాతీయ ర‌హ‌దారిపై రెండు బ‌స్సులు ఢీ కొన్నాయి. ఒక‌దానికొక‌టి ఢీ కొన‌డంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
  ఓ ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సు హైద‌రాబాద్ నుంచి బెంగుళూరు (Hyderabad to Bengaluru) వెళుతోంది. కృష్ణప‌ట్నం నుండి ఉద్యోగస్తులతో ప్రయాణ‌మైన బ‌స్సు నెల్లూరు వైపు వ‌స్తోంది. ఈ రెండు బ‌స్సులు మెడిక‌వ‌ర్ ఆస్పత్రి స‌మీపంలోకి రాగానే ఒక‌దానికొక‌టి ఢీ కొన్నాయి. ఈ క్రమంలోనే చెన్నై నుంచి హైదరాబాద్‌కి టైర్‌ల లోడ్‌తో వెళ్తున్న లారీని ఈ బస్సులు ఢీకొట్టాయి. దీంతో ట్రావెల్స్‌ బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. లారీ రోడ్డపక్కన పొలాల్లోకి వెళ్లి బోల్తా పడింది.

  ఇది చదవండి: ఏడో తరగతి బాలికకు 30ఏళ్ల వ్యక్తితో పెళ్లి.. అంతలోనే ఘోరం జరిగిపోయింది..!


  ఆ స‌మ‌యంలో ప్రైవేట్ బ‌స్సులో 25 మంది ప్రయాణీకులు, మ‌రో బ‌స్సులో 15 మంది ఉద్యోగ‌స్తులు ఉన్నారు. ప్రమాదం జ‌ర‌గ‌డంతో బ‌స్సుల్లో ప్రయాణిస్తున్న వారంతా ఒక్కసారిగా భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. ఏం జ‌రిగిందో తెలియ‌క అయోమ‌యంలో ప‌డ్డారు. ప్రమాదం పెద్దదే అయినా, ఎవ‌రికీ ఎలాంటి ప్రాణ‌న‌ష్టం వాటిల్లలేదు. అంద‌రూ సుర‌క్షితంగా చిన్నచిన్న గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు.

  ఇది చదవండి: సైలెంట్‌గా ఉండే అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా కలకలం.. లోపలికెళ్లి చూస్తే అంతా రక్తం..


  అయితే లారీని ఓవ‌ర్ టేక్ చేయ‌బోయిన స‌మ‌యంలో ఈ ప్రమాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం నిత్యం రద్దీగా ఉండే నేషనల్ హైవేపై జరగడంతో ఒక్కసారిగా రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని కేసు న‌మోదు చేశారు. క్షత‌గాత్రుల‌ను చికిత్స కోసం అపోలో, ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


  భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవడంతో క్రేన్‌ల సాయంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సులను పక్కకు తీయించారు. దీంతో ట్రాఫిక్‌ క్లియర్‌ అయింది. ప్రమాదం జ‌రిగిన తీరును పోలీసులు ప‌రిశీలించారు. ప్రమాదానికి గల కార‌ణాల‌పై దర్యాప్తు చేస్తున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Nellore, Road accident

  ఉత్తమ కథలు