హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nellore: గణపయ్యలందు.. ఈ వినాయకుడు వేరయా..? కొబ్బరి చిప్పలతో ముస్తాబైన గణనాథుడు..

Nellore: గణపయ్యలందు.. ఈ వినాయకుడు వేరయా..? కొబ్బరి చిప్పలతో ముస్తాబైన గణనాథుడు..

కొబ్బరి

కొబ్బరి చిప్పలతో గణపతి

Nellore: నెల్లూరు జిల్లాలో వినాయ‌క చ‌వితి న‌వ‌రాత్రి ఉత్సవాలు నేత్రోత్సవంగా జ‌రుగుతున్నాయి. వాడ‌వాడ‌లా అందమైన గ‌ణేష్ మండ‌పాలు వెలిసాయి. ముఖ్యంగా భిన్న రూపాల్లో ఉన్న మహావినాయకుడి ప్రతిమ‌లు భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Nellore, India

  Polaa Sudha, News18, Nellore.

  Ganesh Chaturthi:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)  వ్యాప్తంగా ఘనంగా వినాయక వేడుకలు (Vinayaka Chavithi Celebrations) జరుగుతున్నాయి. ఇక నెల్లూరు జిల్లా (Nellore District) లో వినాయ‌క చ‌వితి న‌వ‌రాత్రి ఉత్సవాలు నేత్రోత్సవంగా జ‌రుగుతున్నాయి. వాడ‌వాడ‌లా అందమైన గ‌ణేష్ మండ‌పాలు వెలిసాయి. ముఖ్యంగా భిన్న రూపాల్లో ఉన్న మహావినాయకుడి ప్రతిమ‌లు భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. గ‌ణేష్ ఉత్సవ క‌మిటీ స‌భ్యులు పోటీలు పడి మరి వినూత్నంగా ఉండే విగ్రహాల‌ను ఏర్పాటు చేశారు. ఇక నెల్లూరుకి చెందిన సీఎంఆర్ షాపింగ్ మాల్ యాజ‌మాన్యం గ‌త కొన్నేళ్ళ విభిన్న రీతిలో బొజ్జ గ‌ణ‌ప‌య్య విగ్రహాల‌ను ఏర్పాటుచేసి సింహ‌పురి వాసుల మ‌న్ననలు అందుకుంటోంది.

  ఈ ఏడాది కూడా సీఎంఆర్ షాపింగ్ మాల్ బిన్నంగా, కొత్తగా ఉండే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని భ‌క్తులు అనుకున్నారు. అందరూ ఊహించిన‌ట్లే భిన్న రూపంలో ఉండే లంబోధరుని విగ్రహాన్ని నెల‌కొల్పారు. ఈ సారి ఎండు కొబ్బరి చిప్పలతో భిన్న రీతిలో గ‌ణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప‌ది అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రతిమను 2500 కొబ్బరి చిప్పలతో రూపొందించారు. ఈ కొబ్బరిచిప్పలతో తయారుచేసిన గణపయ్య సింహ‌పురి వాసుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాడు.

  నెల్లూరు క‌న‌క‌మ‌హ‌ల్ సెంట‌రులోని సీఎంఆర్ షాపింగ్ మాల్  ప్రతి ఏటా వినూత్నంగా ఉండే గ‌ణ‌ప‌తి విగ్రహాన్ని నెల‌కొల్పడం ఆనవాయితీగా వ‌స్తోంది. అయితే గ‌త రెండేళ్ళు కోవిడ్ కార‌ణంగా భారీ వినాయ‌కుడిని నెల‌కొల్పలేదు. ఈ ఏడాది కరోనా ఆంక్షలు ఎత్తేయడంతో… నెల్లూరు వ్యాప్తంగా వినాయ‌క చ‌వితి ఉత్సవాలు ఘ‌నంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే సీఎంఆర్ షాపింగ్ యాజ‌మాన్యం కూడా త‌మ షాపు ముందు భారీ మండపం కట్టి అందులో పర్యావరణహిత వినాయ‌క ప్రతిమ‌ను ఏర్పాటు చేశారు.

  ఇదీ చదవండి : స్వాతంత్య్ర సమరయోధుల మధ్య వినాయకుడు.. దైవభక్తితో పాటు దేశ భక్తి

  ఇత‌ర ప్రాంతాల్లో కంటే సీఎంఆర్ షాపింగ్ మాల్ (CMR SHoping mall) ఏర్పాటు చేసిన గ‌ణ‌ప‌య్యను చూసేందుకు భ‌క్తులు పెద్దసంఖ్యలో త‌ర‌లి వ‌స్తున్నారు. సాయంత్రం పూట ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన‌, కాలుష్య ర‌హిత‌మైన వినాయ‌క విగ్రహాల‌ను నెల‌కొల్పేందుకే ప్రతి ఏటా సీఎంఆర్ షాషింగ్ యాజ‌మాన్యం అధిక ప్రాధాన్యత ఇస్తూ వ‌స్తోంది. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా అలాంటి ఏక‌దంతుడి విగ్రహాన్ని నెల‌కొల్పింది. వినూత్నంగా క‌నిపిస్తోన్న విఘ్నవిదాతను దర్శించుకునేందుకు భక్తులు క్యూ క‌డుతున్నారు.

  ఇదీ చదవండి: ఈ మహానగరానికి ఏమైంది..? భయపెడుతున్న వరుస ప్రమాదాలు.. ఖాకీలను వెంటాడుతున్నాయి..

  ఒక్క కనకమహాల్‌ సెంటర్‌లోనే కాదు నెల్లూరు నగరమంతా అంగరంగ వైభవంగా విభిన్న విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. గణేష్ ఉత్సవాల్లో భక్తులు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Ganesh Chaturthi​ 2022, Local News, Nellore

  ఉత్తమ కథలు