హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nellore: ఈ వింత విన్నారా..? చేపలు ఎండబెట్టేందుకు కూడా మిషన్..!

Nellore: ఈ వింత విన్నారా..? చేపలు ఎండబెట్టేందుకు కూడా మిషన్..!

X
చేపల

చేపల డ్రై మిషెన్

Nellore: టెక్నాలజీ రోజు రోజుకూ పెరిగిపోతోంది. మనిషికి అవసరమైన అన్ని పననులు.. మిషన్లే చేసేస్తున్నాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా చేపలను ఎండబెట్టే మిషన్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి తెలుసా..?

  • News18 Telugu
  • Last Updated :
  • Nellore, India

Polaa Sudha, News18, Nellore.

భవిష్యత్తులో మనిషి శ్రమించాల్సిన అవసరం ఉండదు ఏమో.. టెక్నాలజీ కొత్త పుంతలు (New Technology) తొక్కుతున్న వేళ.. మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా నెల్లూరు (Nellore) లో ఓ మిషన్ ప్రత్యేకంగా నిలుస్తోంది. దాని ప్రత్యేకత ఏంటో తెలుసా..? సాధారణంగా నాన్ వెజ్ ప్రియుల్లో సీ ఫుడ్ ఇష్టప‌డే వారు ఎంతోమంది ఉంటారు. అయితే ప‌చ్చి రొయ్యలు, చేప‌ల‌తో పోలిస్తే ఎండు చేప‌లు, రొయ్యలు ఆరోగ్యానికి ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు. పోష‌క విలువ‌లు కూడా ఎక్కువ‌గా ల‌భ్యం అవుతాయి. అయితే చేప‌ల‌ను, రొయ్యలు ఎండ‌బెట్టాలంటే పెద్ద సాహసమే.

ఎండబెట్టడం అనేది చేపలను ప్రాసెస్ చేయడానికి, భవిష్యత్ ఉపయోగం కోసం సిద్ధం చేయడానికి చేసే ప్రక్రియ‌. ఇందుకోసం ప్రకృతిపై ఆధార‌ప‌డాల్సి వ‌చ్చేది. దీనివల్ల చాలా స‌మ‌యం వెచ్చించాల్సి వ‌స్తుంది.

కానీ మారుతున్న కాలంలో, ప‌రుగులు తీసే మాన‌వ ప్రపంచంలో.. అంత స‌మ‌యం కేటాయించేందుకు నేటి తరం ఎవ్వరూ ఇష్టప‌డ‌డం లేదు. అందులోనూ సాంకేతిక పెర‌గ‌డంతో..ప్రతి దానికి మెషీన్లు వచ్చినట్లు చేపలు ఎండపెట్టటానికి కూడా మెషిన్లు పుట్టుకొచ్చాయి.

ఇదీ చదవండి : ఆ గార్డెన్స్ లో దొరకని మొబైల్ ఉండదు.. ఇంకా ప్రత్యేకత ఏంటంటే?

మన దేశంలో చేప‌లు, రొయ్యలు ఎండ బెట్టేందుకు ప్రకృతి మీద ఆధార‌ప‌డే వారే ఎక్కువ‌. కానీ విదేశాల్లో మాత్రం మిషీన్ల ద్వారానే ఎండ బెట్టేస్తుంటారు. ఈ సాంకేతిక ప‌రిజ్ఞానం ఇప్పుడు మ‌న దేశంలోనూ విస్తరిస్తోంది. వీటిని ఎండ బెట్టేందుకు హమిడిఫయర్లు అందుబాటులోకి వ‌చ్చేశాయి. చెన్నైకి చెందిన సంస్థ ఈ హమిడిఫయర్లను తయారు చేస్తోంది. నెల్లూరులో జ‌రిగిన ఫిష్ ఫుడ్ ఫెస్టివ‌ల్- 2022లో వీటిని ప్రద‌ర్శన‌కు ఉంచారు. ప్రత్యేకంగా ఓ స్టాల్‌ను కూడా ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి : రోడ్డుపై చెత్త ఊడుస్తున్న సర్పంచ్‌..! ఎందుకిలా చేస్తోందా తెలుసా?

ప‌చ్చి చేప‌లు, రొయ్యలు ఎలా ఎండ బెట్టవ‌చ్చో చూపించారు. త‌ద్వారా స‌మ‌యం ఆదా అవుతోంది. ఇలా ఎండ బెట్టిన వాటిని చ‌క్కగా ప్యాకింగ్ చేసి ఇత‌ర ప్రాంతాల‌కు ర‌వాణా కూడా చేయ‌వ‌చ్చు. ఫిష్ ఫుడ్ ఫెస్టివ‌ల్‌కు వ‌చ్చిన సంద‌ర్శకుల‌కు, మ‌త్స్యకారుల‌కు హమిడిఫయర్లు ప‌నిచేసే తీరును, సాంకేతిక ప‌నిత‌నాన్ని సంస్థ ప్రతినిధులు వివ‌రించారు.

ఇదీ చదవండి : మాజీ ఎంపీ.. బీజేపీ నేత అరెస్ట్.. కారణం ఏంటో తెలుసా..?

మ‌త్స్యకారుల‌ను ప్రోత్సహించేందుకు, ఆక్వా రంగంలో స్థిర‌ప‌డాల‌నుకునే వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం కూడా హ‌మిడిఫ‌య‌ర్లను ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం స‌బ్సిడీ ద్వారా వాటిని అంద‌చేస్తోంది. ఈ హమిడిఫయర్లు చేప‌ల్లో, రొయ్యల్లో ఉండే తేమను తొల‌గిస్తాయి. ఇందులో ఎండ బెట్టేందుకు ప్రత్యేక ప‌ద్దతుల‌ను అవ‌లంభిస్తారు. క‌రెంట్ ద్వారా ఎండ‌బెట్టడం వ‌ల్ల చేప‌ల్లో, రొయ్యల్లో ఉండే బ్యాక్టీరియా, సూక్ష్మ జీవులు కూడా నశిస్తాయి. ఎండిన‌ పదార్థాలు చెడిపోకుండా ఉంటాయి.

ఇదీ చదవండి : తనిఖీల్లో భాగంగా ఆటోను ఆపిన పోలీసులు..! తీరా అందులో ఉన్నది చూసి షాక్..!

విదేశాల్లో ఎక్కువగా హమిడిఫయర్లను వినియోగిస్తుంటారు. భార‌తదేశంలోనూ ఇప్పుడిప్పుడే ఇవి ఊపందుకున్నాయి. చెన్నై కేంద్రంగా వీటిని వినియోగంలోకి తెస్తున్నారు. బాగా ఎండ‌బెట్టిన త‌ర్వాత చేప‌ల‌ను, రొయ్యల‌ను వ్యాక్యూమ్ ప్యాకింగ్ చేస్తే.. సంవ‌త్సరం వరకు ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Fish, Local News, Nellore

ఉత్తమ కథలు