Polaa Sudha, News18, Nellore.
Unstoppable Biryani: సాధారణంగా బిర్యానీ అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది హైదరాబాద్ (Hyderabad). కానీ ఇప్పుడు బిర్యానీ అన్ని ప్రాంతాల్లోనూ దొరుకుతుంది. దొరకడమే కాదు ఆయా ఏరియాల్లో స్పెషల్ బిర్యానీ తయారవుతుంది. అందులో నెల్లూరు (Nellore) కూడా ఒకటి. ఇక్కడ కూడా ఎన్నో రకాల బిర్యానీలు తయారుచేస్తారు. అలాంటి వాటిలో అన్ లిమిటెడ్ బిర్యానీ (Unlimited Biryani) కూడా ఒకటి. నెల్లూరు టౌన్‌లోని చిల్డ్రన్స్ పార్క్ (Children's Park) సమీపంలో అక్కాబావ ఫ్యామిలీ రెస్టారెంట్ (Akka Bava Family Restaurant) ఉంది. రెస్టారెంట్ పేరే డిఫరెంట్ అనుకుంటే ఇందులో ఫుడ్ కూడా అంతే ప్రత్యేకంగా అన్ లిమిటెడ్‌గా దొరుకుతుంది.
నెల్లూరులో చాలాచోట్ల బిర్యానీ సెంటర్లు ఉన్నాయి. కొన్నిచోట్ల కేజీ, అరకేజీ, బకెట్ బిర్యానీలు అమ్ముతుంటారు. కానీ అక్కబావ ఫ్యామిలీ రెస్టారెంట్లో అన్ లిమిటెడ్ పేరుతో బిర్యానీని అందిస్తారు. కేవలం 135 రూపాయలకే ఇక్కడ మీకు కావల్సినంత బిర్యానీని కడుపుబ్బా ఆరగించవచ్చు. బిర్యానీ లవర్స్ కోసం ఈ రెస్టారెంట్ నిర్వాహకులు ఈ కాన్సెప్ట్‌ను ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చారు. సామాన్యులు కూడా తృప్తిగా తినాలనే ఉద్దేశ్యంతో అన్ లిమిటెడ్ బిర్యానీ పేరుతో బిర్యానీని అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
బిర్యానీది ఒక్కో ప్రాంతంలో ఒక్కో రుచి. ఒక్కో రకమైన ఓ సువాసన. ప్రాంతాన్ని బట్టి వండే విధానం కూడా ఉంటుంది. నెల్లూరులో బిర్యానీ వండే స్టయిలే వేరు. అందులోనూ అక్కబావ ఫ్యామిలీ రెస్టారెంట్లో వండే బిర్యానీకి ఎంతో క్రేజ్ ఉంటుంది. తాజాగా శుచిగా, టేస్టీగా, స్పైసీగా వండుతారు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ, ధమ్ బిర్యానీ, బోన్ లెస్ బిర్యానీ ఇలా రకరకాల బిర్యానీలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
ఇక బిర్యానీ వంటకంలో జీలకర్ర, పసుపు, నల్ల మిరియాలు, అల్లం వంటి మసాలా దినుసుల మిశ్రమాన్ని స్వయంగా తయారుచేస్తారు. అందుకే ఈ బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది. అందుకే సింహపురి వాసులు ఎక్కువగా అన్ లిమిటెడ్ బిర్యానీని ఆరగించేందుకు క్యూ కడుతుంటారు.
బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చిన్నా పెద్దా అందరూ బిర్యానీ కోసం ఎగబడుతుంటారు. ఇష్టంగా భుజిస్తారు. వెజిటేరియన్ల కోసం వెజ్ బిర్యానీలుంటాయి. అందులో కొన్ని రకాలు మాత్రమే ఉంటాయి. కానీ నాన్ వెజ్ లో చెప్పాల్సిన అవసరం లేదు. పదుల సంఖ్యలో భిన్న రుచుల్లో బిర్యానీ అందుబాటులో ఉంటుంది. అలాంటి బిర్యానీ మన పాకెట్ బడ్జెట్లో దొరికితే ఇంకేముంది.. పండగే.
ఇదీ చదవండి: నేతలకు సీరియస్ వార్నింగ్.. తప్పించుకుని తిరిగి వారి లిస్ట్ దగ్గర ఉందంటూ చంద్రబాబు క్లాస్
ఈ రెస్టారెంట్లో మూడు ప్యాకేజీలలో బిర్యానీ అందిస్తారు. రూ.199, రూ.135, రూ.99లలో ఇక్కడ బిర్యానీ దొరుకుతుంది. రూ.199లకు ఆరు చికెన్ ముక్కలు, ఒక గుడ్డు, అన్ లిమిటెడ్ బిర్యానీ రైస్‌ను అందిస్తారు. అతి తక్కువగా 135 రూపాయిలకే అన్ లిమిటెడ్ బిరియానీని అందిస్తుండడంతో నెల్లూరు వాసులు ఈ రెస్టారెంట్‌ని ఆదరిస్తుంటారు. 135 రూపాయల బిర్యానీ ప్యాకేజీలో మూడు చికెన్ ముక్కలు, ఒక గుడ్డు, అన్లిమిటెడ్ బిర్యానీ రైస్‌ను అందిస్తారు. అయితే ఇదే రెస్టారెంట్లో స్టూడెంట్స్ కోసం కూడా ప్రత్యేకంగా బిర్యానీ ప్యాకేజీ ఉంది. అది రూ.99లకే బిర్యానీని స్టూడెంట్స్‌కి ఇస్తారు. ఇందులో రెండు చికెన్ ముక్కలు, ఒక గుడ్డు, బిర్యానీ రైస్ అందిస్తారు.
అడ్రస్ : అక్కాబావ ఫ్యామిలీ రెస్టారెంట్, చిల్డ్రన్స్ పార్క్ రోడ్, ఆదిత్యా కాలేజ్, నెల్లూరు- 524001
ఫోన్ నెంబర్ : 77028 65221
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Local News, Nellore