హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nellore: ఛీఛీ మీరు మనుషులేనా..? ఫీజులు కట్టలేదని అలా చేస్తారా..?

Nellore: ఛీఛీ మీరు మనుషులేనా..? ఫీజులు కట్టలేదని అలా చేస్తారా..?

ఫీజు

ఫీజు కట్టలేదని దారుణం

Nellore: కార్పొరేట్ స్కూళ్ల కాసుల కక్కుర్తికి అడ్డుకట్ట పడడం లేదు. పాపం విద్యార్థులు అని జాలి చూపించడం లేదు.. ఫీజు లేటైంది అంటే ఏం చేయాలి.. తల్లిదండ్రులను అడగాలి.. అర్థమయ్యాలా చెప్పి వసూలు చేసుకోవాల.. కానీ ఈ స్కూల్ సిబ్బంది చేసిన పని తెలిస్తే.. ఛీ ఛీ మీరు మనుషులేనా అని అనాల్సిందే..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India

  Polaa Sudha, News18, Nellore

  Nellore: కార్పొరేట్ స్కూళ్ల  (Corporate Schools) కాసుల కక్కుర్తి  మరో లెవెల్లో ఉంటోంది. కేవలం ధ‌నార్జనే ధ్యేయంగా కొన్ని స్కూళ్ళు న‌డుస్తున్నాయి. ప్రభుత్వ నిబంధ‌న‌లు అమ‌లు చేయ‌కుండా, ఇష్టారాజ్యంగా వ్యవ‌హ‌రిస్తున్నాయి. ఫీజులు క‌ట్టని విద్యార్ధుల ప‌ట్ల అమానుషంగా ప్రవ‌ర్తిస్తున్నాయి. లోన్ యాప్ (Loan APP) ల వేధింపుల లానే ఈ కార్పొరేట్ స్కూళ్ల తీరు ఉంటోంది. ఫీజులు సరైన టైంకు ఫీజులు కట్టకపోతే.. లోన్ యాప్ ల వారి కంటే దారుణంగా వేధిస్తున్నారని.. కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తారు.. తాజాగా  నెల్లూరు జిల్లాలోనూ కావలనిలో  ఓ స్కూళ్లో జరిగిన ఘటన కలకలం రేపింది.

  నెల్లూరు జిల్లా (Nellore District) కావ‌లి ప‌ట్టణంలోని శ్రీ చైత‌న్య ప్రైవేట్ స్కూల్ (Srichaitanay Praivate School) విద్యార్ధుల ప‌ట్ల వ్యవ‌హరించిన తీరు స‌ర్వత్రా చ‌ర్చనీయాంశ‌మైంది. ఫీజులు క‌ట్టలేద‌ని విద్యార్ధుల‌ను గ‌దిలో బంధించింది. స్కూల్‌లో చ‌దువుతున్న కొంద‌రు పేద విద్యార్ధులు ఫీజులు క‌ట్టడం ఆల‌స్యమైంది.

  దీంతో సిబ్బంది విద్యార్ధుల ప‌ట్ల అమానుషంగా ప్రవ‌ర్తించింది.ఫీజులు క‌ట్టక‌పోతే స్కూల్ కు రావొద్దని హెచ్చరించింది. అంత‌టితో ఆగ‌కుండా ఫీజులు క‌ట్టని 12 మంది విద్యార్ధుల‌ను ఓ గ‌దిలో బంధించి హింసించింది. దీంతో విద్యార్ధులు అవ‌మాన భారంతో కృంగిపోయారు. ఈ విష‌యం తెలిసిన త‌ల్లిదండ్రులు శ్రీ చైత‌న్య స్కూల్‌కి చేరుకుని.. పిల్లల‌ను ఎందుకు బంధించార‌ని యాజమాన్యాన్ని నిల‌దీశారు.

  ఇదీ చదవండి : రోడ్డుపై చెత్త ఊడుస్తున్న సర్పంచ్‌..! ఎందుకిలా చేస్తోందా తెలుసా?

  ఫీజులు క‌ట్టలేద‌ని అందుకే గ‌దిలో పెట్టామ‌ని స్కూల్ యాజ‌మాన్యం నిర్లక్ష్యంగా స‌మాధానం చెప్పడంతో, త‌ల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరువ‌ర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామ‌ని త‌ల్లిదండ్రులు చెప్పడంతో.. దిక్కున్నచోట చెప్పుకోండంటూ దురుసుగా స్కూల్ సిబ్బంది తెల‌ప‌డంతో తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

  ఇదీ చదవండి : తనిఖీల్లో భాగంగా ఆటోను ఆపిన పోలీసులు..! తీరా అందులో ఉన్నది చూసి షాక్..!

  చ‌దువు చెప్పాల్సిన చోట నిలువు దోపిడీ చేస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్కూల్ ఆవ‌ర‌ణలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. విద్యార్ధుల‌ను గ‌దిలో బంధించార‌న్న స‌మాచారం తెలుసుకుని విద్యార్ధి సంఘాలు, నాయ‌కులు కూడా శ్రీచైత‌న్య స్కూల్ వ‌ద్దకు చేరుకున్నారు. స్కూల్ యాజ‌మాన్యం వ్యవ‌హ‌రించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

  ఇదీ చదవండి: బిడ్డకు ప్రాణం పోసిన మెడిసన్ విద్యార్థి.. ట్రైన్ లో నిండు గర్భిణికి డెలివరీ

  కార్పోరేట్ స్కూల్ ధ‌నార్జనే ధ్యేయంగా విద్యార్ధుల త‌ల్లిదండ్రుల‌ నుంచి ఫీజుల‌ను గుంజుతున్నార‌ని, ఈ దోపిడీని అరిక‌ట్టాల్సిన అధికారులు మాత్రం నిద్రమ‌త్తులో ఉన్నార‌ని విమ‌ర్శించారు. ఇలాంటి స్కూళ్ళ ఆగ‌డాల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్ధుల‌ను బంధించిన శ్రీ చైత‌న్య స్కూల్ యాజ‌మాన్యంపై చైల్డ్ ప్రొటెక్షన్ చ‌ట్టం ప్రకారం క్రిమిన‌ల్ కేసులు బ‌నాయించాల‌ని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘ నాయకులు కోరుతున్నారు.

  First published:

  Tags: Andhra Pradesh, AP News, Local News, Nellore, Private school

  ఉత్తమ కథలు